- నీటి వాడకాన్ని పరిశీలించనున్న గోదావరి బోర్డు
బోర్డు పరిధిలో బ్యారేజీ
Published Sun, Nov 20 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
ధవళేశ్వరం :
గోదావరి బోర్డు పరిధిలోకి ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజ్ చేరింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేష¯ŒS విడుదలైంది. గోదావరికి సంబంధించి రాష్ట్రంలో నిర్మాణం పూర్తయి న ప్రాజెక్ట్ ధవళేశ్వరంలోని సర్‌ఆర్థర్ కాట¯ŒS బ్యారేజ్. ప్రస్తుతం గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగాన్ని బోర్డు పరిశీలిస్తుంది. రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు నీటి వినియోగం జరిగేలా బోర్డు చూస్తుంది. ఒకవేళ ఇరురాష్ట్రాలకు మధ్య ఏదైనా వాదనలు చోటుచేసుకున్న సమయంలో బోర్డు మధ్యవర్తిత్వం వ్యవహరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ట్రిబ్యునల్‌లో ఇచ్చిన కేటాయింపుల ప్రకారం నీటి పంపిణీ చేయాల్సి ఉంటుంది. గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదికలను గోదావరి బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజీకి సంబంధించి ఖరీఫ్‌లో ఎటువంటి నీటి ఇబ్బందులు లేవు. ఖరీఫ్ సమయంలో వరదల సీజ¯ŒS కావడంతో భారీగా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. ప్రధానంగా రబీలోనే నీటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్కోసారి సహజలాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఎగువ ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సీలేరుపైనే ఆధారపడాల్సి వస్తుంది. బ్యారేజ్‌కు సంబంధించి నిర్వహణ పనులు,నీటి వినియోగాన్ని కూడా ఇకపై బోర్డే పర్యవేక్షించనుంది.
Advertisement
Advertisement