dowleswaram
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద
-
దడ పుట్టిస్తున్న ధవళేశ్వరం
-
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
కాటన్ బ్యారేజ్ నుంచి 1,67,831 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను 0.40 మీటర్లు మేర పైకి లేపి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం బ్యారేజ్ వద్ద 7.90 అడుగుల నీటి మట్టం ఉండగా 1,67,831 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. లక్ష క్యూసెక్కులు దాటి మిగులు జలాలను విడుదల చేయడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం. శబరి పరీవాహక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతుండటంతో బుధవారం కూడా నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం కాటన్ బ్యారేజ్ వద్ద సుమారు రెండు లక్షల క్యూసెక్కులు దాటి నీటి ప్రవాహం సాగే అవకాశం ఉంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది. బలహీనంగా ఉన్న దిగువ ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 900 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.71 మీటర్లు, పేరూరులో 4.73 మీటర్లు, దుమ్ముగూడెంలో 6.34 మీటర్లు, భద్రాచలంలో 16.90 అడుగులు, కూనవరంలో 7.88 మీటర్లు, కుంటలో 9.50 మీటర్లు, కొయిదాలో 9.42 మీటర్లు, పోలవరంలో 6.72 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 13.90 అడుగుల వద్ద నీటి మట్టాలు నమోదయ్యాయి. -
ధవళేశ్వరం పీహెచ్‌సీకి రాష్ట్ర ఉత్తమ అవార్డు
ధవళేశ్వరం: రాష్ట్ర ఉత్తమ పీహీచ్సీ అవార్డును రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన ధవళేశ్వరం పీహెచ్సీ గెలుచుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పీహెచ్సీ వైద్యాధికారి కె.సుధాకర్ శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు. ఈ పీహెచ్‌సీకి ప్రతి రోజూ 200వరకు ఓపీ ఉంటుంది. సిబ్బంది రోగులకు మెరుగైన సేవలందించడంతో టీబీ యూనిట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిబ్బంది అందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డును కైవసం చేసుకోగలిగామని శనివారం వైద్యాధికారి సుధాకర్ అన్నారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. -
మానవత్వం మరిచాం.. మన్నించమ్మా..!
నాలుగు రోజులుగా చలికి వణుకుతున్న వృద్ధురాలు తనది అమలాపురమని, కొడుకు వస్తాడని ఎదురు చూపు.. సాయం అందిస్తున్న స్థానికులు ధవళేశ్వరం : తాను జన్మనిచ్చిన బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు.. బంధువులు ఎక్కడున్నారో తెలియదు.. తన కోసం తనను తీసుకువెళ్లేందుకు తన కొడుకు వెంకన్న వస్తాడంటూ చలిలో వణుకుతూ అంటున్న ఆ అమ్మ మాటలు స్థానికులను కలచివేశాయి. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన ఆ పెద్దావిడను నాలుగు రోజుల క్రితం ధవళేశ్వరం బస్టాండ్ వద్ద ఎవరో గుర్తు తెలియని వారు వదిలి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. గురువారం ధవళేశ్వరం రామపాదాలరేవులోని రామాలయం వద్ద ఎవరో ఆమెను వదిలి వెళ్ళిపోయారు. దయగలవారెవరో ఆమెకు ఒక దుప్పటి ఇచ్చి ఆహారం ఇచ్చారు. బంధువుల సమాచారం అడగ్గా తన పేరు రంకిరెడ్డి సూర్యకాంతం అని, తనది అమలాపురం దగ్గర కొంకాపల్లి గ్రామం అని తనను తీసుకువెళ్ళేందుకు తన కొడుకు వెంకన్న వస్తాడంటూ చెబుతున్నది. సుమారు 80 ఏళ్ల వయస్సు ఉండే ఆ పెద్దావిడ చలిలో గజగజ వణుకుతూ కాలం గడుపుతోంది. అయినవారు ఉన్నారో లేక సభ్య సమాజం తలదించుకునేలా వదిలించుకున్నారో తెలియాల్సి ఉంది. అయినవారు పట్టించుకోనప్పటికీ స్థానికులు, యువకులు ఆమెకు సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. -
బోర్డు పరిధిలో బ్యారేజీ
నీటి వాడకాన్ని పరిశీలించనున్న గోదావరి బోర్డు ధవళేశ్వరం : గోదావరి బోర్డు పరిధిలోకి ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజ్ చేరింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేష¯ŒS విడుదలైంది. గోదావరికి సంబంధించి రాష్ట్రంలో నిర్మాణం పూర్తయి న ప్రాజెక్ట్ ధవళేశ్వరంలోని సర్ఆర్థర్ కాట¯ŒS బ్యారేజ్. ప్రస్తుతం గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగాన్ని బోర్డు పరిశీలిస్తుంది. రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు నీటి వినియోగం జరిగేలా బోర్డు చూస్తుంది. ఒకవేళ ఇరురాష్ట్రాలకు మధ్య ఏదైనా వాదనలు చోటుచేసుకున్న సమయంలో బోర్డు మధ్యవర్తిత్వం వ్యవహరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ట్రిబ్యునల్‌లో ఇచ్చిన కేటాయింపుల ప్రకారం నీటి పంపిణీ చేయాల్సి ఉంటుంది. గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదికలను గోదావరి బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజీకి సంబంధించి ఖరీఫ్‌లో ఎటువంటి నీటి ఇబ్బందులు లేవు. ఖరీఫ్ సమయంలో వరదల సీజ¯ŒS కావడంతో భారీగా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. ప్రధానంగా రబీలోనే నీటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్కోసారి సహజలాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఎగువ ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సీలేరుపైనే ఆధారపడాల్సి వస్తుంది. బ్యారేజ్‌కు సంబంధించి నిర్వహణ పనులు,నీటి వినియోగాన్ని కూడా ఇకపై బోర్డే పర్యవేక్షించనుంది. -
సబ్ప్లాన్నిధులకు ప్రతిపాదనలు ఇవ్వండి
ధవళేశ్వరం : ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ఇరిగేషన్ శాఖకు కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్ బాబు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, చిన్న, సన్నకారు రైతులకు సేద్యపు నీటిని అందించడం, వరద ముంపునకు గురయ్యే దళిత, గిరిజన ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్ట పరచడం, గ్రోయిన్ల నిర్మాణాలకు సబ్‌ప్లాన్ నిధులను వెచ్చించేందుకు వీలుందన్నారు. కె గంగవరం మండలం శేరిలంకలో రూ. 16 కోట్ల ప్రతిపాదనలను, ఐ పొలవరం మండలం ఎదుర్లంకలో రూ. 1.99 కోట్ల ప్రతిపాదనలను తమ శాఖ ఉన్నతాధికారులకు పంపిచామని ఎస్ఈ రాంబాబు వివరించారు. ఈ ప్రతిపాదనలను నోడల్ ఏజన్సీ ద్వారా నిధులకు కృషిచేస్తున్నామన్నారు. -
3.38 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ధవళేశ్వరం : కాటన్ బ్యారేజ్ నుంచి గురువారం సాయంత్రం 3,38,284 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద గురువారం సాయంత్రం 10.30 అడుగుల వద్ద నీట్టి మట్టం నెలకొంది. తూర్పు,మధ్య ,పశ్చిమ డెల్టాలకు 12,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.26 మీటర్లు,పేరూరులో 7.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 7.61 మీటర్లు, భద్రాచలంలో 25.30 అడుగులు, కూనవరంలో 9.14 మీటర్లు, కుంటలో 4.60 మీటర్లు, పోలవరంలో 8.79 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.24 మీటర్లు వద్ద నీటిమట్టాలు నెలకొన్నాయి. -
రేపు క్వాయర్ బోర్డులో జాబ్‌మేళా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : జిల్లాగ్రామీణాభివృద్ధిసంస్థ ఆధ్వర్యలో ఈనెల 14న రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం రోడ్ దగ్గర ఉన్న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు ఎస్.మల్లిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం షైన్‌డోవ్ కంపెనీలో పనిచేయుటకు కస్టమర్‌కేర్(మహిళలు),బిజినెస్డవలప్మెంట్(పురుషులు) డిగ్రీ పాసై, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరిజిల్లాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్‌లో రిటైల్ స్టోర్ మేనేజర్(బీఎస్సీ/ఎంబీఏ/అగ్రికల్చర్ డిప్లమో/అగ్రికల్చర్)గా పనిచేయుటకు 20 నుంచి 30సంవత్సరాల వయస్సు గల పురుషులు కావాలన్నారు. కావున అర్హత కల్గిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు నకలు, రేషన్‌కార్డు నకలుతో హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు సెల్ : 94413 59873ను సంప్రదించాలన్నారు. -
గలగలా గోదారి..
ధవళేశ్వరం : కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి ఉధృతి స్వల్పంగా పెరిగింది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బ్యారేజ్ వద్ద 6.50 అడుగుల నీటిమట్టం ఉండగా 3,24,806 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాచలం వద్ద 37.80 అడుగులకు చేరుకున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటల వరకూ అదేస్థాయిలో నిలకడగా కొనసాగింది. తూర్పు డెల్టాకు 500, మధ్య డెల్టాకు 1000, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగడంతో బుధవారం ఉదయానికి కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.80 మీటర్లు, పేరూరులో 10.69 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.46 మీటర్లు, కూనవరంలో 12.52 మీటర్లు, కుంటలో 4.47 మీటర్లు, కొయిదాలో 16.26 మీటర్లు, పోలవరంలో 10.37 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.02 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. కళకళా తాండవ కోటనందూరు : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాండవ జలాశయం నిండు కుండలా కళకళలాడుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జలాశయం సముద్రాన్ని తలపిస్తోంది. క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నందున ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో వస్తోందని తాండవ అధికారులు చెబుతున్నారు. జలాశయ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ఇప్పటికే 372.5 అడుగులకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. నీటిమట్టం 377 అడుగులకు చేరితే తరువాత వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా అదే స్థాయిలో నీటిని నదికి విడిచి పెడతామని డీఈ రాజేంద్రకుమార్ తెలిపారు. ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు ఉన్నందున ఆయకట్టుకు నీటి అవసరం లేదని, పంట చివర్లో కొంతమేర నీటిని విడిచి పెట్టి, రబీకి కూడా పూర్తిస్థాయిలో అందుతుందని డీఈ వివరించారు. జలాశయాన్ని పరిశీలించిన డీఈ తాండవ జలాశయాన్ని డీఈ ఎం.రాజేంద్రకుమార్ మంగళవారం పరిశీలించారు. జలాశయానికి ఉధృతంగా నీరు వస్తున్నందున ఏఈలు శ్యామ్‌కుమార్, చిన్నారావు, వర్క్ ఇన్స్పెక్టర్ నాగబాబులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. సందర్శకులను ఎవరిని జలాశయం వద్దకు వెళ్లనీÄñæ¬ద్దని సిబ్బందిని ఆదేశించారు. -
గోదావరికి మళ్లీ పెరిగిన వరద
నెల్లిపాక: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎటపాక మండలంలో పలు వాగులు పోటెత్తాయి. శనివారం అర్ధరాత్రి భారీగా నీరు చేరడంతో ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి వరద 38 అడుగులకు చేరింది. మధ్యాహ్నం ఎగువన ఉన్న చర్ల తాలిపేరు ప్రాజñ క్టు నుంచి 7 గేట్లు ఎత్తి సుమారు 21వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. 6.23 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల ధవళేశ్వరం : ఆదివారం రాత్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి 6,23,071 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు డెల్టాకు 4100, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.98 మీటర్లు, పేరూరులో 11.50 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.63 మీటర్లు, కూనవరంలో 13.45 మీటర్లు, కుంటలో 7.55 మీటర్లు, కొయిదాలో 17.46 మీటర్లు, పోలవరంలో 11.06 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 15 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
గోదావరి అంత్య పుష్కరాల్లో అపశృతి
ధవళేశ్వరం : గోదావరి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ధవళేశ్వరంలోని కేదారలంక ఘాట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పవిత్ర స్నానం కోసం నదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు గోదావరి అంత్య పుష్కరాలకు భక్తజనం పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. పుష్కర గ్రామీణ ఘాట్లన్ని కిటకిటలాడుతున్నాయి. పెనుగొండలోని సిద్ధాంతం, పెరవలి తీపర్రు, గన్నవరం వైనతేయ గోదావరి, నిడదవోలు పెండ్యాల, నరసాపురం వశిష్ట గోదావరి, గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. -
గోదావరి పరవళ్లు
3,93,277 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీటి ఉధృతి పెరిగింది. భద్రాచలంలో గురువారం మధ్యాహ్నం వరకూ నీటి ఉధృతి పెరుగుతూ 33 అడుగులకు చేరింది. అక్కడ నుంచి నిలకడగా కొనసాగుతోంది. అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులూ లేకుండా బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి బ్యారేజ్ వద్ద 9 అడుగుల నీటిమట్టం నెలకొంది. బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను మీటరు మేర ఎత్తి 3,93,277 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 3,300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2 వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.71 మీటర్లు, పేరూరులో 9.10 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.50 మీటర్లు, కూనవరంలో 11.62 మీటర్లు, కుంటలో 8.75 మీటర్లు, కొయిదాలో 15.49 మీటర్లు, పోలవరంలో 10.01 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.23 మీటర్ల వద్ద నీటిమట్టాలు నెలకొన్నాయి. -
అలాంటి నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తా
ధవళేశ్వరం: సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని సినీనటుడు సుమన్ చెప్పారు. గురువారం ధవళేశ్వరంలో జనార్దనస్వామి కొండపై జరుగుతున్న ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ చిత్రం షూటింగ్లో పాల్గొన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇతర దేశాల్లో కూడా అవినీతి ఉన్నప్పటికీ అక్కడ సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు. సామాన్యుడిని సంతోషంగా ఉంచే నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఇప్పటివరకూ వివిధ భాషల్లో 400 చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. సైనికుడు, రైతు, డాక్టర్ పాత్రలతో పూర్తి స్థాయి చిత్రంలో నటించాలన్నది తన కోరికన్నారు. సైనికుడు లేని దేశాన్ని ఊహించలేమని, రైతు లేకుంటే ఒక్కరోజు గడవదని, పునర్జన్మను ప్రసాదించే డాక్టర్ వృత్తంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గోదావరి జిల్లాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రకృతి అందాలు ఆనందింపజేస్తాయని అన్నారు. దర్శకుడు జీఎన్ఎస్ ప్రసాద్ కథను నమ్మి ఒరియా భాషలో తొలిసారి నటిస్తున్న సినిమా సూపర్‌హిట్ అవుతుందన్నారు. -
శ్వాస.. ధ్యాస.. యాస.. గోదారే..
ఇదే ముళ్లపూడి వెంకటరమణ జీవిత రహస్యం సాహిత్యం, సినిమాలకు కేంద్రబిందువిదే ‘‘మా ఊరు ధవళేశ్వరం. గోదావరి ఒడ్డున రాంపాదాలరేవు. ఆ వీధిలో మొట్టమొదటి మేడ మా ఇల్లు. ఆనకట్ట పంతులుగారి మేడ మా ఇల్లు. పెద్దఅరుగులు, స్తంభాలు, మెట్లు, గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు చావిట్లో జై కుసుమకుమారి భజనలు, నట్టింట్లో దెయ్యాలను సీసాలలో బిగించే ముగ్గు పూజలు, బైరాగులూ- పెరటివసారాలో చుట్టాలు, వాళ్ల చుట్టాలకు పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ.. రాజమండ్రి నుంచి గుమ్మిడిదల దుర్గాబాయమ్మగారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్లకీ ‘మై తో హూం తూ తో హై’ అంటూ చెప్పే హిందీ పాఠాలు, పూనకాలు, శాంతులు, తర్పణాలూ.. ఒకసారి మానాన్న గారు ఆస్పత్రికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్లిపోయారు. ఇక రారు అని చెప్పారు. మా అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్లిపోయింది.’’ ‘‘ నేను మెడ్రాసులో ఫస్టు ఫారం పాసయ్యాక.. రాజమండ్రి వీరేశలింగం స్కూల్లో సెకండు, ధర్డుఫారాలు చదివాను. అప్పుడు స్కూలుకి నెలజీతం మూడు రూపాయలు. అది కట్టడానికి కొన్నాళ్లు శ్రీముడుంబై నరసింహాచార్యులు అనే జమీందారు సాయంచేశారు. కొన్నాళ్ల తరువాత ఆయన ఊరెళ్లిపోయారు. అప్పుడు ఆ మూడు రూపాయల కోసం, నన్ను ధవళేశ్వరం రమ్మన్నారు. మా నాన్నగారి నేస్తం అన్నంభట్ల సుబ్బయ్యగారు. ఆయన ఆనకట్టాఫీసులో పెద్ద గుమస్తా. ఒకటోతారీఖున-అంటే జీతాలు ఇచ్చే రోజున ఆయన ఒకప్యూన్ని తోడిచ్చి ఆఫీసులో అందరు ఉద్యోగుల దగ్గరకు పంపేవారు.‘ఇలా ఫలానా క్యాషు కీపరు పంతులు గారబ్బాయి రాజమండ్రిలో సెకండు ఫారం చదువుతున్నాడు. మూడు రూపాయల జీతం కట్టాలి-మీకు తోచింది ఇవ్వండి’ అని చెప్పేవారు. మూడు రూపాయలు పూర్తి కాగానే రాజమండ్రికి నడిచివెళ్లే వాడిని, అప్పుడప్పుడు జట్కాల వెంట పరిగెత్తేవాడిని, కంకరరాళ్లు. అప్పటికింకా తారురోడ్డు పొయ్యలేదు. ఇంటికెళ్లి నేను కూడా-గదిలో మంచం మీద బోర్లా పడుకుని ఏడిచేవాడిని. మా అమ్మమ్మ కాళ్లకి మంచి నూనె రాసి మెల్లగా తోమేది. నిద్రపోయి ఎప్పుడో లేస్తే, మజ్జిగన్నం పెట్టేది.’’ ఇవే కాదు ఇలా ఎన్నో విషయాలు, విశేషాలను అనుభవాలను సినీరచయిత, నిర్మాత, బాపు ఆత్మీయ స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ ఆయన స్వీయ చరిత్ర ‘కోతికొమ్మచ్చి’లో పదిలపరిచారు. గోదావరితో తనకున్న అనుబంధాన్ని.. గోదావరిపై ఉన్న మక్కువను తెలియపరిచారు. అందుకే ఆయన కలం నుంచి జాలువారిన ‘రెండు జెళ్ల సీతలు, బుడుగులు, సీగాన పెసూనాంబలు, అప్పారావులు, లావుపాటి పక్కింటి పిన్నిగారి ‘ముగుళ్లూ’.. ఇలా అందరిదీ గోదావరి మాండలికమే. ఇక ఆయన సినిమాల్లోని ‘ఆమ్యామ్యా’ రామలింగయ్యలు, ‘తీ.తా’లు(తీసేసిన తాసీల్దార్లు), కనెక్షన్ కన్నప్పలు, గోదావరి చుట్టూ ఆడుకున్నవారే. సినీ రచయితగా, నిర్మాతగా ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ముళ్లపూడి ‘గోదావరి మా ఫిలిం స్టూడియో’ అంటూ తరచూ బాపుతో అనేవారంటే.. గోదావరి అంటే ఆయనకు ఎంత భక్తో, ప్రేమో, ఇష్టమో చెప్పొచ్చు. - సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్, నేడు హాస్య బ్రహ్మ ముళ్లపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా... గోదావరి అంటే ప్రాణం, భక్తి, ప్రేమ రమణగారు సొంత సినిమా తీస్తున్నప్పుడు రాసుకోవడానికి సాధారణంగా రాజమండ్రి లాంచీ మాట్లాడుకుని భద్రాచలం వరకు వెళ్లేవారు. ఆయనకు గోదావరి అంటే ప్రాణం, భక్తి, ప్రేమ కూడా. భద్రాచలంలో దైవదర్శనం చేసుకుని వచ్చేవారు. ఒక్కరూ ఎప్పుడూ వెళ్లరు. బాపుగారు, శ్రీరమణగారు, ఎమ్వీఎల్, సీతారాముడు, కె.వి. రావు ఎంతమందివీలైతే అంత మంది వెళ్లేవారు. వారం రోజులు లాంచి ప్రయాణానికి కావలసిన వంట సామాన్లు, కూరలు వగైరాలు, మందీమార్బలంతో వెళ్లేవారు. - ముళ్లపూడి శ్రీదేవి,(అర్ధాంగి) -
తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
-
పొంగి పొర్లుతున్న చీకుపల్లి వాగు
ఖమ్మం : ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తుంది. వాగులో నుంచి ఆ నీరు రోడ్లపైకి భారీగా వచ్చి చేరింది. దాంతో దాదాపు 25 గ్రామలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. భద్రచలం వద్ద నది నీటిమట్టం బుధవారం 27 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరిలో నీటి ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్యా 21 వేల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలారు. అలాగే తాగునీటి కోసం గోదావరి డెల్టాకు 12 వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. -
గోదావరిలో దంపతులు గల్లంతు
ధవళేశ్వరంలోని రామపాదాల రేవు వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన దంపతులు గల్లంతయ్యారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ దంపతులు అప్పటికే గోదావరి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. దాంతో స్థానికంగా ఉన్న అధికారులకు సమాచారం అందించారు. అయితే వారు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాల్లోనే కాకుండా ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహాం దాదాపు గరిష్ట స్థాయిలో ప్రవహిస్తుంది. దాంతో గల్లంతైన దంపతుల ఆచూకీ కనుగోనడం కొద్దిగా కష్టసాధ్యమని అధికారులు తెలిపారు. కాగా గల్లంతైన దంపతులు తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి వాసులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.