గోదావరి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు.
ధవళేశ్వరం : గోదావరి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ధవళేశ్వరంలోని కేదారలంక ఘాట్లో ఆదివారం చోటుచేసుకుంది. పవిత్ర స్నానం కోసం నదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
గోదావరి అంత్య పుష్కరాలకు భక్తజనం పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. పుష్కర గ్రామీణ ఘాట్లన్ని కిటకిటలాడుతున్నాయి. పెనుగొండలోని సిద్ధాంతం, పెరవలి తీపర్రు, గన్నవరం వైనతేయ గోదావరి, నిడదవోలు పెండ్యాల, నరసాపురం వశిష్ట గోదావరి, గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.