సబ్‌ప్లాన్‌నిధులకు ప్రతిపాదనలు ఇవ్వండి | sub plan founds | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్‌నిధులకు ప్రతిపాదనలు ఇవ్వండి

Published Fri, Nov 4 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

sub plan founds

ధవళేశ్వరం : 
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఇరిగేషన్‌ శాఖకు కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్‌ బాబు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, చిన్న, సన్నకారు రైతులకు సేద్యపు నీటిని అందించడం, వరద ముంపునకు గురయ్యే దళిత, గిరిజన ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్ట పరచడం, గ్రోయిన్ల నిర్మాణాలకు సబ్‌ప్లాన్‌ నిధులను వెచ్చించేందుకు వీలుందన్నారు. కె గంగవరం మండలం శేరిలంకలో రూ. 16 కోట్ల ప్రతిపాదనలను, ఐ పొలవరం మండలం ఎదుర్లంకలో రూ. 1.99 కోట్ల ప్రతిపాదనలను తమ శాఖ ఉన్నతాధికారులకు పంపిచామని ఎస్‌ఈ రాంబాబు వివరించారు. ఈ ప్రతిపాదనలను నోడల్‌ ఏజన్సీ ద్వారా నిధులకు కృషిచేస్తున్నామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement