దారిమళ్లుతున్న సబ్‌ప్లాన్ నిధులు
∙రూ.10 లక్షల వరకూ స్వాహా
∙అపహాస్యమవుతున్న జీవనోపాధి పథకం
రౌతులపూడి :
గ్రామీణప్రాంతాల్లోని దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడానికి, వారి ఆర్థ్ధికపరోభివృద్ధిని మెరుగుపరచడానికి ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకం ఆచరణలో విఫలమౌతోంది. వారి ఆర్థికాభివృద్ధికి జీవనోపాధి పథకం ద్వారా మేకలు, గొర్రెలు, గేదెలు పెంపకానికి, కిరాణా, కూరగాయల వ్యాపారం, ఇటుక తయారీవంటి ఇతర వ్యాపారాల కోసం అందించే నిధులను దారిమళ్లు తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవనోపాధి పెంచడానికి రూ.30వేలు నుంచి రూ.50వేలకు పైగా ఇవ్వాల్సి ఉండగా, వెలుగుసిబ్బంది అధికారపార్టీ నేతలతో కుమ్మక్కై రూ.పది నుంచి రూ.15 వేల వరకు ఇచ్చి దీనిలో మళ్లీ రూ.వెయ్యి తిరిగి వేరే పథకానికి అని వసూలు చేస్తున్నారు. మండలంలోని 2015–16లో ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకంలో ఇప్పటివరకు ఐదు గ్రామైఖ్య సంఘాలద్వారా 22 డ్వాక్రా సంఘాల్లోని 79 మంది లబ్థిదారులకు రూ.19,60,900 నిదులు పంపిణీ చేశారు. ఎస్సీ సబ్‌ప్లా¯ŒS పథకంలో 15 గ్రామైఖ్య సంఘాల ద్వారా 26 డ్వాక్రాల సంఘాల్లోని 131మంది లబ్ధిదారులకు రూ. 53,51,660లు అందజేశారు. ఈ సొమ్ముల నుంచి లబ్ధిదారులను మభ్యపెట్టి వారివద్దనుంచి సుమారు రూ.10 లక్షల వరకు స్వాహాకు పాల్పడినట్లు ’సాక్షి’ నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోంది. మండలంలోని ఉప ప్రణాళికా ప్రాంతానికి చెందిన రాఘవపట్నం శివారు దబ్బాది, సార్లంక గ్రామాలకు చెందిన ఇందిరా గ్రామైక్య సంఘంలోని బోడకొండమ్మ డ్వాక్రా సంఘంలోని పదిమంది సభ్యులకు రూ.3లక్షలు అందించారు. ఈ సొమ్ముల్లోని రూ.1.70లక్షలువరకు వారివద్దనుంచి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా వెలుగుసిబ్బంది వసూలు చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా వారికి అందజేసిన రోజే ఒకవాయిదాతోబాటు ఒక్కొక్క డ్వాక్రాగ్రూపునుంచి రూ.4వేలు ఖర్చుల నిమిత్తం సిబ్బందివసూలు చేసినట్లు తేలింది. జల్దాం శివారు గిన్నిలారంగ్రామానికిచెందిన పెద్దూరు గ్రామైఖ్యసంఘంలోని అల్లూరి సీతారామరాజు, లావణ్య డ్వాక్రాగ్రూపుల్లోని 11 మంది సభ్యులకు రూ.40 వేల చొప్పున రూ.4.28 లక్షలు అందించారు. ఈ సొమ్ములునుంచి ఒక్కొక్కరి నుంచి రూ.18వేల చొప్పున రూ.1.98 లక్షలు వసూలు చేశారు. మొదటి వాయిదా కోసం ఒక్కొక్కరివద్దనుంచి వెయ్యిచొప్పున 11 వేలు, ఖర్చులకోసం ఒక్కొక్క గ్రూపునుంచి రూ.నాలుగువేలు చొప్పున వసూలు చేసారని తెలిసింది. రాఘవపట్నం శివారు సత్యవరం గ్రామైఖ్యసంఘంలోని రెండు డ్వాక్రాసంఘాల్లోని 27మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున రూ.నాలుగు లక్షలు అందించారు. వీటిలో పెరటికోళ్ల పెంపకానికి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు. అంతేకాకుండా మొదటివాయిదాకని చెప్పి మరో వెయ్యి వసూలు చేశారు. మండలంలోని రాజవరంలో పాడిగేదెల పెంపకానికి నాలుగు డ్వాక్రా సంఘాల్లోని ఆరుగురి ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.45వేల చొప్పున రూ.2.70 మంజూరుచేసి అందించారు. అయితే ఒక్కొక్కరి నుంచి బీమా, ఇతర ఖర్చులు కోసం రూ.2,500 వరకు వెలుగు సిబ్బంది వసూలు చేశారు. ఇలా మండల వ్యాప్తంగా రూ.పది లక్షల వరకు స్వాహాకు పాల్పడినట్లు సాక్షి పరిశీలనలో వెల్లడవుతోంది. ఇప్పటికైనా డీఆర్డీఏ జిల్లా ఉన్నతాధికారులు స్వాహాకు గురైన నిధులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్వాహాకు గురైన సొమ్ములను లబ్ధిదారులకు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రూ.1.7 లక్షలు తిరిగి చెల్లించాం
ఎస్టీ సబ్‌ప్లా¯ŒSలో తమ గ్రూపులోని పదిమంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.30వేలు చొప్పున రూ.3లక్షలు మంజూరు చేశారు. వీటిలో అదే రోజు తిరిగి చెల్లించాలంటే రూ.1.7 లక్షలు తిరిగి వెలుగుసిబ్బందికి చెల్లించాం. వీటితోబాటు ఒక్కొక్క గ్రూపునుంచి ఖర్చుల నిమిత్తం రూ.4వేలు ఇచ్చాం. తొలి వాయిదా కూడా అప్పుడే చెల్లించాం.
– కాకురి దేవుడమ్మ, బోడకొండమ్మ
డ్వాక్రా గ్రూపు ప్రెసిడెంట్, దబ్బాది
రూ.18 వేలు వసూలు చేశారు
పెద్దూరు గ్రామైక్య సంఘంలోని రెండు డ్వాక్రా సంఘాలకు మేకల పెంపకానికి ఒక్కొక్కరికి రూ.40వేలు చొప్పున మంజూరు చేసి అందించారు. వీటిలో ఒక్కొక్కరి నుంచి రూ.18 వేలు వసూలు చేసి వెలుగు సిబ్బంది తీసుకెళ్లారు. వాటికి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. తీసుకున్నరోజే తొలి వాయిదా సొమ్ములు రూ.11 వేలు ఇచ్చాం.
– చడ్డా చిన్ని, లావణ డ్వాక్రాగ్రూపు, గిన్నిలారం.
బీమాకోసం రెండువేలిచ్చాం
ఎస్సీ సబ్‌ప్లా¯ŒS పథకంలో పాడి గేదెల పెంపకానికి రూ.45వేలు అప్పుతీసుకున్నాను. వీటిలో బీమా కోసం రూ.రెండువేలు, ఖర్చులకని మరో రెండువందలు వెలుగు అధికారికి ఇచ్చాను. మరో 15 వందలు మొదటి వాయిదా సొమ్ములు కూడా తగ్గించుకొన్నారు.
– ఏడిద కృష్ణవేణి, క్రాంతి డ్వాక్రా గ్రూపు
బాధ్యులపై చర్యలు చేపడతాం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకంలో సత్యవరంలో ఒక్కొక్కరి నుంచి పెరటికోళ్ల పెంపకానికి ఒక్కొక్కరు రూ.వెయ్యి చెల్లించారు. మిగిలిన స్వాహాకు గురైన నిధులు గురించి తనకు తెలియదు. సంబంధిత బాధితులను విచారించి స్వాహాపై పరిశీలించి బాధ్యులపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– కె. శ్రీనివాస్, వెలుగు ఏపీఎం