గోదావరికి మళ్లీ పెరిగిన వరద
గోదావరికి మళ్లీ పెరిగిన వరద
Published Sun, Aug 7 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
నెల్లిపాక:
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎటపాక మండలంలో పలు వాగులు పోటెత్తాయి. శనివారం అర్ధరాత్రి భారీగా నీరు చేరడంతో ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి వరద 38 అడుగులకు చేరింది. మధ్యాహ్నం ఎగువన ఉన్న చర్ల తాలిపేరు ప్రాజñ క్టు నుంచి 7 గేట్లు ఎత్తి సుమారు 21వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
6.23 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ధవళేశ్వరం :
ఆదివారం రాత్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి 6,23,071 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు డెల్టాకు 4100, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.98 మీటర్లు, పేరూరులో 11.50 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.63 మీటర్లు, కూనవరంలో 13.45 మీటర్లు, కుంటలో 7.55 మీటర్లు, కొయిదాలో 17.46 మీటర్లు, పోలవరంలో 11.06 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 15 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
Advertisement