ధవళేశ్వరంలోని రామపాదాల రేవు వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన దంపతులు గల్లంతయ్యారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ దంపతులు అప్పటికే గోదావరి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. దాంతో స్థానికంగా ఉన్న అధికారులకు సమాచారం అందించారు.
అయితే వారు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాల్లోనే కాకుండా ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహాం దాదాపు గరిష్ట స్థాయిలో ప్రవహిస్తుంది. దాంతో గల్లంతైన దంపతుల ఆచూకీ కనుగోనడం కొద్దిగా కష్టసాధ్యమని అధికారులు తెలిపారు. కాగా గల్లంతైన దంపతులు తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి వాసులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.