ధవళేశ్వరం పీహెచ్‌సీకి రాష్ట్ర ఉత్తమ అవార్డు | dowleswaram best phc in ap | Sakshi
Sakshi News home page

ధవళేశ్వరం పీహెచ్‌సీకి రాష్ట్ర ఉత్తమ అవార్డు

Published Sat, Apr 8 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

dowleswaram best phc in ap

ధవళేశ్వరం:
రాష్ట్ర ఉత్తమ పీహీచ్‌సీ అవార్డును రాజమహేంద్రవరం రూరల్‌ మండలానికి చెందిన ధవళేశ్వరం పీహెచ్‌సీ గెలుచుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పీహెచ్‌సీ వైద్యాధికారి కె.సుధాకర్‌ శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు. ఈ పీహెచ్‌సీకి ప్రతి రోజూ 200వరకు ఓపీ ఉంటుంది. సిబ్బంది రోగులకు మెరుగైన సేవలందించడంతో టీబీ యూనిట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిబ్బంది అందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డును కైవసం చేసుకోగలిగామని శనివారం వైద్యాధికారి సుధాకర్‌ అన్నారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని,   ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement