barage
-
బోర్డు పరిధిలో బ్యారేజీ
నీటి వాడకాన్ని పరిశీలించనున్న గోదావరి బోర్డు ధవళేశ్వరం : గోదావరి బోర్డు పరిధిలోకి ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజ్ చేరింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేష¯ŒS విడుదలైంది. గోదావరికి సంబంధించి రాష్ట్రంలో నిర్మాణం పూర్తయి న ప్రాజెక్ట్ ధవళేశ్వరంలోని సర్ఆర్థర్ కాట¯ŒS బ్యారేజ్. ప్రస్తుతం గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగాన్ని బోర్డు పరిశీలిస్తుంది. రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు నీటి వినియోగం జరిగేలా బోర్డు చూస్తుంది. ఒకవేళ ఇరురాష్ట్రాలకు మధ్య ఏదైనా వాదనలు చోటుచేసుకున్న సమయంలో బోర్డు మధ్యవర్తిత్వం వ్యవహరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ట్రిబ్యునల్‌లో ఇచ్చిన కేటాయింపుల ప్రకారం నీటి పంపిణీ చేయాల్సి ఉంటుంది. గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదికలను గోదావరి బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజీకి సంబంధించి ఖరీఫ్‌లో ఎటువంటి నీటి ఇబ్బందులు లేవు. ఖరీఫ్ సమయంలో వరదల సీజ¯ŒS కావడంతో భారీగా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. ప్రధానంగా రబీలోనే నీటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్కోసారి సహజలాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఎగువ ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సీలేరుపైనే ఆధారపడాల్సి వస్తుంది. బ్యారేజ్‌కు సంబంధించి నిర్వహణ పనులు,నీటి వినియోగాన్ని కూడా ఇకపై బోర్డే పర్యవేక్షించనుంది. -
సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో
శాంతినగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఓమోస్తరు వర్షాలకు రాజోలి సమీపంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీకి వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం సాయంత్రం సుంకేసుల జలాశయం వద్ద 1850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.19 టీఎంసీల స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ భద్రత దృష్ట్యా ఎగువనుండి వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు కేసీ కెనాల్‌ద్వారా కర్నూలు ప్రజల తాగునీటి అవసరాలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జేఈ పేర్కొన్నారు. -
నేడు ‘కాళేశ్వరం’ టెండర్లు!
రూ.5,813కోట్లతో మూడు బ్యారేజీలకు టెండర్ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భా గంగా నిర్మించే మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీల నిర్మాణాలకు మంగళవారం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. బ్యారేజీలకు సంబంధించిన అంచనాలు సిద్ధమవడం, వాటికి పరిపాలనా అనుమతులుసైతం వచ్చిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. మొదటగా మూడు బ్యారేజీల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి, తర్వాత ఒకట్రెండు రోజుల్లో పంప్‌హౌస్‌ల నిర్మాణానికి టెండ ర్లు పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నిర్మించే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు, వాటి పంప్‌హౌస్‌ల నిర్మాణం, హైడ్రోమెకానికల్ పనులకు వేర్వేరుగా అంచనా వ్యయాలు సిద్ధం చేశా రు. ఇందులో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తం గా 21.29 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీల నిర్మాణానికి గానూ, మేడిగడ్డకు రూ.2,591 కోట్లు, అన్నారం రూ.1785 కోట్లు, సుందిళ్లకు రూ.1437 కోట్లకు.. మొత్తంగా రూ.5,813 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఇటీవలే ఈ బ్యారేజీల మధ్య పంప్‌హౌస్‌ల కోసం రూ.7,998 కోట్లతో మరో అనుమతినిచ్చింది. మేడిగడ్డ నుంచి అన్నారం మధ్య ఎత్తిపోతల కోసం రూ.3,524 కోట్లు, అన్నారం-సుందిళ్ల ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.2,140 కోట్లు, సుందిళ్ల నుంచి ఎల్లింపల్లి మధ్య నిర్మాణాలకు రూ.2,334 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో మొదటగా బ్యారేజీలకు సంబంధించిన పనులకు మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం 15 రోజులు కనీస గడువును విధించి టెండర్లను ఆహ్వానిస్తారు. మరో వారం సాంకేతిక పరిశీలనకు గడు వు విధిస్తారు. ఇది పూర్తయిన వెంటనే ప్రైస్ బిడ్లను తెరిచి టెండర్లు ఖరారు చేస్తారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తికావడానికి నెల పడుతుందని అంచనా.