మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు | AP Government Orders AP Medical Education Research Corporation Board | Sakshi
Sakshi News home page

మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు

Published Tue, Feb 2 2021 12:57 PM | Last Updated on Tue, Feb 2 2021 1:12 PM

AP Government Orders AP Medical Education Research Corporation Board - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా  8మంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. బోర్డు సభ్యులుగా.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ, ఎంఎస్ఐడీసీ ఎండీ, వైద్యవిద్యా డైరెక్టర్ తదితర అధికారులు ఉంటారు.

ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్‌ రాష్ట్రంలో వైద్యారోగ్య సేవల్ని మరింత విస్తృత పరచటంతో పాటు ప్రస్తుత ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నది. నూతన బోధనాసుపత్రుల నిర్మాణం కోసం ఆర్ధిక వనరుల సమీకరణ బాధ్యతనూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఈఆర్సీకి అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement