Research Corporation
-
మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్గా 8మంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. బోర్డు సభ్యులుగా.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ, ఎంఎస్ఐడీసీ ఎండీ, వైద్యవిద్యా డైరెక్టర్ తదితర అధికారులు ఉంటారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ రాష్ట్రంలో వైద్యారోగ్య సేవల్ని మరింత విస్తృత పరచటంతో పాటు ప్రస్తుత ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నది. నూతన బోధనాసుపత్రుల నిర్మాణం కోసం ఆర్ధిక వనరుల సమీకరణ బాధ్యతనూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఈఆర్సీకి అప్పగించింది. -
‘ఇంద్రధనుష్’ మంచి ప్రయత్నం
ఇండియా రేటింగ్స్ కితాబు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఇంద్రధనుష్’ సంస్కరణ అభినందనీయమని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ సంస్థ పేర్కొంది. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆందోళనలు తప్పవని తెలిపింది. ఇంద్రధనుష్ కార్యక్రమం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందుతుందని, దీంతో పాలనా సంబంధిత అంశాలు మెరుగుపడతాయని, తద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని వివరించింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల గురించి వివరిస్తూ.. పెరిగిపోతున్న మొండిబకాయిల సమస్యల గురించి ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన నాణ్యత సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని పేర్కొంది. కార్పొరేట్లకు ఇచ్చిన రుణాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి బ్యాంకులకు రూ.లక్ష కోట్ల కావాల్సి ఉందని తెలిపింది.