
ఇంట్లోనే ఆడే ఆటలు(ఇండోర్) కొన్నైతే ఆరుబయట ఆడే(అవుట్ డోర్) ఆటలు మరికొన్ని. అయితే ఈ ఇండోర్ గేమ్స్‌లో కొన్ని ఆటలు కూర్చున్నచోట నుంచే ఆడినప్పటికీ వాటికి కొన్ని వస్తువులు అవసరపడుతాయి. అందులో 'స్నూకర్స్' గేమ్ ఒకటి. కొందరు పిల్లలు ఇటుకలు, కట్టెలతో స్నూకర్ బోర్డు, స్టిక్స్ తయారు చేశారు. దీని కోసం ఇటుకలను ఒక క్రమపద్ధతిలో సమానంగా పరిచి బోర్డు తయారు చేశారు. అనంతరం వాటిపై కొన్ని బంతులను వేసి ఉంచారు. ఆ తర్వాత ఓ బుడ్డోడు ఓ కట్టె పట్టుకుని బంతిని గురి చూసి కొడుతున్నాడు. అది నేరుగా వెళ్లి అక్కడున్న రంధ్రం(ఖాళీ ప్రదేశం)లో పడుతుంది. మిగతావాళ్లు అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు. (అమ్మ కోసం ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గరే జపం)
దీంతో మరింత ఉత్సాహంతో ఆ బుడ్డోడు మిగతా బంతులను కొడుతున్నాడు. పనిలో పనిగా బోర్డెక్కి మరీ ఆటాడటం నవ్వు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను లెఫ్టినెంట్ జనరల్ జ్ఞాన్ భూషణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి ఆట సృజనాత్మకంగా ఉందని క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లలు తమ ఆనందం కోసం ఎన్ని ప్రయోగాలైనా చేస్తారంటున్నారు నెటిజన్లు. అయినా ఆ పిల్లోడు ఎంతో అనుభవమున్నవాడిలా ఆడుతున్నాడంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకు ముందు కూడా ఓ చోట పిల్లలందరూ చతురస్రాకారంలో నిలబడి క్యారమ్‌బోర్డ్ ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. (గుడ్డుపై వాక్యూమ్ క్లీనర్ ప్రయోగించాడు!)
Comments
Please login to add a commentAdd a comment