MHSRB Telangana Recruitment 2023 Notification for 1676 Posts - Sakshi
Sakshi News home page

MHSRB: ఏఎన్‌ఎం పోస్టులు 1520

Published Thu, Jul 27 2023 2:54 AM | Last Updated on Thu, Jul 27 2023 8:35 PM

Medical Health Services Recruitment Board has released a notification for filling up the posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖలో ఏఎన్‌ఎం(మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌–ఫిమేల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయ్యింది. మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. రాతపరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. పేస్కేల్‌ రూ. 31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ప్రాతిపదికన ఓఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న దానిపై త్వరలో వెల్లడిస్తామని గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుము రూ. 500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ తదితర కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది.

ఇవీ అర్హతలు: 

  • అభ్యర్థులు తప్పనిసరిగా మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సు చేసి ఉండాలి. లేదా ఇంటర్‌లో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్క ర్‌ (ఫిమేల్‌) శిక్షణ కోర్సు పాసై ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌ అండ్‌ మిడ్‌ వైవ్స్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకొని ఉండాలి. 
  • నిర్ధారించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి. లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్‌ పూర్తి చేసి ఉండాలి. వారు తెలంగాణ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ చేసుకొని ఉండాలి. ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే, ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి రిఫర్‌ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. 
  • దరఖాస్తుదారులు 18 – 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. వివిధ వర్గాలకు సంబంధించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. 
  • పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. 
  • గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.
  •  కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ అనుభవమున్న వారు ధ్రువీకరణపత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. 
  • కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ ఏ సేవలు అందించి ఉంటే, ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. 

అప్‌లోడ్‌ చేయాల్సినవి :  
అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరాలు నమో దు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్‌ కాపీ (పీడీఎఫ్‌)లను అప్‌లోడ్‌ చేయాలి. ఆధార్‌ కార్డ్, పదోతరగతి సర్టిఫికెట్,  అర్హత సాధించిన కో ర్సులకు చెందిన సర్టిఫికెట్లు ఉండాలి. అనుభవ ధ్రు వీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే  కులధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్‌–క్రిమీలేయర్‌ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వే షన్‌ కోరేవారు తాజా ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫికెట్, ఎన్‌సీసీ ధ్రువీకరణపత్రం వంటివి అవసరాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. 

జోన్లవారీగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌   
ఏఎన్‌ఎం పోస్టులను జోన్లవారీగా భర్తీ చేస్తా రు. ఆయా జోన్ల అభ్యర్ధులకే 95% పోస్టులు కేటా యిస్తారు. మిగతావి ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు. 

  • జోన్‌–1 (కాళేశ్వరం)లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు జిల్లాలు. 
  • జోన్‌–2 (బాసర)లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
  • జోన్‌–3 (రాజన్న)లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
  • జోన్‌–4 (భద్రాద్రి)లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్‌
  • జోన్‌–5(యాదాద్రి)లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం
  • జోన్‌–6(చార్మినార్‌)లో మేడ్చల్‌ మల్కాజిగి రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ 
  • జోన్‌–7(జోగులాంబ)లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలున్నాయి.

మొత్తం పోస్టులు: 1520 (ఫిమేల్‌)
దరఖాస్తులు స్వీకరణ:  వచ్చేనెల 25న ఉదయం 10:30 నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్‌ 19వ తేదీ సాయంత్రం 5:30 వరకు
పరీక్ష కేంద్రాలు :  హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement