ప్రముఖ దేశీయ స్టీల్ సంస్థ టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది.
ముంబై: ప్రముఖ దేశీయ స్టీల్ సంస్థ టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది. ఫండ్ రైజింగ్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ వారంలో భేటీ నిర్వహించనున్నట్లు టాటా స్టీల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 20 న గురువారం జరుగనున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిధుల పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నట్టు సంస్థ బిఎస్ఇకి తెలిపింది.
28 మిలియన్ టన్నుల స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అంతర్జాతీయ స్టీల్ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా టాటా స్టీల్ కొనసాగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్ వార్షిక టర్నోవర్ 17.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా ఉన్న టాటాస్టీల్ 26 దేశాలలో కార్యకలాపాలను, 50 పైగా దేశాలలో వాణిజ్యకార్యకలాపాలను నిర్వహిస్తోంది.