టోక్యో: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో ప్రపంచం ఆటోదిగ్గజం నిస్సాన్ ఛైర‍్మన్ కార్లోస్ ఘోన్ వేటుపడింది. రెండురోజులక్రితం గోన్‌ను టోక్యో విచారణ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిస్సాన్ బోర్డునుంచి ఆయన్ను తొలగించాలని బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని నిస్సాన్ గురువారం వెల్లడించింది. అలాగే మరో ఎగ్జిక్యూటివ్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీని కూడా తొలగించినట్టు తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. యోకోహామాలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
మరోవైపు ఘోన్ స్థానంలో సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక ఎడ్వైజరీ కమిటీని నియమించినట్టు నిస్సాన్ ప్రకటించింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో జపనీస్ మహిళా రేసింగ్ డ్రైవర్ కైకో ఇహారా కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment