Carlos Ghosn
-
నాపై కుట్ర చేస్తున్నారు..
బీరుట్: ఆర్థిక అవకతవకల ఆరోపణలతో జపాన్ నుంచి నాటకీయంగా తప్పించుకున్న ఆటోమొబైల్ సంస్థ రెనో–నిస్సాన్ మాజీ చీఫ్ కార్లోస్ ఘోన్ .. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. నిస్సాన్, జపాన్ ప్రాసిక్యూటర్లు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జపాన్ నుంచి లెబనాన్‌కు పరారైన తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనపై మోపిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు నిరాధారమైనవని ఆయన చెప్పారు. ‘నేను 17 ఏళ్లుగా సేవలందించిన దేశమే నన్ను బందీగా చేసింది అనిపించింది. న్యాయం సంగతి పక్కనపెడితే అక్కడ కనీసం నా మాట పట్టించుకునే పరిస్థితే లేదు. నా మిత్రులు, కుటుం బంతో ఎలాంటి సంబంధాలు లేకుండా తెంచేశారు. నేను ఏ తప్పూ చేయనప్పటికీ.. తుది తీర్పు కోసం అయిదేళ్లు నిరీక్షించాల్సి ఉంటుం దని లాయర్లు చెప్పారు. దీంతో గత్యంతరం లేక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వచ్చింది‘ అని ఘోన్ పేర్కొన్నారు. -
నిస్సాన్ ఛైర్మన్‌పై వేటు
టోక్యో: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో ప్రపంచం ఆటోదిగ్గజం నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ ఘోన్ వేటుపడింది. రెండురోజులక్రితం గోన్‌ను టోక్యో విచారణ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిస్సాన్ బోర్డునుంచి ఆయన్ను తొలగించాలని బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని నిస్సాన్ గురువారం వెల్లడించింది. అలాగే మరో ఎగ్జిక్యూటివ్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీని కూడా తొలగించినట్టు తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. యోకోహామాలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. మరోవైపు ఘోన్ స్థానంలో సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక ఎడ్వైజరీ కమిటీని నియమించినట్టు నిస్సాన్ ప్రకటించింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో జపనీస్ మహిళా రేసింగ్ డ్రైవర్ కైకో ఇహారా కూడా ఉన్నారు. -
నిస్సాన్ చీఫ్ ఘోన్ అరెస్ట్
టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ చైర్మన్ కార్లోస్ ఘోన్ అరెస్టయ్యారు. తన ఆదాయాన్ని తక్కువగా చూపించటం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ల విచారణలో వెల్లడైందని, దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారని జపాన్ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ‘ఆర్థిక సాధనాలు, విదేశీ మారక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలతో నిస్సాన్ చైర్మన్ ఘోన్‌ను టోక్యో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అరెస్టు చేసింది‘ అని ఈ సంస్థ తెలియజేసింది. మరోవైపు, ప్రజావేగు నివేదిక మేరకు ఘోన్పై గత కొద్ది నెలలుగా అంతర్గతంగా విచారణ సాగిస్తున్నట్లు నిస్సాన్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా ఏళ్లుగా మరో అధికారితో కలిసి అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలొచ్చాయని వివరించింది. దీంతో ఘోన్, రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ‘ఘోన్ అందుకునే జీతభత్యాలను తక్కువగా చేసి చూపించేందుకు ఆయన, కెల్లీ కలిసి టోక్యో స్టాక్ ఎక్సే్చంజీకి పలు సంవత్సరాలుగా తప్పుడు సమాచారం అందిస్తున్నారని మా విచారణలో వెల్లడైంది. అంతేగాకుండా ఘోన్పై దుష్ప్రవర్తన ఆరోపణలూ ఉన్నాయి. కంపెనీ ఆస్తుల్ని సొంతానికి వాడుకోవడం వంటివి చేశారు. ఈ వ్యవహారాల్లో కెల్లీ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాలన్నీ జపనీస్ ప్రాసిక్యూటర్లకు తెలియజేశాం. ఆయనతో పాటు కెల్లీని తక్షణం అన్ని హోదాల నుంచి తొలగించాలంటూ డైరెక్టర్ల బోర్డు ముందు ప్రతిపాదించనున్నాం’’ అని నిస్సాన్ తన ప్రకటనలో వివరించింది. ఘోన్‌ను ప్రాసిక్యూటర్స్ ప్రశ్నిస్తున్నారన్న వార్త అసాహి షింబున్ అనే స్థానిక వార్తాపత్రిక ద్వారా బైటికొచ్చింది. అటుపై యోకోహామాలోని నిస్సాన్ ప్రధాన కార్యాలయంపై టోక్యో ప్రాసిక్యూటర్స్ దాడులు నిర్వహించనున్నట్లు ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ప్రశ్నార్థకంగా రెనో–మిత్సుబిషి కూటమి.. ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో– నిస్సాన్– మిత్సుబిషిలను ఒకే తాటిపైకి తెచ్చిన ఘోన్ అరెస్టయిన నేపథ్యంలో ఈ కూటమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారవచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి బ్రాండ్ ఇమేజ్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌కి చెందిన ఘోన్ (64) 1996– 99 మధ్య కాలంలో ఫ్రాన్స్ ఆటోమొబైల్ సంస్థ రెనోలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా చేసి కంపెనీ పునరుద్ధరణలో కీలకపాత్ర పోషించారు. వ్యయాల్లో కోత పెట్టడంలో నిరంకుశంగా వ్యవహరిస్తారనే పేరుపొందారు. 1999లో ఘోన్.. జపాన్‌కి చెందిన నిస్సాన్‌ను పునరుద్ధరించే బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేశారు. అయిదు ఫ్యాక్టరీలను మూసివేసి, 21,000 ఉద్యోగాలను తగ్గించి, తద్వారా మిగిలిన నిధులను మూడేళ్లలో కొత్తగా 22 కార్లు, ట్రక్ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్, టయోటాలకు దీటైన పోటీనిచ్చే సంస్థలుగా నిస్సాన్, రెనోలను తీర్చిదిద్దారు. 2016లో మిత్సుబిషి సంస్థను గట్టెక్కించేందుకు నిస్సాన్ 2.2 బిలియన్ డాలర్లతో మూడో వంతు వాటాలు కొనుగోలు చేసింది. దానికి కూడా సారథ్య బాధ్యతలు చేపట్టిన ఘోన్... రెనో, నిస్సాన్,మిత్సుబిషిలతో ఒక కూటమి తయారుచేశారు. ఈ క్రమంలో ఆయన అందుకుంటున్న జీత భత్యాలపై చాన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. రెనో–నిస్సాన్–మిత్సుబిషి కూటమి చైర్మన్‌గా, రెనో సీఈవోగా, నిస్సాన్..మిత్సుబిషి సంస్థల చైర్మన్‌గా ఆయన వివిధ హోదాల్లో జీతభత్యాలు అందుకునేవారు. కానీ నియంత్రణ సంస్థలకు మాత్రం వీటిని తగ్గించి చూపేవారని ఆరోపణలున్నాయి. ఈ వివాదమే తాజాగా ఆయన అరెస్టుకు దారితీసింది. ఘోన్‌ను చైర్మన్ హోదా నుంచి తొలగించే ప్రతిపాదనపై గురువారం బోర్డు సమావేశం కానున్నట్లు నిస్సాన్ సీఈవో హిరోటో సైకావా తెలిపారు. రెనో, మిత్సుబిషితో తమ లావాదేవీలపై ఘోన్ అరెస్టు, తొలగింపు ప్రభావమేమీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఒకే ఎగ్జిక్యూటివ్‌కి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. -
నిస్సాన్ మోటార్స్ ఛైర్మన్ అరెస్ట్
నిస్సాన్ మోటార్స్ ఛైర్మన్ కార్లోస్ గోన్ (64)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వివిధ అవినీతి ఆరోపణల కింద విచారణాధికారులు గోన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక వాణిజ్య చట్టం ఉల్లంఘనలు, ఎక్స్చేంజ్ చట్టం ఉల్లంఘనతదితర ఆరోపణల నేపథ్యంలో టోక్యో ప్రాసిక్యూటర్స్ గోన్‌ను అరెస్ట్ చేశారని రాయిటర్స్ నివేదించింది. మరోవైపు గోన్తోపాటు, బోర్డు డైరెక్టర్ గ్రెగ్ కెల్లీలపై కంపెనీ ఆస్తుల దుర్వినియోగం, తదితర పలు ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతోందని జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ ధృవీకరించింది. అంతర్గత దర్యాప్తులో గోన్ నివేదించిన ఆదాయ వివరాలు అవాస్తవాలుగా తేలాయని తెలిపింది. దీంతో వీరిద్దరినీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్నుంచి తొలగించాల్సిందిగా సీఈవో హిరోటో సైకవా బోర్డును కోరనున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడిస్తామని చెప్పింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో నిస్సాన్ , రెనాల్ట్ కౌంటర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. -
నిస్సాన్ సీఈవో రాజీనామా
జర్మన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిస్సాన్ సీఈవో కార్లోస్ ఘోసన్ రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంపాటు సంస్థకు విశేష సేవలందించిన కార్లోస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మిస్తుబిషి మోటార్స్ బాధ్యతలను ఇటీవల స్వీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.అయితే నిస్సాన్-రెనాల్ట్-మిత్సుబిషి అలయన్స్ మిత్సుబిషి మోటార్స్ కి చైర్మన్ అండ్ సీఈవో గా ఉంటారు. ప్రస్తుతం కంపెనీ కో సీఈవోగా ఉన్న హిరోటా సయికావా ఏప్రిల్ 1, 2017 నుంచి సీఈవో బాధ్యతలు చేపడతారని నిస్సాన్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కంపెనీ ఛైర్మన్ గా ఘోసన్ కొనసాగుతారు. అలాగే రెనాల్ట్ గ్రూపునకు సీఈవోగా కూడా ఉంటారు. తాను గత 18 సంవత్సరాలుగా నిస్సాన్ అభివృద్ధి కోసం పాటుపడ్డానని ఘోసన్ చెప్పారు. తన టీంతో కలిసి ప్రతిభ, అనుభవంతో సంస్థ కార్యాచరణ, వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకున్నాననే విశ్వాసాన్ని ప్రకటించారు. ఇటీవల నిస్సాన్ సాధారణ వాటాదారులు సమావేశంలో మిత్సుబిషి మోటార్స్ కొత్త బాధ్యతలు తీసుకున్న తరువాత హిరోటా సయివాకా సీఈవోగా ఉండం సరైనదని తాను భావించాన్నారు. -
సీఈవో జీతంలో కోత
ఫ్రెంచ్ కార్ మేకర్ రెనాల్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ సీఈవో కార్లోస్ ఘోసన్ జీతంలో 20 శాతం కోత విధిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలోతెలియజేసింది. గతంలో షేర్ హోల్డర్స్ చేసిన తిరుగుబాటు, ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో దిగి వచ్చిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన జీతంలో 20 శాతం వేరియబుల్ భాగాన్ని కట్ చేస్తున్నట్టు రెనాల్ట్ తెలిపింది. కార్లెస్ పే పరిశ్రమలోని ఇతర సహచరులతో సమానంగా ఉందని కౌన్సల్ వివరించింది. 2015 ఏప్రిల్ నాటి వాటాదారుల సమావేశంలో సీఈవో భారీ జీతం ఆఫర్ ను వ్యతిరేకించింది. దాదాపు8 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన పే ప్యాకేజీని తిరస్కరిస్తూ ఆటోమొబైల్ దిగ్గజం వాటాదారులు ఓట్ చేశారు. కానీ వాటాదారుల అభ్యంతరాలను పట్టించుకోని సంస్థ బోర్డ్ ఆయన జీతాన్ని యథాతధంగా అమలు చేసింది. దీంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఈ కంపెనీలో 5 శాతం వాటాలను కలిగివున్న ఫ్రెంచ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలంటూ బోర్డుకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొద్ది వారాల్లో సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకోక పోతే తాము చట్టాన్ని చేయాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి ఇమ్మాన్యు యేల్ మ్యాక్రాన్ పార్లమెంట్ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉంటే కంపెనీకి చెందిన ఫౌండేషన్ కు తన జీతంలో సంవత్సరానికి ఒక మిలియన్ యూరోల విరాళంగా ఇవ్వనున్నట్టు ఘోసన్ ప్రకటించడం విశేషం కాగా గత ఏడాది రెనాల్ట్ బలమైన ఫలితాలు చూపించింది. దాదాపు 50 శాతం వృద్ధితో గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఫ్రాన్స్ కు చెందిన టాప్ కంపెనీలు సాధారణ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదంలో ఉంటే.. మేనేజ్ మెంట్ స్థాయి, సీనియర్ ఉద్యోగులకు చెలిస్తున్న భారీ వేతనాలపై బలమైన విమర్శలు ఎదుర్కొంటున్నాయి. సనోఫీ, ప్యుగోట్-సిట్రోయెన్ ఆల్స్టామ్ సహా ఫ్రాన్స్ టాప్ సంస్థలు ఈ కోవలోకి వస్తాయి.