నిస్సాన్ సీఈవో రాజీనామా
జర్మన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిస్సాన్ సీఈవో కార్లోస్ ఘోసన్ రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంపాటు సంస్థకు విశేష సేవలందించిన కార్లోస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మిస్తుబిషి మోటార్స్ బాధ్యతలను ఇటీవల స్వీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.అయితే నిస్సాన్-రెనాల్ట్-మిత్సుబిషి అలయన్స్ మిత్సుబిషి మోటార్స్ కి చైర్మన్ అండ్ సీఈవో గా ఉంటారు.
ప్రస్తుతం కంపెనీ కో సీఈవోగా ఉన్న హిరోటా సయికావా ఏప్రిల్ 1, 2017 నుంచి సీఈవో బాధ్యతలు చేపడతారని నిస్సాన్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కంపెనీ ఛైర్మన్ గా ఘోసన్ కొనసాగుతారు. అలాగే రెనాల్ట్ గ్రూపునకు సీఈవోగా కూడా ఉంటారు.
తాను గత 18 సంవత్సరాలుగా నిస్సాన్ అభివృద్ధి కోసం పాటుపడ్డానని ఘోసన్ చెప్పారు. తన టీంతో కలిసి ప్రతిభ, అనుభవంతో సంస్థ కార్యాచరణ, వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకున్నాననే విశ్వాసాన్ని ప్రకటించారు. ఇటీవల నిస్సాన్ సాధారణ వాటాదారులు సమావేశంలో మిత్సుబిషి మోటార్స్ కొత్త బాధ్యతలు తీసుకున్న తరువాత హిరోటా సయివాకా సీఈవోగా ఉండం సరైనదని తాను భావించాన్నారు.