
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డులో ప్రత్యేక సభ్యుడుగా ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు, పాత్రికేయుడు స్వామినాథన్ గురుమూర్తి (తమిళనాడు) ఎంపికయ్యారు. గురుమూర్తితోపాటు సహకార భారతీ చీఫ్ సతీష్ కాశీనాథ్ మరాథెని ఆర్‌బీఐ బోర్డులో పార్ట్ టైం డైరెకర్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుందని, క్యాబినెట్ అపాయింట్‌మెంట్ ఆమోదం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా నియామకాలతో ఆర్‌బీఐ బోర్డులో సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, స్వదేశీ జాగరణ్ మంచ్‌కు ఉప కార్యదర్శిగా ఉన్న గురుమూర్తి అర్థశాస్త్రవేత్త, సీఏ పూర్తి చేశారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినా, తమిళంలో తుగ్లక్ అనే రాజకీయ వార పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment