ఒడిశా విషాదం:పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు  | Paytm CEO Vijay Shekhar Sharma pledges to match donations done for victims via app | Sakshi
Sakshi News home page

ఒడిశా విషాదం:  పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు 

Published Tue, Jun 6 2023 9:33 PM | Last Updated on Tue, Jun 6 2023 9:44 PM

Paytm CEO Vijay Shekhar Sharma pledges to match donations done for victims via app - Sakshi

డిజిటల్  చెల్లింపుల సంస్థ పేటీఎం ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది.  పేటీఎం ద్వారా  యూజర్లు అందించిన విరాళాలకు  సమాన మొత్తంలో  తాను కూడా చెల్లించ నుంది. ప్రమాదంలో బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. (జెరోధా ఫౌండర్‌, బిలియనీర్‌ నిఖిల్‌ కామత్‌ సంచలన నిర్ణయం)

ఈ మేరకు పేటీఎం సీఈవో  విజయ్ శేఖర్ శర్మ ప్రతిజ్ఞ చేశారు.  వినియోగదారులు చెల్లించిన ప్రతీ  రూపాయిక మరో రూపాయి జోడించి.. ఇలా సేకరించిన నిధులను ఒడిశా ముఖ్యమంత్రి సహాయనిధి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. "విరాళం ఇచ్చిన మొత్తంపై 80జీ పన్ను మినహాయింపు పొందవచ్చు. Paytm యాప్‌లోని 'ఆర్డర్ & బుకింగ్స్' విభాగం నుండి రసీదులను డౌన్‌లోడ్  చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. దీంతో  నెటిజన్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు.  అలాగే తమ డొనేష్లనకుసంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.   (రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? )

ఇదీ చదవండి: నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం


కాగా జూన్ 2న జరిగిన ప్రమాదంలో దాదాపు  288 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది.  ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి  ఉంది.  దాదాపు 1,100 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement