Indian stock markets
-
బ్లాక్ డీల్స్ హవా..
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఓపెన్ మార్కెట్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్ భారీగా నమోదవుతున్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో విలువరీత్యా ఇవి 76 శాతం జంప్ చేశాయి. గతేడాది(2023–24) తొలి త్రైమాసికంతో పోలిస్తే లావాదేవీల(డీల్స్) సంఖ్య సైతం 23 శాతం ఎగసింది.ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ క్యూ1లో 3,396 బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మకాలు రూ. 1.3 లక్షల కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 74,811 కోట్ల విక్రయ డీల్స్ నమోదయ్యాయి. తాజా త్రైమాసికంలో ఒక్క జూన్‌లోనే రూ. 73,000 కోట్ల విలువైన డీల్స్ జరగడం గమనార్హం! గత 11 నెలలను పరిగణిస్తే ఒక్క నెలలోనే రూ. 70,000 కోట్ల విలువైన అమ్మకాలు నమోదుకావడం ఇది మూడోసారి!! ఇంతక్రితం 2023 ఆగస్ట్‌లో రూ. 77,469 కోట్లు, డిసెంబర్లో రూ. 78,786 కోట్ల విలువైన విక్రయ డీల్స్ నమోదయ్యాయి. -
కొత్త ఏడాదికి లాభాల స్వాగతం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరానికి((2021–22) లాభాలతో స్వాగతం పలికింది. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం దేశీయ మార్కెట్ లాభాల్ని మూటగట్టుకుంది. మెటల్, ఆర్థిక, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ల అండతో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 14,867 వద్ద నిలిచింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.24 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అలాగే కేంద్రం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.14,500 కోట్ల మూలధన నిధులను సమకూర్చింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్ బలపరిచాయి. మరోవైపు అమెరికాలో భారీ ఉద్యోగ కల్పన లక్ష్యంగా మౌలిక రంగంలో 2.3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులను పెడుతున్నట్లు దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ అంశం మన కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 583 పాయింట్లు, నిఫ్టీ 192 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.94 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.207.15 లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.149 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.297 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పీఎస్బీ షేర్ల పరుగులు కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు(పీఎస్బీ) రూ.14,500 కోట్ల నిధులను కేటాయించడంతో ఈ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. మొండిబకాయిలుతో పాటు పలు సంస్థాగత సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం భారీ ఎత్తున నిధులను సమకూర్చడంతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో ఈ బ్యాంకు షేర్లు 10% ర్యాలీ చేశాయి. మెరిసిన మెటల్ షేర్లు...: బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ స్టీల్ కంపెనీలకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఇవ్వడంతో ఈ రంగానికి చెందిన షేర్లు రాణించాయి. దీంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 5% ఎగిసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో షేరు 8.5% ఎగసి రూ.60 వద్ద స్థిరపడింది. డోల్వీ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడంతో జేఎస్‌డబ్ల్యూ షేరు 8% లాభంతో రూ.505 వద్ద ముగిసింది. టాటా స్టీల్ షేరు 6% లాభపడి రూ.859 వద్ద స్థిరపడింది. మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓ ధర రూ. 483–486 న్యూఢిల్లీ: గతంలో లోధా డెవలపర్స్‌గా కార్యకలాపాలు సాగించిన రియల్టీ దిగ్గజం మాక్రోటెక్ డెవలపర్స్ ఈ నెల 7న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 9న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 483–486గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులలో రూ. 1,500 కోట్ల వరకూ రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. -
సెన్సెక్స్ @ 50000
భారత స్టాక్ మార్కెట్లో గురువారం ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50 వేల మైలురాయిని అందుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేష్, సత్యం కుంభకోణాలను చూసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్–19 సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దు నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తన ఒడిదుడుకుల ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టిస్తూ.., వాటిని తానే తిరగరాస్తూ ముందుకు సాగింది. పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా కోలుకుని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుబెట్టుకుంది. 1979 ఏప్రిల్ 1న ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ ఇప్పటివరకు 16 శాతం వార్షిక సగటు రాబడి (సీఏజీఆర్)ని అందించింది. కోవిడ్ ముందు... తర్వాత..! కోవిడ్ వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు డిమాండ్ సన్నగిల్లడంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో çసరిగ్గా 10 నెలల సెన్సెక్స్ కిత్రం(మార్చి 24న) సెన్సెక్స్ 25,638 స్థాయికి దిగివచ్చింది. ఈ కరోనా కాలంలో సెన్సెక్స్ ప్రపంచ ఈక్విటీ సూచీల్లోకెల్లా అత్యధికంగా 80 శాతం నష్టపోయింది. ఒకవైపు సంక్షోభం దిశగా కదులుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు రోజురోజుకూ దిగివస్తున్న ఈక్విటీ సూచీలు.. వెరసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే నిరాశావాదంతో బుల్ మార్కెట్ పుట్టి, ఆశావాదంతో పరుగులు పెడుతుందనే వ్యాఖ్యలను నిజం చేస్తూ భారత మార్కెట్ దూసుకెళ్లడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ అంచనాలు, కోవిడ్–19 వ్యాక్సిన్‌కు ఆమోదం, డాలర్ బలహీనతతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు సెన్సెక్స్ సంచలన ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ మార్చి కనిష్టం నుంచి అంటే 208 రోజుల్లో 24,500 పాయింట్లు లాభపడింది. సూచీ 50 వేల స్థాయిని చేరుకొనే క్రమంలో గతేడాది మార్చి 13న 2,889 పాయింట్లను ఆర్జించి తన జీవిత చరిత్రలో అతిపెద్ద లాభాన్ని పొందింది. ఇదే 2020 మార్చి 23న 3,934 పాయింట్లను కోల్పోయి అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకుంది. మార్కెట్ విశేషాలు... ► ఫ్యూచర్ గ్రూప్‌తో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 2 శాతం లాభపడింది. ► క్యూ3 ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో హిందుస్థాన్ జింక్ 4 శాతం నష్టపోయింది. ► హావెల్స్ ఇండియా షేరు 11 శాతం ర్యాలీ చేసి ఏడాది గరిష్టాన్ని తాకింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.196.50 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. కొత్త గరిష్టాల నుంచి వెనక్కి... ♦ రెండురోజుల రికార్డుల ర్యాలీకి విరామం ♦ ముగింపులో 50 వేల దిగువకు సెన్సెక్స్ సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 49,624 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,590 వద్ద స్థిరపడింది. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఇంట్రాడే సెన్సెక్స్ 392 పాయింట్లు పెరిగి 50 వేల మైలురాయిని అధిగమించి 50,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్ సైతం 108 పాయింట్లు పెరిగి 14,753 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. డాలర్ మారకంలో రూపాయి మూడోరోజూ బలపడటం కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దేశీయ పరిణామాలు కలిసిరావడంతో గురువారం సెన్సెక్స్ 305 పాయింట్ల లాభంతో చరిత్రాత్మక స్థాయి 50000 స్థాయిపైన 50,097 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 14,731 వద్ద మొదలైంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ప్రెస్పై నిపుణులు ఏమన్నారంటే... గడిచిన రెండు దశాబ్దాల్లో సెన్సెక్స్ 5000 పాయింట్ల నుంచి 50,000 పాయింట్ల వరకు చేసిన ప్రయాణం చిరస్మరణీయం. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలే స్టాక్ సూచీలకు సోపానాలుగా మారుతాయి. మున్మందు.., పైపైకే... అనే సూత్రాన్ని విశ్వస్తున్నాను. – రాధాకృష్ణ ధమాని, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అతిపెద్ద బుల్ మార్కెట్ ఇప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తులో మార్కెట్ పెరిగేందుకు అనేక కారణాలు మున్ముందు రానున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది. – రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, స్టాక్ మార్కెట్ బిగ్బుల్ 50 వేల పాయింట్ల మైలురాయిని అందుకోవడం అనేది సెన్సెక్స్‌కు కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఇది గమ్యంæ కాదు. మరో పదేళ్లలో లక్ష పాయింట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాము. – విజయ్ కేడియా, కేడియా సెక్యూరిటీసీ చీఫ్ ఏప్రిల్ 1, 1979 సెన్సెక్స్ – 100 పాయింట్లు జూలై 25, 1990 సెన్సెక్స్ – 1000 పాయింట్లు ఫిబ్రవరి 7, 2006 సెన్సెక్స్ – 10,000 పాయింట్లు డిసెంబర్ 11, 2007 సెన్సెక్స్ – 20,000 పాయింట్లు మార్చి 4, 2015 సెన్సెక్స్ – 30,000 పాయింట్లు మే 23, 2019 సెన్సెక్స్ 40,000 జనవరి 21, 2021 సెన్సెక్స్ 50,000 -
రెండో రోజూ అమ్మకాలే..!
ముంబై: ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కరోనా కేసుల భయం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫ్రా రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 39,750 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 11,700 దిగువున 11,671 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొనసాగడం, బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి పతనంతో ఒక్క ఐటీ షేర్లు స్వల్పంగా లాభాలను ఆర్జించగలిగాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524 – 40,011 రేంజ్ కదలాడింది. నిఫ్టీ 11,606 – 11,744.15 పరిధిలో ఊగిసలాడింది. దేశీయ స్టాక్ మార్కెట్ దృష్టి ఇప్పుడు కంపెనీల క్యూ2 ఫలితాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వైపు మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, అమెరికా ఎన్నికలపై, ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనపై సందిగ్ధత కొనసాగడం లాంటి ప్రతికూలాంశాలు ఇప్పుడిప్పుడే రికవరి అవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలను రేకెత్తించాయి. ఈక్విటీల్లో నెలకొన్న బలహీనత స్వల్పకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలతో పాటు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. బలహీనంగా ప్రపంచమార్కెట్లు... అమెరికా అనిశ్చితులతో పాటు రోజు వారీగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రపంచమార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. కోవిడ్–19 కేసుల కట్టడికి యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో పాటు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వృద్ధి ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లను కలవరపెట్టాయి. ఫలితంగా గురువారం ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల ఇండెక్స్‌లు 0.5% నుంచి 1% నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు అరశాతం క్షీణించాయి. 5% నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) షేరు గురువారం 5 శాతం పతనమైంది. క్యూ2 ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6 శాతం క్షీణించి రూ.927 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 5% పతనంతో రూ.935 వద్ద స్థిరపడింది. -
మాయ..మార్కెట్..మనిషి
ముంబై.. దేశ ఆర్థిక రాజధాని... భారత స్టాక్‌మార్కెట్లకు నెలవు... నిమిషాల్లో ఫకీరును అమీరుగా, అమీరును ఫకీరుగా (ఫకీర్ జనాభానే ఎక్కువనుకోండి) మార్చే మాయలమరాఠీలకు మారు రూపాలు ఈ మార్కెట్లని గిట్టనివాళ్లు ఆడిపోసుకుంటారు. ఇప్పటి ముంబైలో ఈ స్టాక్ మార్కెట్లు కొలువై ఉన్న ప్రాంతంలోనే ఒకప్పుడు సూత మహామునికి తమ్ముడి వరుసయ్యే జూనియర్ సూతుడు అనేక సత్ర యాగాలు చేశాడని అదేదో పురాణంలో ఉంది.ఈ యాగాలకు ఓ అంటూ.. జూనియర్ శౌనకాది మునుల చుట్టాలు, పక్కాలు బోలెడుమంది వచ్చేవారు. ఒకేడాది అలాంటి సత్రయాగానికి విచ్చేసిన జూ.శౌనకాది మునులంతా జూ. సూతుడి చుట్టూ చేరి‘‘మహానుభావా! కలికాలం రాబోతోంది కదా, అప్పుడు రుషులు ఎలా ఉంటారు? సిద్ధులు ఎలా ఉంటారు? ఆ కాలంలో మాయ అంటే ఏంటి? మనిషిని ఏం చేస్తుంది?’’ అని ప్రశ్నించారు. జూ. సూతుడు పేద్ద పేద్ద గడ్డం మీసాల చాటున కనిపించని మందహాసం చేసి‘‘రుషులారా! తెలిసో తెలీకో మంచి ప్రశ్న అడిగారు. కలియుగంలో కొంత కాలం గడిచాక మనిషి మనీని సృష్టిస్తాడు. అంతా మాయ అనేది భారతీయ వేదాంతం. ఈ మాటను మనిషి సృష్టించే మనీ నొక్కి వక్కాణించేదిగా ఈ మనీ . మాయ అని తెలిసి కూడా మనీ కోసమే మెనీ తిప్పలు పడతాడు మానవుడు.’’‘‘ సృష్టికర్తే సృష్టిపై మోహపడటం అప్పట్లో బ్రహ్మ, సరస్వతి విషయంలో జరిగింది, భవిష్యత్‌లో మనిషి, మనీ విషయంలో జరుగుతుంది. అందుకు మనం కూర్చున్న ఈ ప్రాంతమే కేంద్రం అవుతుంది. ’’ అని సమాధానం చెప్పాడు. జూ. శౌనక అండ్బ్యాచ్శ్రద్ధగా వింటున్నారా?లేదా గమనించి, తాను ఆశించిన ఎఫెక్ట్వాళ్ల మొహాల్లో కనిపించేసరికి ఆనందించి జూ. సూతుడు ఇలా కొనసాగించాడు..‘‘మనీ అంటేనే మాయ అనుకుంటే దాన్ని అమ్మమొగుడు లాంటి మాయ ఇంకోటుంది. అది అందరికీ తెలిసేది కాదు. మనలో కొందరు మాత్రమే తపస్సు చేసి మాయ స్వరూప స్వభావాలను తెలుసుకున్నట్లే, అప్పటి మనుషుల్లో కొందరు మాత్రమే ఈ ఆధునిక మాయను తెలుసుకుంటారు.(కనీసం తెలుసుకున్నామని అనుకుంటారు). ఆ మాయ పేరే మార్కెట్’’ అని చెప్పగా, జూ. శౌనకాది మునులు ఆత్రంగా ‘‘స్వామీ వీళ్లే కలియుగపు రుషులా?’’ అని ప్రశ్నించారు.‘‘ అలాగే అనుకోవచ్చు బిడ్డలారా.. కాకపోతే, పూర్వపు రుషులు మాయను జయించేవాళ్లు, కానీ ఈ ఆధునిక రుషులు త్రం మార్కెట్లంటేనే మాయని తెలుసుకొని కూడా, మత్తుగా అందులోనే ఉంటారు. ఈ కొత్త రుషులనే ట్రేడర్లంటారు..’’ అని చిరునవ్వుతో వివరించాడు జూ. సూతుడు. ‘‘స్వామీ, కొత్త రుషులు వారి గుణగణాదులు ఎలా ఉంటాయని’’ జూ. శౌనకాది అండ్బ్యాచ్మరింత ఆసక్తిగా ప్రశ్నించారు. (ఇక్కడనుంచి భాష మొత్తం ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొనసాగుతుంది) జూ. సూత ఉవాచ: ‘‘ఎవరికి పడితే వాళ్లకు ట్రేడర్లయ్యే అర్హత లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.∙ఎవరి జాతకంలోనైతే సర్వ గ్రహాలు విలయతాండవం చేస్తుంటాయో, ∙ఎవరిని భగవంతుడు ప్రతిసారి చిన్నచూపు చూస్తాడో.∙ఎవరి రక్తంలో ఎ, బి, ఒ, ఎబి గ్రూపుల్లో ఏదోఒకగ్రూప్తో పాటు ‘తిమ్మిరి’ గ్రూప్ అనే ప్రొటీన్ అంతర్లీనంగా ఉంటుందో, ∙ఎవరైతే అపజయాలను, విజయాలను సమానంగా చూసే(నిజానికి మొదటివే ఎక్కువ ఉంటాయి) స్థిత ప్రజ్ఞతలాంటి మూర్ఖత్వం ఉంటుందో....అని కాస్త అలుపు తీర్చుకుని‘‘వాళ్లకే ట్రేడర్లయ్యే మహాద్భుత అవకాశం ఉంటుందని అదేదో పురాణంలో ఇంకేదో శ్లోకంలో మరెవడో చెప్పాడని వేరెవరో నాకు చెప్పారు.’’ ఇంతలో జూ. సూతని మేధోతలంలో భవిష్యత్‌లో తెలుగులో పాపులర్ కాబోతున్న ఒక డైలాగ్ వినిపించి/ కనిపించింది. ఇదేదో బాగుందనుకుంటూ.. అదే స్టైల్లో...‘‘ చూడప్పా శౌనప్పా, ఈ కొత్త రుషులు, పాతకాలం రుషుల్లాంటోళ్లే.. పాతకాలం రుషులు ఏకాంతాన్ని కోరుకుంటారు, కొత్త రుషులు మార్కెట్‌మాయలో ఏ ‘కాంత’నూ పట్టించుకోకుండా ఏకాంతాన్ని కోరుకుంటారు. మిగిలిందంతా సేమ్‌టు సేమ్’’. అన్నాడు. ముక్తాయింపుగా ‘‘ కాకపోతే వీళ్లు కోరే ఆ ‘కాంత’(లక్ష్మి) వీళ్ల మొఖం కూడా చూడదు. అది వేరే విషయం’’ అనికూడా సెలవిచ్చాడు జూ. సూతుడు.భవిష్యత్‌కు సంబంధించిన అత్యద్భుత గాధ వింటున్నామన్న ఆసక్తితో ఉన్న జూ. శౌనకాది మునులు అంతటితో ఆగకుండా ‘‘స్వామీ! వీళ్లలో రకాలున్నాయా? ఉంటే ఎలా గుర్తించాలి?’’ అని ప్రశ్నించారు. జూ. సూత ఉవాచ: ‘‘అనుభవం, దురదృష్టం, అత్యాశను బట్టి ఈ ఆధునిక రుషులను మూడు రకాలుగా వర్గీకరించింది ‘‘మనీ ధర్మ శాస్త్రం.’’పిల్ల ట్రేడర్లు– బెరుగ్గా ట్రేడింగ్ తపస్సును ప్రారంభించి స్వల్పలాభాలనే అప్సరసలను చూసి అదే నిజమని భ్రమపడుతూ ఉంటారు. సీనియర్ట్రేడర్లు– స్వల్పలాభాల అప్సరసలను కన్నెత్తి చూడరు, దీక్షగా మోక్షమనే భారీ లాభం కోసం ఎదురు చూస్తుంటారు( ఆ ‘భారీ’కి సరైన నిర్వచనం వీళ్లదగ్గరే ఉండదు) వీళ్ల తపస్సు నాశనం చేసేందుకు అప్పుడప్పుడు(ఎక్కువగా వీళ్ల ఎకౌంట్లో డబ్బులు లేనప్పుడు) మార్కెట్వీళ్ల అంచనాలను నిజం చేస్తుంటుంది. దీంతో వాళ్లకు వాళ్లు తపస్సు ఫలించే దశ వచ్చిందని భ్రమపడి మరింత గట్టిగా అప్పులు చేసి తపస్సులు కంటిన్యూ చేస్తుంటారు. ముదురు టెంక ట్రేడర్లు– స్వల్పలాభాలను, అప్పుడప్పుడు మార్కెట్లో తమ అంచనాలు నిజం కావడాన్ని పట్టించుకోరు. మార్కెట్ అంటేనే మాయ అని పూర్తిగా అర్ధం అవుతుంది. తపస్సు(ట్రేడింగ్) చేయాలని ఉంటుంది, నిధులుండవు. కానీ తపస్సులో ఎప్పుడే అడ్డంకి వస్తుందో అందరికీ అరటిపండు వలిచినట్లు చెబుతుంటారు. మార్కెట్పెరిగినా, తగ్గినా అంతా మాయ అని గుర్తించి కొత్తవాళ్లకు హితబోధలు చేస్తుంటారు. మనసులోమాత్రం ఒక్కచాన్స్వస్తేనా.. అన్న ఆశను మాత్రం వదలరు.’’ మామూలు మనుషుల్లో ఈ రుషులను గుర్తించేందుకు కొన్ని గుర్తులున్నాయని మగధీర సినిమాలో విలన్‌కు హీరోను గుర్తుపట్టే గుర్తులు చెప్పిన అఘోరా(ఈయన ఆ కాలం నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది) చెప్పాడని జూ. సూతుడు సెలవిచ్చాడు. ‘‘ 1. ఎక్కడబడితే అక్కడ తాము చేసిన చిన్న ట్రేడు గురించి, వచ్చిన స్వల్పలాభం గురించి అడక్కపోయినా ఊదరగొట్టేవాళ్లు– పిల్లట్రేడర్లు. 2. ఏ బ్రోకరేజ్‌సంస్థ ఎలాంటి అంచనా చెప్పినా దాన్ని ఖండిస్తూ, తాము మాత్రమే అసలైన అంచనాకారులమని అందరికీ చెప్పుకుంటూ, తమ అనుభవాన్ని ఎరగా చూపి ఎలాగైనా నిధులు సంపాదించి తపస్సు కొనసాగించాలని నిర్విరామంగా పనిచేసేవాళ్లు– సీనియర్ట్రేడర్లు. 3. మార్కెట్ దెబ్బకు ఏదో ఒక అలవాటును వ్యసనంగా మార్చుకొని (సిగరెట్లు తాగడం అత్యధికుల్లో కనిపిస్తుంది) సర్వ జ్ఞానాన్ని పంచేందుకు ఎవరొస్తారా అని చూస్తూ... ఖర్మకాలి ఎవరైనా చిన్న సందేహం అడిగినా దానికి జంధ్యాల సినిమాలో నూతన్ప్రసాద్లాగా మా తాతలు ముగ్గురు అని మొదలెట్టి, అడిగినోడు స్పృహ తప్పేదాకా జ్ఞాన విసర్జన చేసేవాళ్లు– ముదురు టెంక ట్రేడర్లు.’’ అని ఊపిరి పీల్చుకున్నాడు సూతుడు.శ్రద్ధగా కధ వింటున్న శౌనకాది బ్యాచ్‌కు కొత్త డౌట్ వచ్చింది. ‘‘స్వామీ, ఈ మగధీర సినిమా అంటే ఏమిటి? జంధ్యాల, నూతన ప్రసాద్ ఎవరు? ’’జూ. సూతుడికి కోపం వచ్చింది. ‘‘మీకు మార్కెట్లు, మాయ గురించి చెబుతానన్నాను గానీ, సినిమాలు, మాయ గురించి చెబుతాననలేదు, అది వేరే, ఇది వేరే. ఎప్పుడు చూడు ప్రతోడికీ చెప్పేదాని మీదకన్నా పనికిరానిదానిమీదే దృష్టి’’ అని కస్సు బుస్సులాడాడు జూ. సూతుడు.జూ. శౌనక అండ్‌కో ఉవాచ: (భయంతో)‘‘ అంతేనా!’’జూ. సూత ఉవాచ:(కొంచెం కోపం తగ్గి)‘‘ఇంకేం కావాలి?’’జూ. శౌనక అండ్‌కో ఉవాచ:(కొంచెం ధైర్యంగా)‘‘కుదిరితే కాస్త మధురసం.. వీలుంటే ఈ మార్కెట్మాయపై మరిన్ని వివరాలు’’జూ. సూత ఉవాచ:(శాంతంగా)‘‘ పైన చెప్పిన మూడు రకాల రుషులే కాకుండా, మార్కెట్మాయను జయించినవాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు నిజమైన సిద్ధులు ఉన్నట్లే అప్పుడు మార్కెట్సిద్ధులు కూడా ఉంటారు. వీళ్లనే ఇన్వెస్టర్లంటారు. సిద్ధులకు, ఇన్వెస్టర్లకు పోలిక ఒక్కటే.. ఓపిక. పైన చెప్పుకున్న ట్రేడర్లలో సక్సెస్పాలు తక్కువగా ఉండటానికి, ఇన్వెస్టర్లలో సక్సెస్ ఎక్కువ ఉండటానికి ఇదే తేడా. వాళ్లకి ఓపిక ఉండదు, వీళ్లకు ఉండేదే ఓపిక.’’ జూ. శౌనక ఉవాచ: ‘‘ఆహా! మా అదృష్టం పుచ్చి ఈ రోజు మాకు ఈ కొత్త విషయాలు చెప్పారు, వీటిని రాబోయే తరాలకు అందిస్తాం, అయితే ఇంత అద్భుత గాధకు ఫల శ్రుతి లేదా స్వామి?’’ జూ. సూత ఉవాచ:‘‘ఎందుకు లేదు, వినండెహె! తొందరెక్కువ తింగరి రుషులారా!కలియుగంలో ఇన్వెస్టర్ అవుదామనుకుంటే పర్లేదు కానీ, పైన చెప్పిన రుషుల కేటగిరీల్లో చేరదామనుకుంటే మాత్రం మార్కెట్ జోలికి పోకపోవడమే మంచిది. అంతేకాదు, ఇంకోమాట.ఇందాక చెప్పిన రుషులు ఎవరు కనిపించినా కోప్పడటం, విసుక్కోవడం చేయకుండా, వీలైతే మళ్లీ అడగని అప్పులు ఇచ్చి ఆదుకుంటే మార్కెట్మహాతల్లి మీకు బోలెడు వరాలిస్తుందని పురాణాలు వక్కాణిస్తున్నాయి. ఈ మాయ మార్కెట్గాధను చదివినా, విన్నా, తెలుసుకున్నా.. మార్కెట్ల మాయలో చిక్కుకోకుండా ఉంటారు.’’పీఎస్: అఫ్కోర్స్, రుషి కావాలని మీ నుదిటిన రాసి ఉంటే పైన చెప్పిన ఫలశ్రుతి వర్తించదు. -
బడ్జెట్ రోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్లు!
భారత స్టాక్ మార్కెట్లకు ప్రతి శని, ఆదివారాలు సెలవులు. కానీ, ఈనెల 28వ తేదీ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. ఆరోజు శనివారం అయినా కూడా సంప్రదాయానికి భిన్నంగా స్టాక్ మార్కెట్లను తెరిచి ఉంచనున్నారు. అంటే ఆరోజు లావాదేవీలు కొనసాగుతాయన్నమాట. ప్రభుత్వం ప్రకటించే నిర్ణయాలను బట్టి ఆయా రంగాలకు చెందిన షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు రావడం సర్వ సాధారణం. ఏయే రంగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలుంటాయన్న అంచనాలతో ముందునుంచి షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. అంచనాలకు అనుగుణంగా ఉంటే సెన్సెక్స్ ఒక్కసారిగా రయ్యిమని పెరగడం, పరిశ్రమకు అనుకూలంగా లేకపోతే ధడేల్మని పడిపోవడం కూడా ఎప్పుడూ చూస్తుంటాం. ప్రతిసారీ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 28నే ప్రవేశపెడుతుంటారు. అది ఈసారి శనివారం రావడంతో.. బ్రోకర్ల విజ్ఞప్తి మేరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండింటినీ తెరిచి ఉంచుతామని, ఆరోజు లావాదేవీలు కొనసాగుతాయని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. ఈసారి పలు సంస్కరణలు ప్రవేశపెడతారని అంచనా వేస్తున్నారు. -
మూడు వారాల కనిష్టానికి నిఫ్టీ
* వెన్నాడిన చమురు, గ్రీస్ అందోళనలు * 79 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్ అప్డేట్ ముంబై: భారత స్టాక్ మార్కెట్ల పతన తీవ్రత కొంత నెమ్మదించింది. మంగళవారం నిట్టనిలువుగా పడిపోయిన మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ జరిగినంత సేపూ సూచీలు స్వల్ప నష్టాల్లోనే కొనసాగాయి. బ్లూచిప్ షేర్లలో నష్టాల కారణంగా చివరకు 79 పాయింట్లు కోల్పోయి 26,909 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 275 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 8,102 పాయింట్ల వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉండడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు సూచీల నష్టానికి కారణాలు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లకు దిగువకు వస్తే అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలు మసకబారతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్రోకర్లు చెప్పారు. యూరో జోన్ నుంచి గ్రీస్ వైదొలిగే అవకాశాలు పెరుగుతండడం సైతం ఇన్వెస్టర్లను ఇన్వెస్టర్లను ఆందోళనపర్చాయి. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోవడం, ముడి చమురు మరింతగా పతనమవడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా సాగాయని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ వ్యాఖ్యానించారు. లోహా, బ్యాంక్ షేర్లు సెన్సెక్స్‌ను పడగొట్టాయి. బీఎస్ఈలో మొత్తం టర్నోవర్ రూ.3,210 కోట్లుగా నమోదైంది. ఎన్ఎస్ఈలో మొ త్తం టర్నోవర్ ఈక్విటీల్లో రూ.16,358 కోట్లుగా, డెరివేటివ్స్‌లో రూ.2,32,360 కోట్లుగా నమోదైంది. -
55 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసింది. ఇరాక్ లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు ఒడిదుడుకులు లోనవుతున్నాయి. జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో సెన్సెక్స్ 55 పాయింట్లు కోల్పోయి 25313 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7569 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, గెయిల్, కోల్ ఇండియా, హెచ్ యూఎల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, ఐటీసీ, ఓఎన్ జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్ సీ, లార్సెన్ కంపెనీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. -
భారీ లాభాల్లోకి సెన్సెక్స్
హైదరాబాద్: కనిష్టస్థాయిలో బ్లూచిప్ కంపెనీ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్ పుంజుకుని లాభాల్లో ముగియడంతో మదుపుదారులు ఊపిరి పీల్చుకున్నారు. నష్టాలతో ఆరంభమైన సూచీలు ఓ దశలో 25104 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే ప్రధాన రంగ కంపెనీల షేర్లలో మదుపుదారులు కొనుగోళ్లు జరపడంతో ఇంట్రాడే ట్రేడింగ్ 25523 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 330 పాయింట్ల లాభంతో 25521 వద్ద, 98 పాయింట్ల వృద్దితో 7631 వద్ద ముగిసింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా ఓఎన్ జీసీ 4.26 శాతం, ఏషియన్ పెయింట్స్ 3.84, యాక్సీస్ బ్యాంక్ 3.75, పీఎన్ బీ 3.52, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.35 శాతం లాభపడ్డాయి. ఎంఅండ్ఎం, యునైటెడ్ స్పిరిట్స్, హీరో మోటార్ కార్ప్, హెచ్ యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలు స్వల్పంగా నష్టపోయాయి. -
సెన్సెక్స్.. 322 మైనస్
గత నాలుగు నెలల్లో లేని విధంగా మార్కెట్ డీలాపడింది. రోజంతా అమ్మకాలదే పైచేయి కావడంతో సెన్సెక్స్ 322 పాయింట్లు పతనమైంది. వెరసి రెండు వారాల కనిష్టమైన 24,234 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 94 పాయింట్లు తగ్గి 7,236 వద్ద నిలిచింది. ఇంతక్రితం జనవరి 27న మాత్రమే ఇండెక్స్‌లు ఈ స్థాయిలో దిగజారాయి. సెన్సెక్స్ 426 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో భారీ అమ్మకాలు కలగలసి మార్కెట్‌ను పడగొట్టినట్లు నిపుణులు తెలిపారు. మరోవైపు మే నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. కంపెనీ ప్రెసిడెంట్ బీజీ శ్రీనివాస్ రాజీనామాతో ఇన్ఫోసిస్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో షేరు దాదాపు 8% పతనమై రూ. 2,924 వద్ద ముగిసింది. షేరుకి తుది డివిడెండ్ రూ. 43 చెల్లింపు గడువు ముగియడం కూడా షేరుపై ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు తెలిపారు. ఐటీ, ఆయిల్ బోర్లా బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా, ఐటీ 3.5% దిగజారింది. ఈ బాటలో ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% చొప్పున నీరసించాయి. కాగా, ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల్లో రూ. 550 కోట్ల అమ్మకాలను చేపట్టిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 523 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ మాత్రం రూ. 195 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. ఇవీ ఇతర విశేషాలు... సెన్సెక్స్‌లో కేవలం ఏడు షేర్లు లాభపడగా, హిందాల్కో, ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్ 1.5% స్థాయిలో లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్జీసీ, విప్రో, భెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ 2.7-1.3% మధ్య డీలాపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో బజాజ్ ఎలక్ట్రికల్స్ 14% పడిపోగా, కిర్లోస్కర్ బ్రదర్స్, వొకార్డ్, పీఐ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, జైన్ ఇరిగేషన్, జిందాల్ స్టెయిన్లెస్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, నైవేలీ లిగ్నైట్, బాంబే బర్మా, అదానీ ఎంటర్ప్రైజెస్ 9-5% మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ టార్గెట్ 8,400: మెక్వారీ కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో నిఫ్టీ టార్గెట్‌ను 7,200 నుంచి 8,400కు పెంచుతున్నట్లు మెక్వారీ సెక్యూరిటీస్ పేర్కొంది. మోడీ ప్రభుత్వం పనితీరుపట్ల ఆశావహ ధృక్పథంతో అంచనాలను పెంచినట్లు మెక్వారీ నిపుణులు రాకేష్ అరోరా చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలున్నాయని తెలిపారు. దీంతో సిమెంట్ వంటి సైక్లికల్ రంగాలతోపాటు, అన్ని రంగాలూ పురోభివృద్ధి సాధించే అవకాశమున్నదని, వెరసి మార్కెట్‌పట్ల బుల్లిష్‌గా ఉన్నామని చెప్పారు. ప్రస్తుత సానుకూల పరిస్థితులతో నిఫ్టీ లక్ష్యాన్ని మరోసారి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు రాకేష్ పేర్కొన్నారు. -
ఎగసి పడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ చరిత్రలో రెండోసారి సెన్సెక్స్ 25,000 పాయింట్లను అధిగమించింది. ఇందులో విశేషమేవిటంటే... సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు(మే 16)నాటి ట్రేడింగ్‌ను పోలి మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులను చవిచూడటం! దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తొలుత లాభాలతో మొదలయ్యాయి. కొనుగోళ్లు పుంజుకోవడంతో ఉదయం 12కల్లా సెన్సెక్స్ 25,175ను తాకింది. ఇది దాదాపు 500 పాయింట్ల లాభం! అయితే చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలను కోల్పోవడమేకాకుండా 24,434 పాయింట్ల కనిష్టస్థాయికి జారింది. 250 పాయింట్లకుపైగా నష్టమిది!చివరికి స్క్వేరప్ లావాదేవీల కారణంగా 23 పాయింట్ల లాభంతో 24,717 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా ఒక దశలో 130 పాయింట్లు ఎగసినప్పటికీ చివరికి 8 పాయింట్ల నష్టంతో 7,359 వద్ద స్థిరపడింది. బీజేపీకి మెజారిటీ లభించిందన్న వార్తలతో మే 16న కూడా సెన్సెక్స్ తొలుత 1,500 పాయింట్లు ఎగసినప్పటికీ తుదకు 215 పాయింట్ల లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే. భెల్ డౌన్, ఎంఅండ్ఎం అప్ బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ 5%పైగా పతనంకాగా, పవర్ 3% క్షీణించింది. రియల్టీ షేర్లు డీబీ, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, ఫీనిక్స్ 10-5% మధ్య దిగజారాయి. ఈ బాటలో పవర్ షేర్లు జేపీ, అదానీ, ఎన్‌హెచ్‌పీసీ, పీటీసీ, టొరంట్, టాటా పవర్ 8-4% మధ్య తిరోగమించాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్ఈఎల్ 5% నీరసించగా, గెయిల్, హిందాల్కో, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్ 4-2% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు ఎంఅండ్ఎం 6.2% జంప్‌చేయగా, సెసాస్టెరిలైట్, విప్రో, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 4-2% మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు డీలా మార్కెట్లలో ఏర్పడ్డ ఒడిదుడుకుల కారణంగా చిన్న షేర్లు డీలాపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2%పైగా క్షీణించగా, ట్రేడైన షేర్లలో 1,660 నష్టపోయాయి. 1,362 మాత్రమే లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఉషా మార్టిన్, చెన్నై పెట్రో, కేఎస్కే ఎనర్జీ, స్పైస్ జెట్, జిందాల్ స్టెయిన్లెస్, ఐవీఆర్సీఎల్, ల్యాంకో ఇన్ఫ్రా, గీజాంజలి, జీవీకే, రెయిన్, ఆర్కిడ్, హెచ్‌సీసీ, నాల్కో, బీజీఆర్, బాంబే డయింగ్, ఎస్సార్ పోర్ట్స్, శ్రేఈ ఇన్ఫ్రా, బజాజ్ హిందుస్తాన్, డెల్టా కార్ప్, మ్యాగ్మా ఫిన్, ఈరోస్ 12-8% మధ్య పతనమయ్యాయి. 28 వేల పాయింట్లకు సెన్సెక్స్ డాయిష్ బ్యాంక్ అంచనా వచ్చే డిసెంబరుకు సెన్సెక్స్ 28,000 పాయింట్లను చేరుతుందని డాయిష్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దేశీయ మార్కెట్ల రేటింగ్‌ను గత వారంలో ‘న్యూట్రల్’ స్థాయికి సంస్థ తగ్గించింది. కేంద్రంలో ఏక పార్టీ పాలన రావడం, ఆర్థిక అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉండడం, దేశ ప్రజానీకం మార్పును కోరుతుండడంతో ఇన్వెస్టర్లలో సందేహాలు తొలగిపోతాయని విశ్వసిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. -
ప్రభుత్వ షేర్ల హవా
* 241 పాయింట్లు అప్ * 24,363 వద్దకు సెన్సెక్స్ * నిఫ్టీ 60 పాయింట్లు ప్లస్ * 7,264 వద్ద ముగింపు * కొత్త గరిష్ట స్థాయిలివి! * పవర్, క్యాపిటల్ గూడ్స్ జోరు * ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ డీలా కేంద్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో ప్రభుత్వ రంగ షేర్లకు ఊపొచ్చింది. గత కొన్నేళ్లుగా విధానపరమైన నిర్ణయాలు కుంటుపడటంతో అటు ఆర్థిక వ్యవస్థతోపాటు, ఇటు ప్రభుత్వ రంగ షేర్లు సైతం వెలుగు కోల్పోయాయి. మోడీ అధ్యక్షతన ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం సంస్కరణలు వేగవంతం చేయడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వృద్ధికి జోష్నిస్తుందన్న అంచనాలు ప్రభుత్వ షేర్లకు డిమాండ్ పెంచాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు, పవర్, ఇన్ఫ్రా రంగాలు వెలుగులో నిలిచాయి. వెరసి వరుసగా మూడో రోజు మార్కెట్ లాభాలను ఆర్జించింది. 241 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 24,363 వద్ద నిలవగా, 60 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 7,264 వద్ద స్థిరపడింది. మార్కెట్ చరిత్రలో ఇండెక్స్‌లు ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి! కాగా, ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగాయి. ఎఫ్ఐఐలు రూ. 1,350 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ నికరంగా రూ. 348 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. భెల్ దూకుడు బీఎస్ఈలో పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, మెటల్ రంగాలు 10-7% మధ్య జంప్ చేయడం విశేషంకాగా, బ్యాంకెక్స్ సైతం 3% లాభపడింది. అయితే మరోవైపు ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ 5-4% మధ్య పతనమయ్యాయి. ప్రభుత్వ షేర్లలో విద్యుత్ రంగ దిగ్గజం బీహెచ్ఈఎల్ 17% దూసుకెళ్లగా, కోల్ ఇండియా 13%, ఎన్టీపీసీ 10%, ఓఎన్జీసీ 8% చొప్పున ఎగశాయి. ఇండొనేషియాలో 200 మెగావాట్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం భెల్‌కు జోష్‌నిచ్చింది. ఈ బాటలో ఇతర పీఎస్‌యూ షేర్లు ఎంఎంటీసీ, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, హిందుస్తాన్ కాపర్, నైవేలీ లిగ్నైట్, పీటీసీ, ఆర్సీఎఫ్, ఎఎఫ్సీ, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్ఈసీ, ఎంవోఐఎల్, కంటెయినర్ కార్పొరేషన్, సెయిల్ 20-10% మధ్య పురోగమించాయి. వీటితోపాటు రియల్టీ షేర్లు యూనిటెక్, అనంత్‌రాజ్, డీబీ, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్ 11-5% మధ్య పుంజుకున్నాయి. టీసీఎస్ 6% పతనం ఇతర సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, హిందాల్కో, ఎల్అండ్టీ, ఎస్బీఐ, సెసాస్టెరిలైట్, యాక్సిస్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ 8-3.5% మధ్య లాభపడగా, గత కొంత కాలంగా మార్కెట్లను శాసించిన ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు అమ్మకాలతో నీరసించాయి. టీసీఎస్ 6% పతనంకాగా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, విప్రో, హెచ్‌యూఎల్ 5-4% మధ్య తిరోగమించాయి. ఈ బాటలో వోకార్డ్, ఇప్కా, గ్లెన్‌మార్క్, లుపిన్, ర్యాన్‌బాక్సీ, అరబిందో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, మైండ్‌ట్రీ సైతం 7-4% మధ్య దిగజారాయి. ఇటీవల పుంజుకుంటూ వస్తున్న రూపాయి తాజాగా డాలరుతో మారకంలో 11 నెలల గరిష్టం 58.37కు చేరడంతో ఐటీ, హెల్త్‌కేర్ షేర్లలో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు విశ్లేషించారు. -
చిన్న షేర్లు విలవిల
భారీ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే అధిక శాతం చిన్న షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 22,418 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 6,696 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, సెన్సెక్స్ తొలుత 214 పాయింట్ల వరకూ లాభపడింది. ఆపై ఉన్నట్టుండి పతనబాటపట్టి 180 పాయింట్ల వరకూ దిగజారింది. ఎన్డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చన్న అంచనాలు మిడ్ సెషన్లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,704 నష్టపోగా, 973 మాత్రమే బలపడ్డాయి. రియల్టీ బోర్లా రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, డీబీ, ఇండియాబుల్స్, ఒబెరాయ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 9-3% మధ్య పతనంకావడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5.3% పడిపోయింది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, పవర్, వినియోగ వస్తు రంగాలు సైతం 2% చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, భెల్, సెసాస్టెరిలైట్, భారతీ, ఎల్అండ్టీ, హిందాల్కో, ఐసీఐసీఐ 3.5-1.5% మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ 3-1.5% మధ్య లాభపడ్డాయి. బుధవారం ఎఫ్ఐఐలు రూ. 454 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
ఒడిదుడుకుల వారము
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మార్చి నెల ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నదని తెలిపారు. వచ్చే నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో వడ్డీ ప్రభావిత రంగాలలో లావాదేవీలు పుంజుకుంటాయని అంచనా వేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నందున ట్రేడర్ల కార్యకలాపాలు ఊపందుకుంటాయని దీంతో ఇండెక్స్‌లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. వెరసి ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాల షేర్లవైపు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. వెలుగులో చిన్న షేర్లు : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో మార్చి డెరివేటివ్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులు చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష వంటి అంశాలు కూడా కారణంకానున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు వెలుగులో నిలుస్తాయని, వీటికితోడు చిన్న షేర్లకు డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. ఇకపై క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లను నడిపిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,475 స్థాయి కీలకంగా నిలవనున్నదని తెలిపారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలపై అంచనాలు: వచ్చే నెల 7 నుంచి మే 12 మధ్య కాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఇది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు(ఎఫ్ఐఐలు) ప్రోత్సాహాన్నిస్తున్నదని చెప్పారు. దీంతో గడిచిన నెల రోజుల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్, నిఫ్టీ 5%పైగా పురోగమించాయని వివరించారు. ఫెడ్ ఎఫెక్ట్: వచ్చే ఏడాది(2015) ద్వితీయార్థంలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో సంకేతాలిచ్చింది. మరోవైపు నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున సహాయక ప్యాకేజీలో కోతను పెంచుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం ప్యాకేజీ 55 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, త్వరలో పూర్తిస్థాయిలో ప్యాకేజీని ఉపసంహరించే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు విదేశీ పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ అంటోంది. ఎఫ్ఐఐల జోష్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌పై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 9,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో (21 వరకూ) ఎఫ్ఐఐలు నికరంగా రూ. 9,600 కోట్లను(156 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇక ఇదే కాలంలో రుణ(డెట్) సెక్యూరిటీలలో మరింత అధికంగా రూ. 12,816 కోట్లను(200 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
వారం రోజుల గరిష్టం
ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు వారంరోజుల గరిష్టస్థాయిలో ముగిసాయి. గురువారం 20,358-20,080 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 50 పాయింట్ల లాభంతో 20,311 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జనవరి 31 తర్వాత బీఎస్ఈ సూచీకి ఇదే గరిష్ట ముగింపు. ఒకదశలో 5,965 పాయింట్ల స్థాయికి పడిపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 14 పాయింట్ల లాభంతో 6,036 పాయింట్ల వద్ద ముగిసింది. మూడురోజులుగా సెన్సెక్స్ 101 పాయింట్లు పెరగగలిగింది. అంతకుముందు ఏడు రోజుల్లో 1,100 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజీ వున్న ఎఫ్ఎంసీజీ షేర్లు ఐటీసీ, హెచ్‌యూఎల్‌లు 2-3 శాతం మధ్య ర్యాలీ జరపడంతో తాజాగా మార్కెట్ వారంరోజుల గరిష్టాన్ని అందుకోవడం సాధ్యపడింది. ఆటో షేర్లు మారుతి, మహీంద్రాలు 2 శాతం మేర పెరగ్గా, పీఎస్‌యూ షేర్లు కోల్ ఇండియా 5 శాతం, ఎన్ ఎండీసీ 2.5 శాతం చొప్పున ఎగిసాయి. రియల్టీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ 2 శాతం తగ్గాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బీఓబీ, పీఎన్‌బీలు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. కొద్ది రోజులగా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కాస్త నెమ్మదించింది. తాజాగా వీరు రూ. 10 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేయగా, దేశీయ సంస్థలు రూ. 610 కోట్లు పెట్టుబడి చేసాయి. ఐటీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్ గురువారం మార్కెట్ హఠాత్తుగా టర్న్ ఎరౌండ్కావడానికి సూచీల్లో 10% పైగా వెయిటేజి వున్న ఐటీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్ జరగడం కారణం. కవరింగ్‌ను సూచిస్తూ ఐటీసీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 9.56 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.76 కోట్ల షేర్లకు తగ్గింది. రూ. 320 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 1.06 లక్షల షేర్లు కట్‌కాగా, ఇదే స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 84 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ కాల్ ఆప్షన్లో ఓఐ 2.06 లక్షలు, పుట్ ఆప్షన్లో 3.11 లక్షల షేర్ల వరకూ వుంది. రూ. 330 కాల్ ఆప్షన్లో మాత్రం 45 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 6.97 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 320పైన స్థిరపడగలిగితే రూ. 330 స్థాయిని సమీపించవచ్చని, తదుపరి అప్‌ట్రెండ్ జరగాలంటే రూ. 330 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుందని ఈ ఆప్షన్ డేటా పేర్కొంటోంది. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 304 పాయింట్ల నష్టంతో 20209 పాయింట్ల వద్ద, నిఫ్టీ 87 పాయింట్లతో 6001 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, బ్యాంకింగ్, ఆటో రంగాల కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో లుపిన్ అత్యధికంగా 4.52 శాతం, గెయిల్, డాక్టర్ లాబ్స్, సన్ ఫార్మా, సిప్లా కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. హిండాల్కో అత్యధికంగా 5.57 శాతం, జయప్రకాశ్ అసోసియేట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ కంపెనీల షేర్లు సుమారు 4 శాతం నష్టాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్లలో ఎఫ్ టీఎస్ ఈ 20, కాక్ 29, డాక్స్ 67 పాయింట్ల నష్టాలతో కొనసాగుతున్నాయి. నిక్కి 295, హ్యాంగ్ సంగ్ 106 పాయింట్ల నష్టంతో ముగిసాయి. -
సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ ఘనవిజయం సాధించడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో పరుగులు పెట్టాయి. 2014 సాధారణ ఎన్నికలు మార్కెట్ కు మద్దతునందిస్తాయనే ఊహాగానాలతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హైని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 21326 వద్ద, నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 6363 వద్ద ముగిసాయి. మార్కెట్లు భారీగా లాభపడటంతో 75 వేల కోట్ల మేరకు మదుపరుల సంపద వృద్ధిని సాధించింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్, సెసా స్టెర్ లైట్, ఐసీఐసీఐ బ్యాంకులు 5 శాతానికి పైగా, లార్సెన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 6 శాతం నష్టపోగా, సిప్లా, లుపిన్, కెయిర్న్ ఇండియా, టాటాస్టీల్ స్వల్ప నష్టాలతో ముగిసాయి. -
గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ
క్రితం రోజు ర్యాలీకి కొనసాగింపుగా శుక్రవారం ఉదయుం మార్కెట్ పెరిగిన సవుయుంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో చివరకు స్టాక్ సూచీలు ఫ్లాట్‌గా వుుగిసారుు. ట్రేడింగ్ తొలిదశలో 20,052 పారుుంట్ల గరిష్టస్థారుుకి పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు క్రితం వుుగింపుతో పోలిస్తే 14 పారుుంట్ల స్వల్పలాభంతో 19,916 పారుుంట్ల వద్ద క్లోజరుు్యంది. ఈ స్థారుు దాదాపు రెండు వారాల గరిష్టం. 5,950 పారుుంట్ల నుంచి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 2 పారుుంట్ల నష్టంతో 5,907 పారుుంట్ల వద్ద వుుగిసింది. అమెరికా షట్‌డవున్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించారని, దాంతో ఇటీవల పెరిగిన షేర్లలో పొజిషన్లను క్లోజ్చేసుకోవడం వల్ల సూచీలు బలహీనంగా వుుగిసాయుని వూర్కెట్ విశ్లేషకులు తెలిపారు. బ్యాంకింగ్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. దాంతో యూక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీలు తగ్గారుు. ఆటోమొబైల్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరిగారుు. హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు పెరిగారుు. మెటల్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్... కొద్దిరోజుల విరావుం తర్వాత మెటల్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్ జరిగింది. నగదు విభాగంలో కొనుగోళ్ల స్పీడు అంతంతవూత్రంగానే వున్నా, డెరివేటివ్స్ విభాగంలో ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్లను పెంచుకున్నట్లు మెటల్ కౌంటర్ల డేటా వెల్లడిస్తున్నది. 2 శాతం పెరిగిన హిందాల్కో ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 16.68 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. దాంతో మొత్తం ఓఐ 2.20 కోట్ల షేర్లకు పెరిగింది. కాల్ ఆప్షన్లలో తాజా రైటింగ్ జరగకపోగా, రూ. 110 స్ట్రరుుక్ వద్ద భారీ పుట్ రైటింగ్ ఫలితంగా ఈ ఆప్షన్లో తాజాగా 14.88 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. సమీప భవిష్యత్తులో రూ. 110 స్థారుు వుద్దతును అందించవచ్చని ఈ రైటింగ్ సూచిస్తోంది. టాటా స్టీల్ ఫ్యూచర్ కాంట్రాక్టులో వరుసగా రెండో రోజు ఓఐ యూడ్ అరుు్యంది. దాంతో మొత్తం ఓఐ 1.65 కోట్ల షేర్లకు పెరిగింది. ఈ షేరుకు రూ. 300, రూ. 310 స్ట్రరుుక్స్ వద్ద కాల్ కవరింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ రెండు స్థారుులూ అవరోధం కల్పించకపోవొచ్చన్న అంచనాల్ని ఈ కవరింగ్ విశ్లేషిస్తున్నది. వురో ఉక్కు కంపెనీ సెరుుల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో తాజాగా 10.76 లక్షల షేర్లు (7.5 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.54 కోట్ల షేర్లకు పెరిగింది. కొద్దిరోజుల్లో షేరు పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషనగా పరిగణిస్తారు. ఫలానా స్థారుు దిగువకు తగ్గకపోవొచ్చన్న అంచనాలతో పుట్ ఆప్షన్లను విక్రరుుంచే ప్రక్రియును పుట్ రైటింగ్ అని, ఫలానా స్థారుుని దాటవచ్చన్న అనువూనాలు వుంటే గతంలో విక్రరుుంచిన కాల్ ఆప్షన్‌ను తిరిగి కొనుగోలు చేయుడాన్ని కాల్ కవరింగ్ అని అంటారు. -
వెలుగులో ఐటీ రంగం
ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే సంచరించాయి. అయితే రోజు మొత్తంలో సెన్సెక్స్ 19,819-19,635 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 62 పాయింట్లు లాభపడి 19,804 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు బలపడి 5,850 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో సాఫ్ట్వేర్ షేర్లు వెలుగులో నిలిచాయి. వెరసి బీఎస్ఈలో ఐటీ రంగం అత్యధికంగా 2.1% పుంజుకుంది. మరోవైపు రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫెడ్ నిర్ణయాలు బుధవారం అర్థరాత్రి వెలువడనుండగా, శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. విప్రో హైజంప్ ఐటీ దిగ్గజాలలో విప్రో 5.5% జంప్‌చేయగా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ 4-2.5% మధ్య లాభపడ్డాయి. మిగిలిన దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్, సెసా గోవా, కోల్ ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్ 2-1% మధ్య పురోగమించాయి. మరోవైపు సన్ ఫార్మా 3.2% క్షీణించగా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ 2.3-1.2% మధ్య డీలాపడ్డాయి. ఈ బాటలో రియల్టీ షేర్లు ప్రెస్టీజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, శోభా, యూనిటెక్ 5.5-1.5% మధ్య నీరసించాయి. ఇక పసిడి రుణాలపై రిజర్వ్ బ్యాంక్ తాజా నిబంధనల కారణంగా ముత్తూట్ ఫైనాన్స్ 8% పతనంకాగా, మణప్పురం ఫైనాన్స్ 4% పడింది. ఎఫ్ఐఐలు రూ. 318 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 501 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. కాగా, ట్రేడైన షేర్లలో 1,093 లాభపడగా, 1,249 నష్టపోయాయి. -
ఆర్బీఐ, ఫెడ్ చర్యలే కీలకం..!
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లను అత్యంత ప్రభావితం చేయగల రెండు ప్రధాన ఈవెంట్లకు తెరలేవనుంది. కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తొలిసారి చేపట్టనున్న మధ్యంతర పాలసీ సమీక్ష ఒకవైపు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెర్నాంకీ నిర్వహించనున్న ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశం మరోైవె పు దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 17-18న సమావేశాలను నిర్వహిస్తుండగా, రిజర్వ్ బ్యాంక్ 20న పరపతి విధానాన్ని ప్రకటించనుంది. సహాయక ప్యాకేజీలలో భాగంగా బాండ్ల కొనుగోలు ద్వారా నెలకు 85 బిలియన్ డాలర్లను ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థలోకి పంప్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు బలపడుతుండటంతో బాండ్ల కొనుగోళ్లను తగ్గించే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. సహాయక ప్యాకేజీలలో కోత లేదా వీటిని నిలుపుదల చేస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా ప్రభావం అవుతాయని అత్యధిక శాతం నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది జరిగితే సమీపకాలంలో విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ద్వారా మార్కెట్లు బలహీనపడే అవకాశమున్నదని తెలిపారు. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి విలువ కూడా పతనమవుతుందని అంచనా వేశారు. కరెంట్ ఖాతా లోటు పెరగకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఉపయోగపడుతుంటాయని తెలిపారు. ఎఫెక్ట్ తక్కువే....: ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీలలో కోత పెడుతుందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లను ప్రభావితం చేశాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ఫెడ్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ అంచనాలకు సరిపోలితే ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశాలు తక్కువేనని చెప్పారు. ఈ ఏడాది మే 22న ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ సహాయక ప్యాకేజీల నిలిపివేతపై మాట్లాడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమైన విషయం విదితమే. ఇక ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ గ తంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఆర్థిక విశ్లేషకుడిగా పనిచేశారు. బాధ్యతలు చేపట్టడంతోనే ఆయన పాలసీ సమీక్ష తేదీని ఈ నెల 18 నుంచి 20కు మార్చారు. ఫెడ్ నిర్ణయాలు, మార్కెట్లపై వాటి ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేందుకే సమావేశాన్ని రెండు రోజులు వెనక్కు జరపడం విశేషం! అందరీ కళ్లూ రాజన్పైనే తొలిసారి పరపతి విధానాలను ప్రకటించనున్న రాజన్పైనే అందరి కళ్లూ నిలుస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఓపక్క పెట్టుబడులు, మరోవైపు వినియోగం మందగించిన నేపథ్యంలో ఆర్బీఐ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, ఏప్రిల్ 30 నుంచి రూపాయి 18% పతనమైంది. రూపాయికి బలాన్ని చేకూర్చే బాటలో ఆర్బీఐగతంలో కఠిన లిక్విడిటీ చర్యలను చేపట్టింది. కాగా, సోమవారం టోకు ధరల ఆధారిత ద్ర వ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. రూపాయి, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్లలో కోత విధించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంచనా వేశారు. రూపాయి విలువ ఆగస్ట్ 28న 68.85ను తాకినప్పటికీ, గడిచిన శుక్రవారానికి కొంత కోలుకుని 63.48 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల వెనకడుగు వరుసగా మూడో వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గత వారం సెన్సెక్స్ 463 పాయింట్లు పుంజుకుని 19,733 వద్ద నిలిచింది. ఇందుకు రాజన్ చర్యలు కొంత దోహదపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 20,000 పాయింట్ల సమీపంలోకి వచ్చినప్పటికీ ఆర్బీఐ, ఫెడ్ సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ పొజిషన్లు తీసుకునేందుకు వెనకాడుతున్నారని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం కనిపిస్తున్న అప్‌ట్రెండ్ కొనసాగాలంటే రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల అంశాలు జతకలవాల్సి ఉంటుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. భారీ ఒడిదుడుకులు తప్పవని, మార్కెట్లలో ఇప్పటికే కొంత గందరగోళం నెలకొందని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్జీ కె.రీటా వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న ఎఫ్ఐఐల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈ నెల తొలి రెండు వారాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్లో దాదాపు రూ. 6,000 కోట్లను (92.2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2-13 మధ్య ఈక్విటీలలో రూ. 6,372 కోట్లను (96.6 కోట్ల డాలర్లు) నికరంగా ఇన్వెస్ట్‌చేయగా, డెట్ సెక్యూరిటీల నుంచి మాత్రం రూ. 382 కోట్ల (38.4 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈక్విటీలలో ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు పెరగడం గమనార్హం. కాగా, ఆగస్ట్‌లో దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు నికరంగా రూ. 16,000 కోట్ల (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
స్వల్ప హెచ్చుతగ్గులు
ఇన్వెస్టర్లను ప్రభావితం చేయగల అంశాలేవీ లేకపోవడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు నత్తనడక నడిచాయి. అయితే రోజు మొత్తంలో స్వల్పశ్రేణిలో పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్టంగా 19,899ను, కనిష్టంగా 19,676 పాయింట్లను తాకింది. చివరికి 49 పాయింట్లు క్షీణించి 19,733 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ మాత్రం యథాతథంగా 5,851 వద్దే స్థిరపడింది. ఇందుకు గత రెండు వారాల్లో మార్కెట్లు 10% పుంజుకోవడం కూడా కారణంగా నిలుస్తోంది. ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్ జీడీపీ వృద్ధి అంచనాను 6.4% నుంచి 5.3%కు కుదించడం కూడా కొంతమేర సెంటిమెంట్‌ను బలహీనపరచింది. వచ్చే వారం ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఐటీ షేర్లు డీలా బీఎస్ఈలో రియల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా వినియోగ వస్తువులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 1.5-1% మధ్య క్షీణించాయి. దిగ్గజాలలో విప్రో అత్యధికంగా 3.6% పతనంకాగా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, భారతీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ 1.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు భెల్ 5.6% ఎగసింది. ఈ బాటలో కోల్ ఇండియా, ఎల్అండ్టీ, టాటా పవర్, హీరో మోటో, ఎంఅండ్ఎం 3-2% మధ్య పుంజుకున్నాయి. వెలుగులో చిన్న షేర్లు? మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6% బలపడ్డాయి. బీఎస్ఈ-500లో కోల్టేపాటిల్ 17% దూసుకెళ్లగా సింటెక్స్, ఫినోలె క్స్, పటేల్ ఇంజినీరింగ్, యూబీ హోల్డిం గ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, బాంబే డయింగ్, బిల్ట్, జేపీ పవర్, లవబుల్ లింగరీ తదితరాలు 11-7% మధ్య జంప్‌చేశాయి. ఎఫ్ఐఐలు రూ. 98 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 152 కోట్లు చొప్పున అమ్మకాలు జరిపాయి. -
నష్టాలు కొంత రికవరీ 333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
సిరియాపై సైనిక దాడి ఆందోళనలు ఉపశమించడంతోపాటు, దేశీయంగా రూపాయి బలపడటంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్‌పై పెరిగిన అంచనాలు సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిచ్చాయి. వెరసి సెన్సెక్స్ 333 పాయింట్లు ఎగసి 18,567 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 107 పాయింట్లు జంప్‌చేసి 5,448 వద్ద నిలిచింది. రుపీ పతనం, సిరియా ఆందోళన ల నేపథ్యంలో మంగళవారం సెన్సెక్స్ 651 పాయింట్లు పడిపోవటం తెలిసిందే. రియల్టీ పల్టీ... బీఎస్ఈలో రియల్టీ మినహా అన్ని రంగాలూ లాభపడగా... మెటల్, హెల్త్‌కేర్, ఆటో, ఐటీ, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 2% స్థాయిలో పురోగమించాయి. అయితే గృహ రుణాలను దశలవారీగా విడుదల చేయాలంటూ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు పెట్టడంతో రియల్టీ షేర్లు శోభా, పుర్వంకారా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ 6.5-1.5% మధ్య పతనమయ్యాయి. దీంతో రియల్టీ ఇండెక్స్ 0.5% తిరోగమించింది. కంపెనీ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆకుల, ఇన్వెస్టర్ సంస్థ సీక్వోయా క్యాపిటల్ కలిపి 24 లక్షల షేర్లను విక్రయించడంతో ఎస్కేఎస్ మైక్రో షేరు 6% దిగజారింది. ఒక్కటి మాత్రమే సెన్సెక్స్ షేర్లలో ఒక్క ఐటీసీ మాత్రమే అదికూడా నామమాత్రంగా నష్టపోయింది. మిగిలిన దిగ్గజాలలో భెల్ 6% దూసుకెళ్లగా, టాటా మోటార్స్, భారతీ, ఐసీఐసీఐ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో 4.7-2.7% మధ్య పుంజుకున్నాయి. మెటల్ షేర్లు హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ 4-2.7% మధ్య పురోగమించగా, ఆయిల్ దిగ్గజాలు ఆర్ఐఎల్, ఓఎన్జీసీ 2.3% చొప్పున లాభపడ్డాయి. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సైతం 3.2-2.4% చొప్పున పురోగమించాయి. సెంటిమెంట్‌ను పట్టిచూపుతూ ట్రేడైన షేర్లలో 1,364 లాభపడగా, 927 నష్టపోయాయి. ఎఫ్ఐఐలు రూ. 173 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 222 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.