భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
Published Mon, Feb 3 2014 4:12 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 304 పాయింట్ల నష్టంతో 20209 పాయింట్ల వద్ద, నిఫ్టీ 87 పాయింట్లతో 6001 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, బ్యాంకింగ్, ఆటో రంగాల కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో లుపిన్ అత్యధికంగా 4.52 శాతం, గెయిల్, డాక్టర్ లాబ్స్, సన్ ఫార్మా, సిప్లా కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. హిండాల్కో అత్యధికంగా 5.57 శాతం, జయప్రకాశ్ అసోసియేట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ కంపెనీల షేర్లు సుమారు 4 శాతం నష్టాలతో ముగిసాయి.
గ్లోబల్ మార్కెట్లలో ఎఫ్ టీఎస్ ఈ 20, కాక్ 29, డాక్స్ 67 పాయింట్ల నష్టాలతో కొనసాగుతున్నాయి. నిక్కి 295, హ్యాంగ్ సంగ్ 106 పాయింట్ల నష్టంతో ముగిసాయి.
Advertisement
Advertisement