భారీ లాభాల్లోకి సెన్సెక్స్
భారీ లాభాల్లోకి సెన్సెక్స్
Published Tue, Jun 17 2014 4:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
హైదరాబాద్: కనిష్టస్థాయిలో బ్లూచిప్ కంపెనీ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్ పుంజుకుని లాభాల్లో ముగియడంతో మదుపుదారులు ఊపిరి పీల్చుకున్నారు.
నష్టాలతో ఆరంభమైన సూచీలు ఓ దశలో 25104 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే ప్రధాన రంగ కంపెనీల షేర్లలో మదుపుదారులు కొనుగోళ్లు జరపడంతో ఇంట్రాడే ట్రేడింగ్ 25523 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 330 పాయింట్ల లాభంతో 25521 వద్ద, 98 పాయింట్ల వృద్దితో 7631 వద్ద ముగిసింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా ఓఎన్ జీసీ 4.26 శాతం, ఏషియన్ పెయింట్స్ 3.84, యాక్సీస్ బ్యాంక్ 3.75, పీఎన్ బీ 3.52, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.35 శాతం లాభపడ్డాయి. ఎంఅండ్ఎం, యునైటెడ్ స్పిరిట్స్, హీరో మోటార్ కార్ప్, హెచ్ యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలు స్వల్పంగా నష్టపోయాయి.
Advertisement