సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై
సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై
Published Mon, Dec 9 2013 4:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ ఘనవిజయం సాధించడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో పరుగులు పెట్టాయి.
2014 సాధారణ ఎన్నికలు మార్కెట్ కు మద్దతునందిస్తాయనే ఊహాగానాలతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హైని నమోదు చేసుకున్నాయి.
సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 21326 వద్ద, నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 6363 వద్ద ముగిసాయి. మార్కెట్లు భారీగా లాభపడటంతో 75 వేల కోట్ల మేరకు మదుపరుల సంపద వృద్ధిని సాధించింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్, సెసా స్టెర్ లైట్, ఐసీఐసీఐ బ్యాంకులు 5 శాతానికి పైగా, లార్సెన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
జిందాల్ స్టీల్ అత్యధికంగా 6 శాతం నష్టపోగా, సిప్లా, లుపిన్, కెయిర్న్ ఇండియా, టాటాస్టీల్ స్వల్ప నష్టాలతో ముగిసాయి.
Advertisement