సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 6.80శాతం వడ్డీని అందించనుంది. కొత్త రేట్లు నవంబర్ 25, 2022 నుండి అమలులోకి వచ్చాయి.
రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, 5 కోట్ల రూపాయల లోపు ఉండే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 - 6.50 శాతం మధ్య ఉంటుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.80శాతంగా ఉంటుంది. (WhatsApp డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి,స్పందించకండి!)
30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 6 శాతం రేటును ఇస్తోంది. అయితే 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు. (తగ్గేదెలే అంటున్న మస్క్, టెక్ దిగ్గజాలకే సవాల్!)
సీనియర్ సిటిజన్లకు అదనంగా 10 శాతం
అలాగే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్‌లకు స్పెషల్‌గా 10శాతం వడ్డీని తాత్కాలికంగా అందిస్తుంది. అయితే డిపాజిట్ మొత్తం తప్పనిసరిగా రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. డిపాజిట్ సమయం అయిదేళ్లకుపైన, 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ స్పెషల్ స్కీం ఏప్రిల్ 7, 2023 తో ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment