సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.15 శాతం వడ్డీ రేటును చెల్లించ నున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. డిపాజిట్ల రకాలు, వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లులో మార్పులుంటాయి. రూ.2 కోట్లకుపైన రూ.5 కోట్ల లోపు ఉండే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది.
(ఇదీ చదవండి: సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం)
ప్రస్తుతం 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ఐసీసీఐ. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 23 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (ఫిబ్రవరి 23 )నుంచే అమలులోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. రెండు నుంచి మూడేళ్ల బల్క్ డిపాజిట్లపై 7.00 శాతాన్ని అలాగే 290రోజుల నుంచి రెండేళ్ల వ్యవధిలోని డిపాజిట్లపై అత్యధికంగా 7.15 శాతం వడ్డీని అందిస్తుంది. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!)
సవరించిన బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
♦ 7 - 29 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4.75 శాతం
♦ 30 - 45 రోజులకు 5.50 శాతం
♦ 46 - 60 రోజులకు 5.75 శాతం
♦ 61 -90 రోజులకు 6.00 శాతం
♦ 91 -184 రోజులకు 6.50 శాతం
♦ 185 - 270 రోజులు 6.65 శాతం
♦ 3 నుంచి అయిదేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం
♦ 5 -10 సంవత్సరాల డిపాజిట్లపై 6.75 శాతం
కాగా ఇటీవల మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన సంగతివ తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేటును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment