( ఫైల్ ఫోటో )
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మరోసారి తన ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు వాహన, గృహ అన్ని రకాల రుణాలపై వర్తిస్తుంది . ఈ రేట్లు నేడు(సెప్టెంబర్ 1, 2022) నుంచే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. తాజా వడ్డీ రేట్ల సవరణలో రుణ గ్రహీతలపై ఈఎంపై భారం మరింత పెరగనుంది.
తాజాగాపెంచిన పెంపుతో ఓవర్‌నైట్ , ఒక నెల ఎంసీఎల్‌ఆర్ రేటును 7.65 శాతం నుండి 7.75 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల కాల పరిమితి రుణాలపై 7.80 శాతంగానూ, ఆరు నెలలకు 7.95 శాతంగా ఉండనుంది. ఇక వార్షికరుణాలపై ఎంసీఎల్‌ఆర్ రేటు 8 శాతంగా ఉంటుంది. గత నాలుగు నెలల్లో వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూన్, జూలై, ఆగస్టులలో రేట్లు సవరించింది. ఆగస్టులో, బ్యాంక్ తన రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
ఇది చదవండి: షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్
windfall profit tax: మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్
SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment