ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్లకుపైగా రూ.5 కోట్ల లోపు చేసే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2023 సెప్టెంబర్ 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చింది.
బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits) పై సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ వ్యక్తులకూ ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు కాల వ్యవధిలో ఉండే బల్క్ ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్‌లు, సాధారణ వ్యక్తులకూ ఒకే రకంగా ఉంటుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీలపై 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
ఇక 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాల వ్యవధిలో ఉండే డిపాజిట్లపై 6.75 శాతం లభిస్తుంది. 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపైనా ఇదే వడ్డీ రేటు ఉంటుంది. 185 రోజుల నుంచి 270 రోజుల వరకు టెన్యూర్ డిపాజిట్లపై 6.65 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అమలవుతుంది.
61 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్‌కు 6 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.75 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇక కనిష్టంగా 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్లపై 4.75 శాతం లభించనుంది.
సవరించిన వడ్డీ రేట్లు కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు రెన్యూవల్ చేసే ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకూ వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment