బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్‌డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్‌డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది.
ఎఫ్‌డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి.
సాధారణ పౌరులకు వడ్డీశాతం
- 7 నుండి 45 రోజులు - 3 శాతం
- 46 నుండి 180 రోజులు - 4.50 శాతం
- 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం
- 1 సంవత్సరం - 6.50 శాతం
- 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం
- 500 రోజులు - 8 శాతం
- 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం
- 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం
- 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం
- 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7 శాతం
సీనియర్ సిటిజన్లకు..
- 7 నుండి 45 రోజులు - 3.50 శాతం
- 46 నుండి 180 రోజులు - 5 శాతం
- 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం
- 1 సంవత్సరం - 7 శాతం
- 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం
- 500 రోజులు - 8.50 శాతం
- 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం
- 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం
- 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం
- 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం
Comments
Please login to add a commentAdd a comment