Punjab National Bank (PNB) Hikes Fixed Deposit Interest Rates By Up To 75 Basis Point - Sakshi
Sakshi News home page

PNB ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌: భారీ పెంపు

Published Thu, Oct 27 2022 9:59 AM | Last Updated on Thu, Oct 27 2022 11:21 AM

Punjab National Bank hikesFD rates by up to 75 bps - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) వడ్డీ రేట్లను  పెంచింది.   పీఎన్‌బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్‌డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం ఎఫ్‌డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్‌డీలపై  0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్‌ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్‌ 26 నుంచే అమల్లోకి వచ్చాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement