
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) వృద్ధుల కోసం అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన ఎవరైనా కానీ 600 రోజుల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.85 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది.
అక్టోబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక వృద్ధులు కాకుండా ఇతరులకు 600 రోజుల డిపాజిట్‌పై (ఎప్పుడైనా ఉపసంహరించుకోతగిన) 7 శాతం వడ్డీ రేటు, కాలవ్యవధి వరకు ఉపసంహరణకు వీల్లేని 600 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం వడ్డీని ఇస్తున్నట్టు పీఎన్‌బీ తెలిపింది.