కోయంబత్తూరులో భారతి సిమెంట్‌ టెర్మినల్‌ | Bharathi Cement to launches packaging terminal at Coimbatore | Sakshi
Sakshi News home page

కోయంబత్తూరులో భారతి సిమెంట్‌ టెర్మినల్‌

Published Tue, Oct 11 2022 4:17 AM | Last Updated on Tue, Oct 11 2022 4:17 AM

Bharathi Cement to launches packaging terminal at Coimbatore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంట్‌ తయారీ సంస్థ భారతీ సిమెంట్‌.. తమిళనాడులోని కోయంబత్తూరులో 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో అత్యాధునిక బల్క్‌ సిమెంట్‌ టెర్మినల్‌ను ఏర్పాటు చేసింది. కడప ప్లాంటు నుంచి ఈ కేంద్రానికి బల్క్‌ సిమెంట్‌ సరఫరా అవుతుంది.

ఇక్కడ ప్యాకింగ్‌ చేసి సిమెంట్‌ పంపిణీ చేస్తారు. వికా గ్రూప్‌ చైర్మన్, సీఈవో గీ సీడో, వికా ఇండియా సీఈవో అనూప్‌ కుమార్‌ సక్సేనా, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎం.రవీందర్‌ రెడ్డి ఈ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ మార్కెట్ల కోసం క్విక్‌సెమ్‌ పేరుతో తదుపరి తరం పర్యావరణ అనుకూల ప్రీమియం సిమెంట్‌ను విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement