Bharti cement
-
కోయంబత్తూరులో భారతి సిమెంట్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీ సంస్థ భారతీ సిమెంట్.. తమిళనాడులోని కోయంబత్తూరులో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అత్యాధునిక బల్క్ సిమెంట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసింది. కడప ప్లాంటు నుంచి ఈ కేంద్రానికి బల్క్ సిమెంట్ సరఫరా అవుతుంది. ఇక్కడ ప్యాకింగ్ చేసి సిమెంట్ పంపిణీ చేస్తారు. వికా గ్రూప్ చైర్మన్, సీఈవో గీ సీడో, వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి ఈ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ మార్కెట్ల కోసం క్విక్సెమ్ పేరుతో తదుపరి తరం పర్యావరణ అనుకూల ప్రీమియం సిమెంట్‌ను విడుదల చేశారు. -
రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. భారత్‌లో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రా రంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొం దించిన 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్ కంటైనర్స్‌ను కంపెనీ వినియోగించింది. వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్ సిమెంట్‌తో కూడిన రైలు శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ఈ విధానంలో సిమెంట్ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్ టెర్మినల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యాయం.. రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని సక్సేనా తెలిపారు. ‘కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించే వీలు అవుతుంది. భారతి సిమెంట్ మొదటిసారిగా స్వీకరించిన ఈ మోడల్ దేశంలో సిమెంట్ రవాణాలో విప్తవాత్మక మార్పులతోపాటు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని వివరించారు. ఎర్రగుంట్ల ప్లాంటు నుంచి తొలి రైలును జెండా ఊపి సక్సేనా ప్రారంభించారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ డైరెక్టర్లు ఎం.రవీందర్ రెడ్డి, జి.బాలాజీ, జె.జె.రెడ్డి, హరీష్ కామర్తి, ఎరిక్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, కాంకర్ ఈడీ శేషగిరి రావు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్ మెంబర్ ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్ సంజయ్ మహంతి, కాంకర్ ఎండీ వి.కళ్యాణ రామ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాలుపంచుకున్నారు. వేగంగా సిమెంట్ రవాణా .. ప్రత్యేక కంటైనర్లలో బల్క్ సిమెంట్ రవాణా వల్ల తయారీ కంపెనీలతోపాటు తమ సంస్థకు మేలు చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు వేగంగా సిమెంట్ రవాణా సాధ్యపడుతుందని అన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గుణదల (విజయవాడ తూర్పు)/తిరుపతి రూరల్, విశాఖ స్పోర్ట్స్: కాలుష్యం నుంచి పుడమిని కాపాడుకోవాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణకు భారతి సిమెంట్, సాక్షి మీడియా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, మంచి వాతావరణాన్ని అందించే దిశగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా నడుచుకోవాలని వక్తలు అభిలషించారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పర్యావరణ పరిరక్షణపై అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై సాక్షి మీడియా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. రాబోవు తరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్, సాక్షి మీడియా ప్రతినిధులు విశ్వనాథరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్, మధు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో భారీ ర్యాలీ.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వైఎస్సార్ క్రీడా మైదానం వరకు వందలాది మంది యువకులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్వీ డిఫెన్స్ అకాడమీ అధినేత డాక్టర్ శేషారెడ్డి, డెమొక్రటిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌపాటి ప్రకా‹Ùబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘సాక్షి’ చైర్ పర్సన్ వైఎస్ భారతిరెడ్డి స్ఫూర్తితో తుడా పరిధిలోని ప్రతి ఇంటికీ పండ్లు, కాయలు, నీడనిచ్చే చెట్లు 10 లక్షలకు పైగా పంపిణీ చేసినట్లు తెలిపారు. విశాఖ సాగరతీరంలో వాక్‌థాన్ విశాఖలో ‘పుడమి సాక్షిగా’ వాక్‌థాన్‌ను సాగరతీరంలోని కాళీమాత ఆలయం వద్ద నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, విశాఖ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్. కాళిదాసు వెంకటరంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. మంచి పర్యావరణంతో కూడిన భూమి మాత్రమే మనకున్న గొప్ప ఆస్తి అని, ఈ ఆస్తిపట్ల అవగాహన కలిగివుండి ‘సాక్షి’ చేసిన ఈ ప్రయత్నం మరింతగా కొనసాగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాంతీయ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రమో«ద్‌రెడ్డి, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, సినీనటుడు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్
నెల్లూరు(సెంట్రల్): నమ్మకానికి మారుపేరుగా ఉన్న భారతి సిమెంట్ అభివృద్ధికి డీలర్స్ ఎంతో సహాయపడ్డారని మార్కెటింగ్ వైస్ చైర్మన్ సీహెచ్ మాల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో భారతి సిమెంట్ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్ఫ్రూప్ ప్యాకింగ్, జర్మన్ టెక్నాలజీ వంటి వాటితో భారతి సిమెంట్ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందన్నారు. ఇటీవలే ఆవిష్కరించిన నూతన ప్రొడక్ట్ భారతీ అల్ట్రా ఫాస్ట్ చాలా వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. ఎక్కువ బలం, ధృడమైన ఇళ్ల నిర్మాణానికి ఈ సిమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ చీఫ్ మేనేజర్ సీ ఓబుల్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ ఛాయపతి, మార్కెటింగ్ మేనేజర్స్ విజయవర్దన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ కృపరాజు, డీలర్స్పాల్గొన్నారు. -
మహానేత కుటుంబంపై విషం చిమ్ముతున్న ఏబీఎన్, టీడీపీ
అంబాజీపేట: భారతి సిమెంట్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా జరిగినట్లు చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ఏబీఎన్‌లు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై విషం చిమ్ముతున్నారని పలువురు యువకులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తునిలో జరుగుతున్న పాదయాత్రలో పలువురు యువకులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని వైఎస్ భారతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీబీఐ చార్జిషీట్లో భారతిపై ఎలాంటి ఆరోపణలు చేయకపోయినా ఆమె నిందితురాలంటూ ఆరోపణలు చేయడం ఎల్లో మీడియాకు తగదన్నారు. భారతికి ఎటువంటి సమాచారం రాకుండా ఎల్లో మీడియాకు నేరుగా రావడం అంటే టీడీపీ, ఈడీలు విషపూరిత రాజకీయాలు చేస్తున్నారనే విషయం అందరికీ అర్ధమవుతుందన్నారు. తిరుగులేని ప్రజాదారణ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు నీచ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎటువంటి ఆధారలు లేకుండా ఇంటి ఆడపడుచును అవమాన పరచడం దారుణమన్నారు. అసత్య వార్తలను ప్రచురించే ఎల్లో మీడియా పత్రికలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి భారతి సిమెంట్
మేడిపల్లి: నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తున్నట్లు భారతి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.సి.మల్లారెడ్డి చెప్పారు. ఉప్పల్ పరిధిలోని బిల్డర్లతో మంగళవారం రాత్రి మేడిపల్లి ఎస్వీఎం గ్రాండ్ హెటల్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో సహా, కొచ్చిన్, చెన్నై, బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు 5లక్షల మెట్రిక్‌టన్నుల సిమెంట్ సరఫరా చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢసంకల్పానికి మద్దతుగా నాణ్యమైన సిమెంట్‌ను అందించి తమవంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. భారతి సిమెంట్ తెలంగాణలోని అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నట్లు సీజీఎం కొండల్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూంల నిర్మాణాలకు కూడా భారతి సిమెంట్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ సెక్రటరీ వెంకటరెడ్డి, సీనియర్ టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్‌రాజు, టెక్నికల్ మేనేజర్ నరేష్కుమార్ పాల్గొన్నారు. -
సిమెంటు ఖర్చు అడుగుకు 150?
► రూ.5000 వసూలు చేస్తున్నారేం? ► రియల్టర్లకు సిమెంటు సంస్థల ప్రశ్న ► బస్తాకు 330–350 ఉంటేనే నిలదొక్కుకుంటాం ► కనీసం 10 శాతం రిటర్నులూ లేవు ► సిమెంటు కంపెనీల ప్రతినిధుల వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో సిమెంటుకయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు రూ.150–175 మాత్రమేనని, కానీ నిర్మాణ సంస్థలు ఫ్లాట్‌కు ఒక చదరపు అడుగుకు రూ.5,000 పైన వసూలు చేస్తున్నాయని సిమెంటు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. నిర్మాణానికి అంత ఖర్చు ఎందుకవుతోందో ఈ సంస్థలు చెప్పాలని వారు ప్రశ్నించారు. ‘‘ఒక చదరపు అడుగుకు 25 కిలోల సిమెంటు కావాలి. బస్తాకు రూ.50 అధికమైనా, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.25 మాత్రమే పెరగాలి కదా?’’ అని ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్ వ్యాఖ్యానించారు. సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. 2015తో పోలిస్తే తెలంగా ణ, ఏపీలో ఇప్పుడున్న సిమెంటు ధర తక్కువని చెప్పారాయన. అయిదేళ్లుగా సిమెంటు ధరల పెరుగుదల ఏటా 1% మాత్రమేనని, అదే రియల్టీ ధరల పెరుగుదల ఏటా 10% ఉందని తెలిపారు. అమ్ముడుపోకుండా పెద్ద సంఖ్యలో గృహాలు ఉన్నా, ధర మాత్రం తగ్గడం లేదని గుర్తుచేశారు. మార్కెట్ ఆధారంగానే ధర.. ‘‘గతేడాది పెట్ కోక్ ధర టన్నుకు 45 డాలర్లుంటే, ఇప్పుడు 100 డాలర్లు దాటింది. రవాణా వ్యయం బస్తాకు రూ.50 అవుతోంది. సిమెంటుపై 27% పన్నులున్నాయి. మార్కెట్ ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతోంది. పరిశ్రమపైన రూ.50,000 కోట్ల అప్పులున్నాయి. కంపెనీలపై వడ్డీల భారం ఉంది. సిమెంటు ధర పెరగడానికి గల కారణాలను చూడకుండా సిమెంటు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా సిమెంటు ధర రూ.270–330 ఉంది. కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడి మార్కెట్లో ధర రూ.330–350 ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయి’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సిమెంటుపై తక్కువ పన్నుంటుందని ప్రజలు, కంపెనీలు ఆశించినా, జీఎస్టీలో 28% శ్లాబులో చేర్చి ప్రభుత్వం నిరుత్సాహపరిచిందని అన్నారు. భారంగా ఉత్పత్తి సామర్థ్యం..: దేశంలో 1989కి ముందు 10 సిమెంటు కంపెనీలే ఉండేవి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.9 కోట్ల టన్నులు. ఇప్పుడు కంపెనీల సంఖ్య 70కిపైమాటే. సామర్థ్యం 42 కోట్ల టన్నులకు ఎగసింది. దక్షిణాదిన 50 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 150 మిలియన్ టన్నులు. ప్లాంట్ల వినియోగం దేశవ్యాప్తంగా 70% ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 60% లోపేనని రవీందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పడిపోయి సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, అధిక తయారీ వ్యయాలు కంపెనీలకు సమస్యగా మారిందని, పెట్టుబడిమీద రాబడి 10%లోపే ఉంటోందని కంపెనీల ప్రతినిధులు వాపోయారు. తెలుగు రాష్ట్రాలు బెటర్.. ‘‘సంయుక్త రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకు 24 లక్షల టన్నుల సిమెంటు అమ్మకాలు నమోదయ్యాయి. 2015–16లో ఇది 12–14 లక్షల టన్నులకు చేరింది. ఏడాదిగా తమిళనాడులో సిమెంటు విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. సిమెంటు వినియోగంలో వచ్చే మూడేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10–18 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’’ అని శ్రీకాంత్ తెలిపారు. తమిళనాడు స్థిరంగా, కర్ణాటకలో 2–5 శాతం వృద్ధి ఉండొచ్చని చెప్పారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు 5–7 శాతం అధికం అవుతాయని అంచనా వేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, వైట్ ట్యాపింగ్ రోడ్లు, అందుబాటు గృహాల నిర్మాణం వేగిరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు తక్కువ ధరకు సిమెంటును సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
భారతీ సిమెంట్ కి ‘అత్యంత ఆశావహ బ్రాండ్’ అవార్డు
బ్యాంకాక్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి భారత దౌత్య ప్రతినిధి అశిష్ పాథి చేతుల మీదుగా ‘ఆసియా ప్రాంతపు అత్యంత ఆశావహ బ్రాండ్’ అవార్డును అందుకుంటున్న భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డెరైక్టర్ ఎం.రవీందర్ రెడ్డి. -
అగ్రగామిగా భారతీ సిమెంట్
ఒంగోలు: బిజినెస్ చానల్ పార్టనర్స్ సహకారం వల్లే భారతీ సిమెంట్ నేడు మార్కెట్లో అగ్రగామిగా నిలిచిందని భారతీ సిమెంట్ సీనియర్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. ఒంగోలు సెంట్రల్‌పార్కు కాన్ఫరెన్స్‌హాలులో బుధవారం నిర్వహించిన బిజినెస్ చానల్ పార్టనర్స్ మీట్లో వందమందికిపైగా ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత భారతీ సిమెంట్ విశిష్టత, మార్కెటింగ్ తదితర అంశాలతో రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మన్నిక, నాణ్యత, ధృఢత్వంతోపాటు కాలానుగుణంగా వస్తున్న మార్పులను తట్టుకునేలా భారతీ సిమెంట్‌ను తయారు చేస్తారని చెప్పారు. ఇందువల్లే 2009లో ప్రారంభించిన భారతీ సిమెంట్ నేడు పూర్తిస్థాయి మార్కెట్ ఆధిపత్యాన్ని చాటుకోవడంతోపాటు అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. ఏడాదికి 5 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని కడప ప్లాంటులో తయారుస్తారన్నారు. కర్నాటక జిల్లా గుల్బర్గాలో కూడా 2.75 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని భారతీ బ్రాండ్‌తోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వికాట్ గ్రూపు భారతీ సిమెంట్‌ను భాగస్వామిగా ఎంచుకోవడంలోనే దాని గొప్పతనం ఏమిటో అందరికీ అర్థమవుతుందన్నారు. నిర్మాణరంగంలో భారతీ సిమెంట్ వినియోగంలో మెళకువలు నేర్పించడం ద్వారా తాపీ మేస్త్రీల నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. తాపీ మేస్త్రీలకు ఉచిత ప్రమాద బీమా కూడా తమ సంస్థ కల్పిస్తోందన్నారు.