కలెక్షన్లు, కనెక్షన్లపై దృష్టి సారించండి
Published Wed, Oct 19 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
అనంతపురం అగ్రికల్చర్ : వంద శాతం విద్యుత్ బిల్లుల వసూళ్లు (కలెక్షన్లు), పెండింగ్‌లో ఉన్న వాటికి కనెక్షన్లు ఇవ్వడంపై అధికారులు దృష్టి సారించాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) హెచ్‌వై దొర ఆదేశించారు. మంగళవారం స్థానిక విద్యుత్‌శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పుల్లారెడ్డి, జోనల్ చీఫ్ ఇంజనీరు పీరయ్య, జిల్లా ఎస్‌ఈ ఆర్‌ఎన్ ప్రసాదరెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) విజయభాస్కర్‌తో కలిసి విద్యుత్‌శాఖకు సంబంధించి అన్ని అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ... మిగతా జిల్లాల కన్నా రెవెన్యూ వసూళ్లలో వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని నెలవారీ వసూళ్లు వంద శాతం సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే ఇతర జిల్లాలలో పోల్చితే ఇక్కడ అక్రమ విద్యుత్ వాడకం కూడా ఎక్కువగా ఉందన్నారు. విద్యుత్ చౌర్యాన్ని (లైన్‌లాస్) గణనీయంగా తగ్గించాలన్నారు. ఇంటింటా మీటర్ ఉండేలా మీటర్స్ సేల్స్ పెంచాలని ఆదేశించారు. రూ.125 కే విద్యుత్ కనెక్షను పథకాన్ని గ్రామీణప్రాంత ప్రజలు అందులోనూ పేద వర్గాలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ వాడకందారుపలై కొరడా ఝులిపించి అపరాధ రుసుం, అవసరమైతే కేసులు నమోదు చేయాలని సూచించారు.
Advertisement
Advertisement