అరండల్‌పేట : నగరపపాలక సంస్థను అవినీతి జాఢ్యం వదలడంలేదు. కుళారుు కనెక్షన్ల విషయంలోనూ దిగువస్థారుు అధికారులు తమ నైజాన్ని చాటుకున్నారు. నగరంలో 1.54 అసెస్‌మెంట్లు ఉంటే కేవలం 80వేల కుళాయి కనెక్షన్లు మాత్రమే అధికారికంగా ఉన్నాయి. మిగిలినవి అనధికారమే. నగరంలో కుళాయి కనెక్షన్లపై ఉన్నతాధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. నగరపాలకసంస్థకు నీటి మీటర్ల ద్వారా ఏడాదికి రూ. 5 కోట్ల వరకు పన్నుల రూపంలో వస్తున్నాయి. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలోని అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు నీటి మీటర్లను బిగించాల్సి ఉంటుంది. చాలా వరకు అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు నీటిమీటర్లు బిగించకుండానే నీటిని వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో మీటర్ల ద్వారా చార్జీల వసూళ్లను సైతం ఫిట్టర్లు పట్టించుకోవడం లేదు. కనీసం వారికి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల నీటి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు నీటిమీటర్ల మీద సుమారు రూ. 10 కోట్ల వరకు బకాయిలున్నాయంటే నిర్లక్ష్యం ఎంతలా ఉందో స్పష్టమవుతోంది.
నగరంలో స్కాడాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నీటి పన్నును పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రతి డివిజన్‌లో ఉన్న అక్రమ కనెక్షన్లను అధికారులు సర్వే బృందాలతో గుర్తించారు. త్వరలో వారికి నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో పాటు ఆస్తిపన్ను, వాణిజ్య సముదాయాలకు, షాపులకు నీటి చార్జీలను పెంచాలని యోచిస్తున్నారు. నగరాానికి సంబంధించి మొత్తం 81,841 తాగు నీటి కనెక్షన్లు ఉండగా ఇందులో కేవలం ఓవైటీ కింద 120, యూఏటీ కింద 732 అంటే మొత్తం 852 కనెక్షన్లలకు మాత్రమే మీటర్‌లను బిగించారు. మిగిలిన 80989 సర్వీసులకు మీటర్లు బిగించకుండా కార్పొరేషన్ అధికారులు నీటి పన్ను వసూలు చేస్తున్నారు.
క్రేజీపై ఎందుకో వాత్సల్యం?
నగరపాలకసంస్థ పరిధిలోని మానససరోవరం పార్కులోని క్రేజీవరల్డ్‌ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఇందులోని స్మిమ్మింగ్‌ఫూల్, ఇతర అవసరాలకు తక్కెళ్లపాడు మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి పైపులైన్ ఏర్పాటు చేశారు. ఈ పైపులైన్ ద్వారా రోజూ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు నీటిని క్రేజీ వరల్డ్‌కు సరఫరా చేస్తున్నారు.
కొన్నేళ్లుగా ఈ పైపులైన్‌కు నీటి మీటరును బిగించకపోవడంతో పైసా కూడా కార్పొరేషన్‌కు చెల్లించకుండానే నీటిని యధేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు అంత దానిపై అవ్యాజమైన ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడంలేదు. రోజుకు గంటకు మించి జనానికి నీరు విడుదల చేయని అధికారులు దానికి మాత్రం నాలుగు గంటలపాటు విడిచిపెట్టడం గమనార్హం.
అక్రమాలకు అడ్డా...
Published Fri, Feb 6 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement