షియోమి ఎంఐ6 వచ్చేస్తోంది..
షియోమి ఎంఐ6 వచ్చేస్తోంది..
Published Thu, Apr 13 2017 9:03 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
షియోమి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న తన లేటెస్ట్ ఫ్లాగ్ ఫిప్ ఫోన్ ఎంఐ6 లాంచింగ్ తేదీలను ప్రకటించింది. తమ 2017 ఫ్లాగ్ షిప్ ఎంఐ6ను ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. బీజింగ్ లో జరుగబోయే ఈవెంట్లో దీన్ని లాంచ్ చేస్తామని షియోమి గ్లోబల్ ఫేస్ బుక్ గ్లోబల్ పేజీలో తెలిపింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎన్నో ఫ్లాగ్ షిప్ ఫోన్లకు ఇది కిల్లర్ గా రాబోతుందట. ఇప్పటికే సంచలనాలతో మార్కెట్లో దూసుకెళ్తున్న షియోమి, అదిరిపోయే ఫీచర్లతో దీన్ని లాంచ్ చేస్తుందని టెక్ వర్గాలంటున్నాయి.
5.1 అంగుళాల 1080పీ డిస్ ప్లే, 4కే వీడియోలను షూట్ చేసుకునే వీలుగా 12 ఎంపీ రియర్ కెమెరా, 4కే వీడియోలను రికార్డు చేసుకునేందుకు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది స్మార్ట్ ఫోన్ వినియోగదారులను అలరించనుందట. స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ ఆప్షన్స్, 64జీబీ/128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ దీనిలో మిగతా ఫీచర్లని తెలుస్తోంది. ఎంఐ 6 మోడల్ ధర 2,199 యన్స్(సుమారు రూ.20వేలు) ఉండొచ్చని తెలుస్తోంది.
Advertisement
Advertisement