షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్.. ఏంటది?
షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్.. ఏంటది?
Published Mon, Mar 6 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా ఫుల్ ఫేమస్ అయిన చెనీస్ దిగ్గజం షియోమి ఇప్పటికే మి స్మార్ట్ స్కేల్, మి స్మార్ట్ కెమెరా, మి స్కూలర్ వంటి పలు ప్రొడక్ట్ లను మార్కెట్లోకి పరిచయం చేసింది. ప్రస్తుతం మరో కొత్త ప్రొడక్ట్ తో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. షియోమి ఈ వారంలోనే ఓ కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందని, అది కాఫీ మిషిన్ అని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ మిషన్ ను యూజర్లు స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా ఆపరేట్ చేసుకునే విధంగా కంపెనీ రూపొందించిందని రిపోర్టులు చెబుతున్నాయి.
మార్చి 7న దీన్ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. షియోమి తన ప్రొడక్ట్ రేంజ్ ను విస్తరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, పెన్స్ దగ్గర్నుంచి స్మార్ట్ కుకర్స్ వరకు షియోమి ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ బ్రాండులో అత్యంత ప్రాచుర్యం పొందిన షియోమి తర్వాతి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమి మి6.
Advertisement
Advertisement