వాలెంటైన్స్ డే స్పెషల్గా షియోమి కొత్త ఫోన్
వాలెంటైన్స్ డే స్పెషల్గా షియోమి కొత్త ఫోన్
Published Mon, Feb 6 2017 6:53 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
వాలెంటైన్స్ డే రోజు జీవిత భాగస్వామికి స్పెషల్గా ఏం ఇవ్వాలా అని తెగ ప్లాన్స్ వేస్తుంటారు. అయితే ఈ సారి స్పెషల్ స్మార్ట్ఫోనే ఎందుకు కాకూడదు. ఇదే ఆలోచనతో చైనీస్ హ్యాండ్సెట్ దిగ్గజం షియోమి వినియోగదారుల ముందుకు రాబోతుంది. రెడ్మి నోట్4తో భారత్, చైనాలో సంచలన స్థాయిలో విక్రయాలు రికార్డు చేసిన షియోమి వాలెంటైన్స్ డేకి ఓ కొత్త ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్ మి నోట్4 సిరీస్లో రెడ్ మి నోట్ 4ఎక్స్ పేరుతో ఈ ఫోన్ను తీసుకొస్తోంది. రిపోర్టుల ప్రకారం, సైట్ వైబో లాగా చైనీస్ ట్విట్టర్లో షియోమికున్న అధికార పేజీలో ఈ విషయాన్ని వెల్లడించిందట.
వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న చైనాలో తమ అప్కమింగ్ రెడ్ మి నోట్ 4ఎక్స్ లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. ఈసారి కంపెనీ లవ్ సీజన్లో తమ విక్రయాలను మరింత పెంచుకునేందుకు ప్లాన్ వేసిందని రిపోర్టులు పేర్కొన్నాయి. భాగస్వామికి ప్రేమతో గిఫ్ట్గా స్మార్ట్ఫోన్ ఇవ్వడం ఓ మంచి ఆలోచనని అంటున్నాయి. రెడ్మి నోట్4 సిరీస్లో రాబోతున్న తర్వాతి డివైజ్ రెడ్మి నోట్ 4ఎక్స్ అని టీజర్ ధృవీకరిస్తోంది. కానీ డివైజ్ రిఫరెన్స్ ఇమేజ్ను కంపెనీ చూపించలేదు.
ముందస్తు లీక్స్ ప్రకారం వాలెంటైన్స్ కానుకగా రాబోతున్న రెడ్మి నోట్ 4ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి...
5.5 అంగుళాల ఫుల్-హెచ్డి డిస్ప్లే
2 గిగాహెడ్జ్ డెకా-కోర్ సీపీయూ
మీడియా టెక్ హీలియో ఎక్స్20 లేదా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
16జీబీ, 32జీబీ, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వేరియంట్లు
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
వెనుక వైపు ఫింగర్ప్రింట్ సెన్సార్
Advertisement
Advertisement