
రెడ్మి నోట్4 సంచలన విజయంతో ఓ ఊపుమీదున్న చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి మరో కొత్త ఫోన్తో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రెడ్మి నోట్ 4ఎక్స్ పేరుతో ఓ కొత్త స్మార్ట్ఫోన్ను చైనీస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఛాంపైన్ గోల్డ్, చెర్రి పౌడవర్, ప్లాటినం సిల్వర్ గ్రే, మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని తీసుకొచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హ్యాట్సూన్ గ్రీన్ రంగులో రెడ్ మి నోట్ 4 ఎక్స్ స్పెషల్ వేరియంట్ను అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతమైతే, రెడ్మి నోట్ 4ఎక్స్ హ్యాట్ సూన్ గ్రీన్ కలర్ వేరియంట్ పరిమితంగా అందుబాటులో ఉండనుంది. దాని ధర, ప్రత్యేకతలు వాలెంటైన్స్ డేనే ప్రకటించనుంది. మిగతా వేరియంట్ల ధర, ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో కంపెనీ తెలుపలేదు. ప్రస్తుతం కొన్ని ప్రత్యేకతలను మాత్రమే కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది.