Xiaomi Mi 6
-
సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి ఏదైనా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందంటే చాలు. ఆన్ లైన్ వినియోగదారులందరూ ఎప్పుడెప్పుడు కొంద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ కంపెనీ ఫోన్లు ఫ్లాష్ సేల్ కు వచ్చిన సెకన్లలో అమ్ముడుపోతున్నాయి. ఇదే తరహాలో ఇటీవలే అదిరిపోయే ఫీచర్లతో చైనా మార్కెట్లోకి వచ్చిన ఎంఐ 6 ఫ్లాగ్ షిప్ కు అనూహ్య స్పందన వచ్చింది. నిన్న చైనాలో ఈ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు వచ్చింది. ఫ్లాష్ సేల్ కు వచ్చిన వెంటనే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. సెకన్లలోనే స్టాకంతా అమ్ముడుపోయినట్టు కంపెనీ ప్రకటించింది. ఎంఐ 6 తర్వాతి ఫ్లాష్ సేల్ మే 5న కంపెనీ నిర్వహించనుంది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రిపోర్టులైతే, ఎంఐ6ను భారత్ లో లాంచ్ చేయడం లేదని చెబుతున్నాయి. కంపెనీ సైతం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2.45గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64/128జీబీ స్టోరేజ్, డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా, ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు వైపులు కర్వ్డ్ గ్లాస్/ సెరామిక్ బాడీ, 3,350ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్ ధర సుమారు రూ.23,999గా ఉంది. -
ఎంఐ 6 వచ్చేసింది..ఫీచర్స్
బీజింగ్: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. బీజింగ్ లో బుధవారం ఈ డివైస్‌ను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఈ ఎంఐ 6 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.23,500గా కంపెనీ ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫోర్ సైడెడ్ క్వర్డ్ 3 డీ గ్లాసెస్‌తో బ్లూ వేరియంట్‌తోపాటు సిల్వర్ ఎడిషన్‌లో కూడా లాంచ్ చేసింది. రెండు కెమెరాలను వెనుక భాగంలోను, ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ముందుభాగంలోనూ అమర్చింది. స్ప్లాష్ రెసిస్టెంట్ గా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త డివైస్‌లో ప్రపంచంలో అతి చిన్న 10 ఎన్ఎం ప్రాసెసర్ అమర్చినట్టు తెలిపింది. ఎంఐ 6 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లౌ 5.15 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే క్వాల్కం లేటెస్ట్ ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ డ్యుయల్ కెమెరా, డ్యుయల్ స్పీకర్స్ 3350 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా డిస్ప్లే విత్ ఐ కేర్ అని షియామి చెబుతున్న తాజా స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ 8, ఐ ఫోన్ 7లకు గట్టి పోటీలే ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. -
షియోమి ఎంఐ6 వచ్చేస్తోంది..
షియోమి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న తన లేటెస్ట్ ఫ్లాగ్ ఫిప్ ఫోన్ ఎంఐ6 లాంచింగ్ తేదీలను ప్రకటించింది. తమ 2017 ఫ్లాగ్ షిప్ ఎంఐ6ను ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. బీజింగ్ లో జరుగబోయే ఈవెంట్లో దీన్ని లాంచ్ చేస్తామని షియోమి గ్లోబల్ ఫేస్ బుక్ గ్లోబల్ పేజీలో తెలిపింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎన్నో ఫ్లాగ్ షిప్ ఫోన్లకు ఇది కిల్లర్ గా రాబోతుందట. ఇప్పటికే సంచలనాలతో మార్కెట్లో దూసుకెళ్తున్న షియోమి, అదిరిపోయే ఫీచర్లతో దీన్ని లాంచ్ చేస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. 5.1 అంగుళాల 1080పీ డిస్ ప్లే, 4కే వీడియోలను షూట్ చేసుకునే వీలుగా 12 ఎంపీ రియర్ కెమెరా, 4కే వీడియోలను రికార్డు చేసుకునేందుకు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది స్మార్ట్ ఫోన్ వినియోగదారులను అలరించనుందట. స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ ఆప్షన్స్, 64జీబీ/128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ దీనిలో మిగతా ఫీచర్లని తెలుస్తోంది. ఎంఐ 6 మోడల్ ధర 2,199 యన్స్(సుమారు రూ.20వేలు) ఉండొచ్చని తెలుస్తోంది. -
ఎంఐ 6 లాంచింగ్ ఎప్పుడో చెప్పేసిన సీఈవో
చైనీస్ టెక్ దిగ్గజం షియోమి కొత్తగా మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఎంఐ6 స్మార్ట్ ఫోన్ కోసం ఇంకా ఎన్నో రోజులు వేచిచూడాల్సిన అవసరం లేదట. ఈ నెలల్లోనే ఎంఐ6ను లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ సీఈవో లీ జూన్ తెలిపారు. ఏప్రిల్ 11 లేదా 18వ తేదీల్లో ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేయనున్నట్టు ఆ దేశీయ టెక్ వెబ్ సైట్ మైడ్రైవర్స్ రిపోర్టు చేసింది. రెండు స్క్రీన్ సైజుల్లో అంటే 5.15 అంగుళాలు, 5.18 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేలతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారని కూడా మైడ్రైవర్స్ పేర్కొంది. ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల లైనప్‌లో ఈ ఎంఐ 6 వస్తుందట. ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ ను కలిగి ఉటుందని తెలుస్తోంది. ముందస్తు లీకేజీల ప్రకారం 4జీబీ, 6జీబీ వేరియంట్లను వివిధ మెమరీ ఆప్షన్లలో షియోమి లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. పెద్ద సైజు ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 64జీబీ, 128జీబీ, 256జీబీ మెమరీ ఆప్షన్లుంటాయని లీకేజీ వివరాల్లో వెల్లడైంది. 5.15 అంగుళాల డిస్ ప్లే ఉండే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ ధర రూ.19,000 నుంచి రూ.26,000 మధ్యలో ఉంటున్నట్టు తెలువగా... 5.8 అంగుళాల ఫోన్ ధర సుమారు రూ.24,680 నుంచి రూ.33,226 మధ్యలో ఉండబోతున్నట్టు తెలిసింది.