ఎంఐ 6 లాంచింగ్ ఎప్పుడో చెప్పేసిన సీఈవో
ఎంఐ 6 లాంచింగ్ ఎప్పుడో చెప్పేసిన సీఈవో
Published Wed, Apr 5 2017 2:51 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
చైనీస్ టెక్ దిగ్గజం షియోమి కొత్తగా మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఎంఐ6 స్మార్ట్ ఫోన్ కోసం ఇంకా ఎన్నో రోజులు వేచిచూడాల్సిన అవసరం లేదట. ఈ నెలల్లోనే ఎంఐ6ను లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ సీఈవో లీ జూన్ తెలిపారు. ఏప్రిల్ 11 లేదా 18వ తేదీల్లో ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేయనున్నట్టు ఆ దేశీయ టెక్ వెబ్ సైట్ మైడ్రైవర్స్ రిపోర్టు చేసింది. రెండు స్క్రీన్ సైజుల్లో అంటే 5.15 అంగుళాలు, 5.18 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేలతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారని కూడా మైడ్రైవర్స్ పేర్కొంది. ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల లైనప్లో ఈ ఎంఐ 6 వస్తుందట. ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ ను కలిగి ఉటుందని తెలుస్తోంది.
ముందస్తు లీకేజీల ప్రకారం 4జీబీ, 6జీబీ వేరియంట్లను వివిధ మెమరీ ఆప్షన్లలో షియోమి లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. పెద్ద సైజు ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 64జీబీ, 128జీబీ, 256జీబీ మెమరీ ఆప్షన్లుంటాయని లీకేజీ వివరాల్లో వెల్లడైంది. 5.15 అంగుళాల డిస్ ప్లే ఉండే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ ధర రూ.19,000 నుంచి రూ.26,000 మధ్యలో ఉంటున్నట్టు తెలువగా... 5.8 అంగుళాల ఫోన్ ధర సుమారు రూ.24,680 నుంచి రూ.33,226 మధ్యలో ఉండబోతున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement