3 వేరియంట్లలో రెడ్‌మి 5ఏ వచ్చేసింది! | Xiaomi Redmi Note 5A With 16-Megapixel Front Camera, MIUI 9 Launched: Price, Specifications | Sakshi
Sakshi News home page

3 వేరియంట్లలో రెడ్‌మి 5ఏ వచ్చేసింది!

Published Tue, Aug 22 2017 9:08 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

3 వేరియంట్లలో రెడ్‌మి 5ఏ వచ్చేసింది!

3 వేరియంట్లలో రెడ్‌మి 5ఏ వచ్చేసింది!

సాక్షి: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ముఖ్యంగా ఆన్‌లైన్‌ పరంగా తిరుగులేకుండా దూసుకెళ్తున్న షావోమి, రెడ్‌మి నోట్‌ 5 సిరీస్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేసింది. రెడ్‌మి నోట్‌ 5ఏ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. మూడు వేరియంట్లతో రెండు మోడల్స్‌(స్టాండర్డ్‌ ఎడిషన్‌, హై ఎడిషన్‌)లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తంగా మూడు ర్యామ్‌, మెమరీ స్టోరేజ్‌ వేరియంట్లు ఈ మోడల్స్‌లో భాగం. బేస్‌ వేరియంట్‌ 2జీబీ ర్యామ్‌+16జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర 699 యువాన్లు అంటే సుమారు 6,700 రూపాయలు.
 
అదేవిధంగా మిగతా రెండు ప్రీమియం వేరియంట్లలో ఒకటి 3జీబీ ర్యామ్‌+32జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉండగా.. రెండోది 4జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర 899 యువాన్లు అంటే సుమారు 8,600 రూపాయలు. 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర 1,199 యువాన్లు అంటే సుమారు 11,500 రూపాయలు. ఈ మూడు వేరియంట్లు ఎంఐ.కామ్‌, జేడీ.కామ్‌లలో నేటి(మంగళవారం) నుంచే విక్రయానికి వస్తున్నాయి.
 
ఈ మూడు వేరియంట్లు షాంపైన్‌ గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌, ప్లాటినం సిల్వర్‌ రంగుల్లో లభ్యం కానున్నాయి. స్లీక్‌ మెటల్‌ యూనిబాడీ, వెనుకవైపు యాంటీనా బ్యాండ్స్‌, సింగిల్‌ కెమెరా సెటప్‌, ముందు వైపు నేవిగేషన్‌ బటన్స్‌ ఉన్నాయి. కిందివైపు యూఎస్‌బీ టైప్‌-సీ పోర్టు, డ్యూయల్‌ స్పీకర్‌ గ్రిల్స్‌, టాప్‌ ఎడ్జ్‌లో 3.5ఎంఎం ఆడియో జాక్‌, ప్రీమియం వేరియంట్లకు వెనుకైపు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌తో ఇది రూపొందింది. 
 
రెడ్‌మి నోట్‌ 5ఏ ఫీచర్ల విషయానికొస్తే...
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
లేటెస్ట్‌ ఎంఐయూఐ 9 సాఫ్ట్‌వేర్‌
రెండు సిమ్‌ స్లాట్స్‌(నానో+నానో)
మెమరీని పెంచుకోవడానికి మైక్రోఎస్డీ స్లాట్‌(128జీబీ వరకు విస్తరణ)
స్టాండర్డ్‌ వేరియంట్‌కు స్నాప్‌డ్రాగన్‌ 425 ఎస్‌ఓసీ
ప్రీమియం వేరియంట్‌కు స్మాప్‌డ్రాగన్‌ 435 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ విత్‌ యాడ్రినో 505 జీపీయూ
13 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
స్టాండర్డ్‌ వేరియంట్‌కు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
ప్రీమియం వేరియంట్లకు ఫ్రంట్‌ కెమెరా 16మెగాపిక్సెల్‌
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement