Redmi Note 5A
-
దూసుకుపోతున్న షావోమి: న్యూ రికార్డ్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ మేకర్ షావోమి దూసుకుపోతోంది. కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులతో ఇండియాలో తన సత్తా చాటుతోంది. అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ట్విటర్లో ప్రకటించారు. అమెజాన్‌లో సేల్ అవుతున్న 6 టాప్ స్మార్ట్ఫోన్లలో 5 తమవే(షావోమి) అని ట్వీట్ చేశారు. మరోవైపు రెడ్ మి 5 ఎ విక్రయాల్లో దుమ్ము రేపుతోంది. షావోమి పాపులర్ మోడల్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరిట రెడ్మీ 5ఎ భారీ సేల్స్‌ను నమోదు చేసింది. లాంచ్ అయిన నెలరోజులలోపే తమ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ భారత్‌లో మిలియన్‌కు పైగా విక్రయాలను సాధించిందని జైన్ వెల్లడించారు. లాంచ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే అన్ని మాధ్యమాల్లోనూ కలిపి ఏకంగా 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైనట్టు జైన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభ్యం. గతేడాది డిసెంబర్ 7వ తేదీన 5ఎ స్మార్ట్‌ఫోన్‌ను 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల చేసింది. మరోవైపు 2జీబీ ర్యామ్ వేరియెంట్‌పై మొదటి 50 లక్షల యూనిట్లకు రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్న నేపథ్యంలో రెడ్మీ 5ఎ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 లకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రెడ్మీ 5ఎ పీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2/3 జీబీ ర్యామ్ 16/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ New year, newer records! Once again, 5 out of the top 6 selling smartphones on @AmazonIN are all @XiaomiIndia phones! Which one of these do you use? 😉#1SmartphoneBrandXiaomi pic.twitter.com/QsxDMjiczu — Manu Kumar Jain (@manukumarjain) January 11, 2018 -
రెడ్ మి నోట్ 5 ఏ లాంచ్..ఫీచర్లు?
బీజింగ్: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ షావోమి మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్ మి 4 ఏ, రెడ్మి నోట్ 4తో అమ్మకాల సునామీ సృష్టించిన షావోమి ఈ విజయ పరంపరలో మరో డివైస్‌ను చైనాలో విడుదల చేసింది. గత నెలలో రెడ్మి నోట్ 5 ఏ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్ ప్రారంభించింది. కొత్త 4జీబీ ర్యామ్ వేరియంట్ లో దీని ధరను రూ.12వేలకు కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. పాత వెర్షన్ లోని స్నాప్ డ్రాగెన్ 425 ప్రాసెసర్ మెరుగుపర్చి( క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆధారిత 435 ప్రాసెసర్) కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్లాటినం సిల్వర్, షాంపైన్ గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్స్‌లో చైనాలో ప్రస్తుతానికి లభిస్తోంది. 2జీబీ, 16జీబీ స్టోరేజ్,ధర రూ. 6700, 3జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూ. 8645 ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టులో చైనాలో లాంచ్ చేసింది. అయితే ఈ ఏడాది చివరిలోపు ఇండియాలో కూడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అధికారిక సమాచారం వచ్చేంతవరకు ఎపుడు లాంచ్ చేయనుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. రెడ్ మీ నోట్ 5 ఏ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సదుపాయం 13 ఎంపీ రియర్ కెమెరా 16ఎంపి ఫ్రంట్‌కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
3 వేరియంట్లలో రెడ్మి 5ఏ వచ్చేసింది!
సాక్షి: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ముఖ్యంగా ఆన్లైన్ పరంగా తిరుగులేకుండా దూసుకెళ్తున్న షావోమి, రెడ్మి నోట్ 5 సిరీస్ తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. రెడ్మి నోట్ 5ఏ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. మూడు వేరియంట్లతో రెండు మోడల్స్(స్టాండర్డ్ ఎడిషన్, హై ఎడిషన్)లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తంగా మూడు ర్యామ్, మెమరీ స్టోరేజ్ వేరియంట్లు ఈ మోడల్స్‌లో భాగం. బేస్ వేరియంట్ 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర 699 యువాన్లు అంటే సుమారు 6,700 రూపాయలు. అదేవిధంగా మిగతా రెండు ప్రీమియం వేరియంట్లలో ఒకటి 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉండగా.. రెండోది 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర 899 యువాన్లు అంటే సుమారు 8,600 రూపాయలు. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర 1,199 యువాన్లు అంటే సుమారు 11,500 రూపాయలు. ఈ మూడు వేరియంట్లు ఎంఐ.కామ్, జేడీ.కామ్‌లలో నేటి(మంగళవారం) నుంచే విక్రయానికి వస్తున్నాయి. ఈ మూడు వేరియంట్లు షాంపైన్ గోల్డ్, రోజ్ గోల్డ్, ప్లాటినం సిల్వర్ రంగుల్లో లభ్యం కానున్నాయి. స్లీక్ మెటల్ యూనిబాడీ, వెనుకవైపు యాంటీనా బ్యాండ్స్, సింగిల్ కెమెరా సెటప్, ముందు వైపు నేవిగేషన్ బటన్స్ ఉన్నాయి. కిందివైపు యూఎస్బీ టైప్-సీ పోర్టు, డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్, టాప్ ఎడ్జ్‌లో 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రీమియం వేరియంట్లకు వెనుకైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఇది రూపొందింది. రెడ్మి నోట్ 5ఏ ఫీచర్ల విషయానికొస్తే... 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే లేటెస్ట్ ఎంఐయూఐ 9 సాఫ్ట్వేర్ రెండు సిమ్ స్లాట్స్(నానో+నానో) మెమరీని పెంచుకోవడానికి మైక్రోఎస్డీ స్లాట్(128జీబీ వరకు విస్తరణ) స్టాండర్డ్ వేరియంట్‌కు స్నాప్‌డ్రాగన్ 425 ఎస్ఓసీ ప్రీమియం వేరియంట్‌కు స్మాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్ విత్ యాడ్రినో 505 జీపీయూ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ స్టాండర్డ్ వేరియంట్‌కు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రీమియం వేరియంట్లకు ఫ్రంట్ కెమెరా 16మెగాపిక్సెల్ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ