Mobile Company
-
Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్‌ఫోన్.. స్పందించిన కంపెనీ
మొబైల్లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షావోమీ సంస్థ ఘటనపై స్పందించింది. బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని త్రిసూర్‌లో ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ స్మార్ట్‌ఫోన్‌లో వీడియో చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్ ఫోన్ మోడల్ రెడ్ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. (చదవండి: చేతిలో స్మార్ట్‌ఫోన్..వెన్నెముక డౌన్!) ఫోన్ పేలిన ఘటనపై రెడ్ మీ మొబైల్స్ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్ మీ మొబైల్ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు. (స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు) కాగా, మొబైల్ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్‌కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బదువాలో జరిగింది. మరో ఘటనలో 68 ఏళ్ల పెద్దాయన, చార్జ్ అవుతున్న మొబైల్లో మాట్లాతుండగా షాక్ కొట్టింది. ఆయన స్పాట్లో విగతజీవిగా మారాడు. ఇలాంటివే మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిలో ముఖ్యంగా గమనించిన అంశాలేంటంటే.. ఫోన్ చార్జింగ్‌లో ఉండగా వాడటం. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్‌టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. -
చైనాకు ఝలక్.. ఆ మొబైల్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: గత రెండు సంవత్సరాలకు చైనాకు కవ్వింపు చర్యలను తిప్పి కొట్టడంతో పాటు డ్రాగన్ కంట్రీకి సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు సరిహద్దుల్లో మాత్రమే కాదు వ్యాపారం పరంగా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అదును చూసి చెక్ పెడుతోంది. ఈ క్రమంలోనే చైనాకు సంబంధించిన పలు యాప్‌లను నిషేధిస్తూ గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడిన కేసులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని ప్రస్తుతం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని కూడా ఆర్థిక మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఒపో, షావోమీ, వివో ఇండియాలు ఇందులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఒపో విషయంలో రూ.2,981 కోట్ల పన్ను ఎగవేతలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. షావోమీ విషయంలో చెల్లించాల్సిన మొత్తం రూ.653 కోట్లు ఉంటుదని అంచనా అన్నారు. ఇక వివో ఇండియాకు రూ.2,217 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివాదాలకు సంబంధించి షావోమీ రూ.46 లక్షలు డిపాజిట్ చేస్తే, వివో ఇండియా రూ.60 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. చదవండి: Indian Railways: రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం! -
షావోమి ‘ఎన్95’ మాస్కుల పంపిణీ
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’.. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఎన్95 మాస్కులను పంపిణీ చేస్తోంది. వైరస్ కారణంగా వీటి ధర 18 రెట్లు వరకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఈ మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తూ కంపెనీ తన దాతృత్వాన్ని చాటుకుందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు సోమవారం మీడి యాకు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వాలకు ఈ వారంలో మాస్కులు, రక్షణ జాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. -
రియల్‌మి ఎక్స్2 ప్రో @ రూ. 29,999
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదలచేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. 8జీబీ/128జీబీ ధర రూ. 29,999 వద్ద నిర్ణయించింది. 12జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 33,999. వీటిలో 64–మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుందని వివరించింది. ఈ రెండు వేరియంట్లు నవంబర్ 26 నుంచి రిటైల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2018–19 ఏడాదిలో ఈ మొత్తం 3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016–17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. -
హువావే ‘మేట్ 30’ ఆవిష్కరణ
మ్యూనిక్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తన అధునాతన ‘మేట్ 30’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను గురువారం ఆవిష్కరించింది. ‘మేట్ 30’, ‘మేట్ 30 ప్రో’ పేరిట తొలి సెకండ్ జనరేషన్ ‘5జీ’ స్మార్ట్ఫోన్లను పరిచయంచేసింది. వీటిలో గూగుల్ లైసెన్స్ పొందిన యాప్స్ అయిన మ్యాప్స్, జీ మెయిల్, యూట్యూబ్ లేవని ప్రకటించింది. కిరిన్ 990 ప్రాసెసర్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మేట్ 30 స్మార్ట్‌ఫోన్.. 6.62 అంగుళాల డిస్ప్లే, 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 799 యూరోలుగా ప్రకటించింది. ‘మేట్ 30 ప్రో’ ధర 1,199 యూరోలుగా నిర్ణయించింది. -
హైదరాబాద్‌లో ఒప్పో ఆర్అండ్డీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఒప్పోకు ప్రపంచవ్యాప్తంగా 4 ఆర్అండ్డీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రంలో నూతన ఆవిష్కరణలతో పాటూ భవిష్యత్తు ఉత్పత్తులకు టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్అండ్డీ హెడ్ తస్లీమ్ ఆరీఫ్ తెలిపారు. ఈ కేంద్రంలో ఐఐటీలు సహా ప్రముఖ ఇన్స్టిట్యూట్ల నుంచి నిపుణులను నియమించుకుంటామని.. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తుల తయారీ సులువవుతుందని చెప్పారాయన. -
త్వరలో సన్నీలియోన్ స్మార్ట్ఫోన్లు!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీలియోన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో పక్కా ప్రణాళికలతోనే ముందుకు సాగుతోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. దీనిలో భాగంగానే ఓవైపు సినిమాలు చేస్తున్న సన్నీ, మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే దుస్తులు, కాస్మోటిక్ వ్యాపారంలో అడుగుపెట్టిన సన్నీ రానున్న కాలంలో మరో బిజినెస్ రంగంలో అడుగుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వ్యాపార నైపుణ్యం ఉన్న సన్నీలియోన్ కొత్త బిజినెస్‌లోకి రానుందని సమాచారం. ఇప్పటికే పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సన్నీ రానున్న కాలంలో తన పేరు మీద మొబైల్ కంపెనీ ప్రారంభించే పనిలో ఉన్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఇప్పటికే ఓ చైనా కంపెనీని సంప్రదించారట. యువతను ఆకర్శించే విధంగా పలు మోడల్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కంపెనీకలి భర్త డానియెల్‌ను మేనేజర్ గా నియమిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంబించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కొంచెం సమయం పడుతుందని ఏడాదిలోపు ఈ ఫోన్‌ను మార్కెట్లో రిలీజ్ చేస్తానని అంటోంది ఈ హాట్ బ్యూటీ. ఇక సన్నీ ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తేరా ఇంతజార్ సినిమాలో నటిస్తోంది. ఈచిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. -
95 మొబైల్ కంపెనీలొచ్చాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్లాన్ లో 95 మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయని ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. భారతదేశం ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ తయారీలో పెద్ద కేంద్రంగా మారిందన్నారు. అలాగే దేశంలో 6 కోట్ల కుటుంబాలను డిజిటల్-అక్షరాస్యతలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. 95 మొబైల్ తయారీ కర్మాగారాలు ఇండియాలోకి వచ్చాయనీ, వీటిలో 32 యూనిట్లు నోయిడా, గ్రేటర్ నోయిడాలలో ఏర్పాటయ్యాయని రవిశంకర్ ప్రసాద్చెప్పారు. కాపిటల్ ఫౌండేషన్ వార్షిక ఉపన్యాసంలో మంత్రి ఈ వివరాలు అందించారు. ప్రతి రోజు 3-4స్టార్టప్కంపెనీలను వస్తున్నాయన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు వదులుకున్న ఐఐటీయన్లు దేశానికి తిరిగి వచ్చి ఈ కంపెనీలను ప్రారంభించారని తెలిపారు. అలాగే అమెరికరన్ సిలికాన్ వ్యాలీలో 51శాతం ఐటి-ఆధారిత నూతన ఆవిష్కరణలు జరుగుతోంటే వాటిలో 14శాతం భారతీయ నిపులే సృష్టిస్తున్నారని. అలా ఇండియా పురోగతిని సాధిస్తోందన్నారు. న్యాయ శాఖా మంత్రికూడా అయిన రవిశంకర్ ప్రసాద్ డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్న సుప్రీంకోర్టును ప్రశంసించారు.దీనికి సంబంధించి డిజిటల్ గ్రిడ్‌ను సృష్టించామనీ, ఇందులో ఆరుకోట్ల ఆర్డర్లు, తీర్పులు, దాదాపు 4 కోట్ల పెండింగ్ కేసుల వివరాలు కూడా పొందుపరిచామని తెలిపారు. దీంతో ప్రజలు ఒక్క క్లిక్ ద్వారా ఈ వివరాలను, అప్డేట్స్ను పొందవచ్చని వివరించారు. -
ధోని పేరు దుర్వినియోగం!
ఢిల్లీ:గతంలో ఓ మొబైల్ కంపెనీతో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చేసుకున్న ఒప్పందం ముగిసినప్పటికీ సదరు కంపెనీ అతిక్రమణకు పాల్పడటంతో ఆ కేసు మరోసారి కోర్టుకు చేరింది. తనతో మ్యాక్స్ మొబిలింక్ ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్న బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందం నాలుగేళ్ల క్రితమే ముగిసినా, ఇంకా ఆ కంపెనీ తన పేరును వాడుకోవడంపై ధోని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి గతేడాది ఏప్రిల్ 21వ తేదీన కోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసినా, వాటిని కంపెనీ ఉల్లఘించింది. ఈ మేరకు ధోని దాఖలు చేసిన పిటిషన్ తో మరోసారి విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. తన ఆదేశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఆ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కచ్చితంగా కోర్టు మార్గదర్శకాల్ని అమలు చేయాల్సిన కంపెనీ అతిక్రమణకు పాల్పడాటాన్ని తప్పుబట్టింది. ఇంకా అతని పేరును కమర్షియల్‌గా వాడుకోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. దీనిలో భాగంగా కోర్టు ధిక్కారణకు పాల్పడిన ఆ కంపెనీ ఉన్నతాధికారుల్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నేళ్ల క్రితం మ్యాక్స్ మొబిలింక్ కంపెనీతో ధోని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం 2012 డిసెంబర్ నెల నాటికి ముగిసింది. అయినప్పటికీ ధోని పేరున తమ వెబ్సైట్ల నుంచి ఆ కంపెనీ తొలగించలేదు. దాంతోపాటు ధోని పేరును దుర్వినియోగం చేస్తూ తమ మార్కెటింగ్ ను కొనసాగిస్తోంది. దీనిపై గతంలో ఢిల్లీ హైకోర్టును ధోని ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే ధోని పేరును వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ ధోని పేరుతోనే ఆ కంపెనీ మార్కెటింగ్ నిర్వహించడంతో ఆ కేసు మరోసారి కోర్టుకు చేరింది. -
ద్రవ్యోల్బణం తక్కువా.. ఎలా?
అధిక వడ్డీ రేట్ల విధానంపై విమర్శకులకు రాజన్ సవాల్ పరిస్థితులు మెరుగైతే వృద్ధి అంచనాల్లో మార్పులు ప్రతీ గ్రామానికీ బ్యాంకు సాధ్యం కాదు పోస్ట్ బ్యాంకు, మొబైల్ కంపెనీల రాకతో పరిస్థితులు మారతాయని ఆశాభావం ముంబై: అధిక వడ్డీ రేట్ల విధానంతో వృద్ధికి అడ్డుపడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తిప్పికొట్టారు. తనను విమర్శించే వారు ముందుగా ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉందని చూపించాలంటూ సవాల్ చేశారు. అడ్డంకులున్నా దేశ జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ స్థానంలో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రశ్నకు పరపతి విధానం (ఆగస్ట్ 9న) వరకు వేచి చూడాలని కోరారు. తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. పలు అంశాలపై రాజన్ మీడియా ప్రతినిధుల ముందు తన అభిప్రాయాలను ఆవిష్కరించారు. విమర్శకులకు సవాల్ వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతున్నారని, వృద్ధికి అడ్డు పడుతున్నారన్న విమర్శలపై నేను దృష్టి పెట్టను. వరుసగా నాలుగో నెల జూన్‌లోనూ వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగి 5.77 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. మా పాలసీ రేటు 6.5 శాతంగానే ఉంది. ఈ అంశంపై జరిగే చర్చ ఆర్థిక ప్రాతిపదికన కాకుండా ఉండాలి’ అని అన్నారు. తనను విమర్శించే వారు... వడ్డీ రేట్లను తగ్గించేందుకు ద్రవ్యోల్బణం తక్కువగానే ఎలా ఉందో చెప్పాలని సవాల్ చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధికే పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు ఇటీవలి కాలంలో రాజన్ విధానాలను తప్పుబట్టిన విషయం తెలిసిందే. వృద్ధి కోణం నుంచి... ‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతమున్న సవాళ్లే కొంత కాలం పాటు కొనసాగుతాయి. ఆర్థిక పురోగతి తీరుపై ఎంతో నిరుత్సాహం నెలకొని ఉంది. కానీ, రెండేళ్ల వరుస కరువుతోపాటు అంతర్జాతీయంగా మందగమనం నెలకొని ఉంది. అలాగే, బ్రెగ్జిట్ వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు సైతం ఎదురయ్యాయి. ఈ అడ్డంకులున్నా దేశీయ వృద్ధి మంచిగానే ఉంది. వర్షాలు తగినంత కురిస్తే వ్యవసాయ రంగం మెరుగుపడుతుంది. గ్రామీణ వినియోగం పెరగడం ద్వారా మొత్తం మీద ఆర్థిక రంగం ఊపందుకుంటుంది. కానీ, ఇవి అంచనాలే. వాస్తవంగా ఏం జరుగుతుందో చూడాలి’ అని రాజన్ వివరించారు. మంచి వర్షాలు కురిసి, అంతర్జాతీయ ఆర్థిక రంగం మెరుగుపడితే జీడీపీ 7.6 శాతంగా ఉంటుం దన్న తమ అంచనాల్లో మార్పు ఉంటుందన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని చెప్పారు. బ్యాంకు శాఖలపై... అందరికీ ఆర్థిక సేవల అందుబాటు (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) గురించి రాజన్ మాట్లాడుతూ... ‘ప్రతీ గ్రామంలో బ్యాంకు శాఖ ఉండడం అన్నది సాధ్యం అయ్యేది కాదు. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కొన్ని బ్యాంకులు మొబైల్ బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నాయి. వాహన రూపంలో ఉండే ఈ బ్రాంచ్ గ్రామాలలో తిరుగుతూ ప్రతీ గ్రామంలో నిర్ధిష్ట సమయం మేరకు సేవలు అందిస్తుంది. అలాగే, చిన్న, సూక్ష్మ శాఖల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉంది. పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు లెసైన్స్ జారీ చేశాం. మొబైల్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. ఓ మొబైల్ కంపెనీకి 1.5 లక్షల విక్రయ కేంద్రాలు ఉంటే వాటన్నింటి ద్వారా నగదు జమ, ఉపసంహరణకు అవకాశం ఏర్పడుతుంది. ఇది నిజంగా వ్యవస్థనే మార్చే పరిణామం. ఈ నెల చివరిలోపు రానున్న యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా నగదు బదిలీ సులభతరం కానుంది’ అని రాజన్ వివరించారు. అనుభవాలపై పుస్తకం రాయను... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తాజాగా తన అనుభవాలను ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్’ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో విలేకరుల ప్రశ్నకు రాజన్ స్పందించారు. గవర్నర్ గిరీ నుంచి తప్పకున్న తర్వాత విద్యా సంబంధింత అంశాలపై మాత్రం పుస్తకాలు రాస్తానని చెప్పారు. బ్యాంకుల ఆందోళనలపై... రుణాల విషయంలో దర్యాప్తు సంస్థల నుంచి తమకు రక్షణ కల్పించాలన్న బ్యాంకర్ల డిమాండ్‌ను రాజన్ సమర్థించలేదు. ఈ విషయంలో నిబంధనల మేరకు నడచుకోవడమే రక్షణాత్మక విధానంగా సూచించారు. ‘రుణాల విషయంలో తాము తీసుకున్న చర్యలకు బాధ్యులను చేయరాదంటూ బ్యాంకర్లు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే, రుణాలు ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు, విధానాల మేరకు నడచుకోవాలి. లేకుంటే ప్రక్షాళన సాధ్యం కాదు. రుణాల జారీలో బాధ్యతాయుతంగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటే... చర్యలకు వారు బాధ్యులు కారు. కానీ, ఒక్కోసారి నిర్ణయాల్లో తప్పిదం జరుగుతోంది’ అని రాజన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. -
అసుస్ పాడ్‌ఫోన్ మినీ@రూ.15,999
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ కంపెనీ అసుస్ పాడ్‌ఫోన్ మినీని మార్కెట్లోకి తెచ్చింది. 4 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ ఫోన్ ధర రూ. 15,999 అని అసుస్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 7 అంగుళాల ట్యాబ్గా కూడా దీనిని మార్చుకోవచ్చని అసుస్ ఇండియా కంట్రీ మేనేజర్ (సిస్టమ్ బిజినెస్ గ్రూప్) పీటర్ చంగ్ పేర్కొన్నారు. దీంతో పాటు ట్రాన్స్ఫార్మర్ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లను, మరో ఆల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్‌ను, ఒక ట్యాబ్‌ను కూడా అందిస్తున్నామని వివరించారు. వినూత్నమైన ఫీచర్లతో ఈ ట్రాన్స్ఫార్మర్ ఫ్లిప్బుక్ (ల్యాప్‌టాప్‌లు-ధరలు రూ.47,999, 53,999), ట్రాన్స్ఫార్మర్ 200(ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్- ధర రూ.35,999), ట్రాన్స్ఫార్మర్ ప్యాడ్ టీఎఫ్103(ట్యాబ్-ధర రూ.19,999)లను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా జెన్‌ఫోన్ సిరీస్ కోసం ‘లైవ్ ద జెన్ లైఫ్ విత్ రణ్విజయ్’ ప్రచారాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రముఖ టీవీ హోస్ట్, సినిమా నటుడు, ప్రెజంటర్ అయిన రణ్‌విజయ్‌తో ఈ వినూత్న కార్యక్రమాన్ని ఐదు వారాల పాటు నిర్వహిస్తామని వివరించారు. ఈ సందర్భంగా జెన్ ఫోన్ ఫీచర్లు బావుంటాయని రణ్విజయ్ వ్యాఖ్యానించారు. -
3వ స్థానానికి ఎగబాకిన 'షియోమి'
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ షియోమి మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో మూడో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ధగా అవతరించింది. భారత్ లాంటి అత్యంత మొబైల్ వినియోగం ఉన్న దేశాల్లో ఈఫోన్ను నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. మొదటి స్ధానంలో కొరియా కంపెనీ స్యామ్సంగ్ ఉండగా, ఆ తరువాత స్ధానంలో యాపిల్ కంపెనీ ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను షియోమి కంపెనీ నేరుగా ఆన్లైన్లో విక్రయించడం ద్వారా కస్టమర్లకు బాగా చేరువైంది. వచ్చే ఏడాది నాటికి 100 మిలియన్ల ఫోన్ విక్రయాలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా స్యామ్సంగ్ వాటా 24.7శాతంకు పడిపోయింది. యాపిల్ ఫోన్ మార్కెట్ వాటా కూడా పడిపోవడంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే షియోమి కంపెనీ వాటా 5.6 శాతంకు చేరింది. దాంతో ఇది మూడవ స్థానానికి ఎగబాకింది. ** -
ఇక కనీస డౌన్లోడ్ స్పీడ్ చెప్పాల్సిందే..
ఆగస్టు 23 నుంచి మొబైల్ కంపెనీలకు అమలు న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఇకనుంచి టెలికం కంపెనీలు తమ యూజర్లకు(మొబైల్, డాంగిల్) కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. తాజాగా నియంత్రణ సంస్థ ట్రాయ్ వైర్లెస్ డేటా సర్వీసుల నిబంధనల నాణ్యతా ప్రమాణాల్లో చేసిన సవరణే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 23 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా వివిధ డేటా ప్లాన్ల వాడకం సమయంలో కనీసం 80 శాతానికి తక్కువకాకుండా ఈ చెప్పిన డౌన్లోడ్ వేగాన్ని టెల్కోలు తప్పకుండా అందించాల్సి ఉంటుంది. అయితే, కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతుండాలనేది నిర్ధేశించలేదు. ఈ ఏడాది మే నాటికి దేశంలో మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ ద్వారా సుమారు 5 కోట్ల మంది ప్రజలు వైర్లెస్ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు అంచనా. టెల్కోలు ట్రాయ్‌కు తెలిపిన సమాచారం మేరకు అత్యంత వేగవంతమైన 3జీ సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ సెకనుకు 399 కిలోబైట్ల(కేబీపీఎస్) నుంచి 2.48 మెగాబైట్లు(ఎంబీపీఎస్) వరకూ ఉంటోంది. 3జీ, సీడీఎంఏ, ఈవీడీఓ సేవల్లో కనీస డౌన్లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గాను, జీఎస్ఎం, సీడీఎంఏ-2జీలకు 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా ఉండాలనేది ట్రాయ్ సూచన. బాడ్బ్యాండ్కు కనీస స్పీడ్ 512 కేబీపీఎస్‌గా ఉండాలని ట్రాయ్ నోటిఫై చేయడం తెలిసిందే. టెలికం కంపెనీలు తమ ప్రచారంలో ఇష్టానుసారం స్పీడ్‌ను ప్రకటిస్తూ.. యూజర్లకు మాత్రం ఆస్థాయిలో సేవలను కల్పించడంలేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యలకు ఉపక్రమించింది.