సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్లాన్ లో 95 మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయని ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. భారతదేశం ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ తయారీలో పెద్ద కేంద్రంగా మారిందన్నారు. అలాగే దేశంలో 6 కోట్ల కుటుంబాలను డిజిటల్-అక్షరాస్యతలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
95 మొబైల్ తయారీ కర్మాగారాలు ఇండియాలోకి వచ్చాయనీ, వీటిలో 32 యూనిట్లు నోయిడా, గ్రేటర్ నోయిడాలలో ఏర్పాటయ్యాయని రవిశంకర్ ప్రసాద్‌చెప్పారు. కాపిటల్ ఫౌండేషన్ వార్షిక ఉపన్యాసంలో మంత్రి ఈ వివరాలు అందించారు. ప్రతి రోజు 3-4స్టార్టప్‌కంపెనీలను వస్తున్నాయన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు వదులుకున్న ఐఐటీయన్లు దేశానికి తిరిగి వచ్చి ఈ కంపెనీలను ప్రారంభించారని తెలిపారు. అలాగే అమెరికరన్ సిలికాన్ వ్యాలీలో 51శాతం ఐటి-ఆధారిత నూతన ఆవిష్కరణలు జరుగుతోంటే వాటిలో 14శాతం భారతీయ నిపులే సృష్టిస్తున్నారని. అలా ఇండియా పురోగతిని సాధిస్తోందన్నారు.
న్యాయ శాఖా మంత్రికూడా అయిన రవిశంకర్ ప్రసాద్ డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్న సుప్రీంకోర్టును ప్రశంసించారు.దీనికి సంబంధించి డిజిటల్ గ్రిడ్‌ను సృష్టించామనీ, ఇందులో ఆరుకోట్ల ఆర్డర్లు, తీర్పులు, దాదాపు 4 కోట్ల పెండింగ్ కేసుల వివరాలు కూడా పొందుపరిచామని తెలిపారు. దీంతో ప్రజలు ఒక్క క్లిక్ ద్వారా ఈ వివరాలను, అప్‌డేట్స్‌ను పొందవచ్చని వివరించారు.