యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గణనీయమైన పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత నెలలో (2023 ఆగష్టు) యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. అంటే దీని విలువ సుమారు రూ. 15.18 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
జులై (9.88 బిలియన్స్) నెల కంటే ఆగష్టు (10.24 బిలియన్స్) నెలలో యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరిగినట్లు స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలు జరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు 'విజయసాయి రెడ్డి' ట్వీట్ చేస్తూ.. 2023 ఆగష్టు నెలలో యూపీఐ ట్రాన్సక్షన్స్ 10 బిలియన్ మార్కుని దాటాయి. ఇది గొప్ప విజయమనే చెప్పాలి. ఇండియాలో యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయని ఈ డేటా స్పష్టం చేస్తోంది. డిజిటల్ ఇండియా కల సాకారమయ్యేలా కనిపిస్తోందన్నారు.
डिजिटल इंडिया का सपना साकार होता नजर आ रहा है। अगस्त 2023 में यूपीआई लेनदेन 10 बिलियन के आँकड़े को पार कर गया। यह बहुत बड़ी उपलब्धि है। इस आँकड़े से साफ है कि भारत में यूपीआई लेनदेन बढ़ रहा है। pic.twitter.com/2JKr4L112Z
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 4, 2023
Comments
Please login to add a commentAdd a comment