IT Minister Ravi Shankar
-
పెట్రో మంట పరిష్కారానికి కృషి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజూ పెరగడంపై న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ స్పందించారు. అంతర్జాతీయంగా అస్థిరత, ముడిచమురు ధరల్లో మార్పులు వంటి సమస్యలకు ప్రజలు ప్రభావితం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బుధవారం నాడిక్కడ ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం రూ.25 వరకూ తగ్గించవచ్చని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చేసిన ట్వీట్లపై వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి చిదంబరం ట్విటర్లో చురుగ్గా మారారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ అమలు ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందన్నారు. మొబైల్ కనెక్టివిటీ రెండో విడతలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 96 జిల్లాల్లో రూ.7,330 కోట్లతో 4,072 టవర్లను 2జీ, 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 8 జిల్లాల్లో 429, తెలంగాణలో 14 జిల్లాల్లో 118 టవర్ లోకేషన్లు గుర్తించామన్నారు. దేశంలో తొలిæ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని మణిపూర్‌లో ఏర్పాటు చేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తెస్తామన్నారు. -
95 మొబైల్ కంపెనీలొచ్చాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్లాన్ లో 95 మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయని ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. భారతదేశం ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ తయారీలో పెద్ద కేంద్రంగా మారిందన్నారు. అలాగే దేశంలో 6 కోట్ల కుటుంబాలను డిజిటల్-అక్షరాస్యతలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. 95 మొబైల్ తయారీ కర్మాగారాలు ఇండియాలోకి వచ్చాయనీ, వీటిలో 32 యూనిట్లు నోయిడా, గ్రేటర్ నోయిడాలలో ఏర్పాటయ్యాయని రవిశంకర్ ప్రసాద్చెప్పారు. కాపిటల్ ఫౌండేషన్ వార్షిక ఉపన్యాసంలో మంత్రి ఈ వివరాలు అందించారు. ప్రతి రోజు 3-4స్టార్టప్కంపెనీలను వస్తున్నాయన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు వదులుకున్న ఐఐటీయన్లు దేశానికి తిరిగి వచ్చి ఈ కంపెనీలను ప్రారంభించారని తెలిపారు. అలాగే అమెరికరన్ సిలికాన్ వ్యాలీలో 51శాతం ఐటి-ఆధారిత నూతన ఆవిష్కరణలు జరుగుతోంటే వాటిలో 14శాతం భారతీయ నిపులే సృష్టిస్తున్నారని. అలా ఇండియా పురోగతిని సాధిస్తోందన్నారు. న్యాయ శాఖా మంత్రికూడా అయిన రవిశంకర్ ప్రసాద్ డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్న సుప్రీంకోర్టును ప్రశంసించారు.దీనికి సంబంధించి డిజిటల్ గ్రిడ్‌ను సృష్టించామనీ, ఇందులో ఆరుకోట్ల ఆర్డర్లు, తీర్పులు, దాదాపు 4 కోట్ల పెండింగ్ కేసుల వివరాలు కూడా పొందుపరిచామని తెలిపారు. దీంతో ప్రజలు ఒక్క క్లిక్ ద్వారా ఈ వివరాలను, అప్డేట్స్ను పొందవచ్చని వివరించారు. -
మేక్ ఇన్ తెలంగాణ
- పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం - ఢిల్లీలో వివిధ దేశాల ప్రతినిధులను కలసి వివరించిన కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ : ‘మేక్ ఇన్ తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను భారీగా ఆకర్షించే లక్ష్యంతో రెండ్రోజుల హస్తిన పర్యటనకు శ్రీకారంచుట్టిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం తొలి రోజు వివిధ దేశాల ప్రతినిధులను కలుసుకున్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకు కల్పిస్తున్న అనువైన వాతావరణం తదితర అంశాల గురించి వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆయా పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9.30 గంటలకు జపాన్ ఎంబసీలో ఉప రాయబారి యుపక కికుటను కేటీఆర్ కలసి తెలంగాణ పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం, సులభతరమైన పెట్టుబడి విధానాలను వివరించారు. మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా జపాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం మలేసియా ఉప ప్రధాని డాక్టర్ అహ్మద్ జహీద్ హమీదితో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నెలకొన్న అనువైన వాతావరణం గురించి ఆయనకు వివరించారు. ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌తో భేటీ అయిన కేటీఆర్...హైదరాబాద్‌లో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటులో భాగస్వామిగా ఉండాలని కోరారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో డిజిటైజేషన్ కార్యక్రమాలను ఈ సదస్సులో వివరించారు. ఆపై తైవాన్ రాయబారి చుంగ్ కవాంగ్ తైన్, దక్షిణ కొరియా రాయబారి హ్యున్ ఛోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలను వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆయా దేశాల పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశాలు ముగిశాక కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను కలసి తెలంగాణలో ఆయా పరిశ్రమల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి సహకారానికి జపాన్ హామీ... తొలి రోజు పర్యటన వివరాలను కేటీఆర్ మీడియాకు వివరిస్తూ ‘‘ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఐటీ, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులను కలిశా. మేక్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో జపాన్‌కు సంబంధించిన పెద్ద సంస్థలను ఆహ్వానించేందుకు ఆ దేశంలో పర్యటించాలనుకుంటున్నాం. అందుకు సహకరించాలని కోరేందుకు జపాన్ ఎంబసీలో హైకమిషన్ అధికారిని కలిశాను. పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. మన విధానాలు, పెట్టుబడులకుగల అవకాశాలను వివరించాం. అలాగే దక్షిణ కొరియా, తైవాన్ దేశాల ప్రతినిధులు, మలేసియా ఉప ప్రధానితోనూ సమావేశమయ్యాను. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సెంటర్ క్యాంపస్‌లో భాగస్వామిగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్‌ను కలసి విజ్ఞప్తి చేయగా త్వరలోనే ఒక బృందాన్ని పంపి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. హడ్కో, నేషనల్ హౌసింగ్ బోర్డు సీఈవోను కలిశాం. తెలంగాణకు సంబంధించి మిషన్ భగీరథ, హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ. 745 కోట్ల రుణం కావాలని అడిగాం. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. డిజైనింగ్ ఏ స్మార్ట్ నేషన్ అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సదస్సులో డిజిటైజేషన్లో ఐటీ పాత్రపై చర్చ జరిగింది. తెలంగాణలో తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను వివరించాం. మంత్రి కల్రాజ్ మిశ్రాను కలిశాం. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల సమస్యలను చర్చించాం. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరానీని బుధవారం కలసి తెలంగాణకు అవసరమైన సాయాన్ని కోరుతాం’’ అని చెప్పారు. ప్రధాని పర్యటన ఖరారు కాలేదు... తెలంగాణలో ప్రధాని పర్యటనకు సంబంధించి మీడియా ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ ప్రధాని పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. ‘‘తెలంగాణలో పర్యటించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (సోమవారం) ఆహ్వానించారు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. ప్రధాని వస్తారని ఆశిస్తున్నా. సుహృద్భావ వాతావరణంలో ప్రధానితో సీఎం సమావేశం జరిగింది’’ అని వివరించారు. ఐటీఐఆర్‌ను మళ్లీ కేబినెట్‌కు తీసుకెళ్లి రీ డిజైన్ చేస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పారని ఓ ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. -
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో...రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు
ఐటీ మంత్రి రవిశంకర్ వెల్లడి న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. 2014 వరకూ రూ.11,700 కోట్లుగా ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.28 లక్షల కోట్లకు పైగా పెరిగాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం, రాష్ట్రాలది కీలకమైన పాత్ర అని వివరించారు. భారత్ టెక్నాలజీ వేగంగా అందుకుంటోందని, ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. టైమ్స్ నెట్వర్క్ ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతీయులు ముందుగా టెక్నాలజీని గమనిస్తారని, తర్వాత దానిని వినియోగిస్తారని, ఆ తర్వాత సాధికారత సాధిస్తారని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఆధార్‌తో రూ.50 వేల కోట్ల ఆదా.. వంద కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులున్నారని, దాదాపు 99 కోట్ల మందికి ఆధార్ కార్డులిచ్చామని, ఆధార్ అనుసంధాన బ్యాంక్ అకౌంట్లకు నేరుగా సబ్సిడీలు చెల్లించడం ద్వారా రూ.50,000 కోట్లు ఆదా చేశామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో ఈ కామర్స్ జోరుగా వృద్ధి సాధిస్తోందని, ఈ కామర్స్‌ను వినియోగిస్తున్న వారిలో 60 శాతం మంది చిన్న పట్టణాల ప్రజలేనని వివరించారు. 2.2 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానం చేసే కార్యక్రమంలో భాగంగా 1.3 లక్షల కి.మీ. మేర కొత్త పైప్లైన్లను వేశామని, 1.10 లక్షల కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ వేశామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసి ఈ-బిజినెస్, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్, ఇతర ప్రాజెక్టులను గ్రామాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న నగరాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్(బీపీఓ) జోరు పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇప్పటివరకూ 78 కంపెనీలు 190 నగరాల్లో బీపీఓ సెం టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని వివరించారు.