న్యూఢిల్లీ: గత రెండు సంవత్సరాలకు చైనాకు కవ్వింపు చర్యలను తిప్పి కొట్టడంతో పాటు డ్రాగన్ కంట్రీకి సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు సరిహద్దుల్లో మాత్రమే కాదు వ్యాపారం పరంగా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అదును చూసి చెక్ పెడుతోంది. ఈ క్రమంలోనే చైనాకు సంబంధించిన పలు యాప్‌లను నిషేధిస్తూ గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడిన కేసులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ విషయాన్ని ప్రస్తుతం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని కూడా ఆర్థిక మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఒపో, షావోమీ, వివో ఇండియాలు ఇందులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఒపో విషయంలో రూ.2,981 కోట్ల పన్ను ఎగవేతలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. షావోమీ విషయంలో చెల్లించాల్సిన మొత్తం రూ.653 కోట్లు ఉంటుదని అంచనా అన్నారు. ఇక వివో ఇండియాకు రూ.2,217 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివాదాలకు సంబంధించి షావోమీ రూ.46 లక్షలు డిపాజిట్ చేస్తే, వివో ఇండియా రూ.60 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు.
చదవండి: Indian Railways: రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం!
Comments
Please login to add a commentAdd a comment