మ్యూనిక్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తన అధునాతన ‘మేట్ 30’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను గురువారం ఆవిష్కరించింది. ‘మేట్ 30’, ‘మేట్ 30 ప్రో’ పేరిట తొలి సెకండ్ జనరేషన్ ‘5జీ’ స్మార్ట్‌ఫోన్లను పరిచయంచేసింది. వీటిలో గూగుల్ లైసెన్స్ పొందిన యాప్స్ అయిన మ్యాప్స్, జీ మెయిల్, యూట్యూబ్ లేవని ప్రకటించింది. కిరిన్ 990 ప్రాసెసర్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మేట్ 30 స్మార్ట్‌ఫోన్.. 6.62 అంగుళాల డిస్‌ప్లే, 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 799 యూరోలుగా ప్రకటించింది. ‘మేట్ 30 ప్రో’ ధర 1,199 యూరోలుగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment