![Realme X2 Pro, Realme 5s launched in India - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/21/Untitled-3.jpg.webp?itok=7zLNTunp)
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదలచేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. 8జీబీ/128జీబీ ధర రూ. 29,999 వద్ద నిర్ణయించింది. 12జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 33,999. వీటిలో 64–మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుందని వివరించింది. ఈ రెండు వేరియంట్లు నవంబర్ 26 నుంచి రిటైల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2018–19 ఏడాదిలో ఈ మొత్తం 3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016–17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment