New Handsets
-
రియల్‌మి ఎక్స్2 ప్రో @ రూ. 29,999
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదలచేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. 8జీబీ/128జీబీ ధర రూ. 29,999 వద్ద నిర్ణయించింది. 12జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 33,999. వీటిలో 64–మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుందని వివరించింది. ఈ రెండు వేరియంట్లు నవంబర్ 26 నుంచి రిటైల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2018–19 ఏడాదిలో ఈ మొత్తం 3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016–17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. -
తెగిన చేతులు తిరిగొచ్చాయ్..
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యుదాఘాతంతో రెండు చేతులూ కోల్పోయి వికలాంగుడిగా మారిన యువకుడికి తిరిగి రెండు చేతులూ వచ్చాయి. చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రి వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి దాత ఇచ్చిన రెండు చేతులను విజయవంతంగా అమర్చింది. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల చరిత్రలోనే ఇది తొలి శస్త్రచికిత్సగా రికార్డులకెక్కింది. తమిళనాడు ప్రభుత్వం అతడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల చరిత్రలోనే ప్రథమం దిండుగల్లు జిల్లా ఆత్తూరు సమీపం పోడికామన్వాడిలోని పేద కుటుంబానికి చెందిన 30 ఏళ్ల నారాయణస్వామి భవన నిర్మాణ కార్మికుడు. పనుల్లో భాగంగా ఇంటిపై స్లాబ్ వేస్తూ పొడవాటి ఇనుప కమ్మీని పైకెత్తగా పైనున్న హైటెన్షన్ వైరు తగిలి.. మోచేతి వరకు అతడి రెండు చేతులు పూర్తిగా కరిగి తెగిపోయాయి. 2015 ఆగస్టు 2న ఈ ఘటన జరిగింది. కోయంబత్తూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకుండా పోయింది. దిండుగల్లు జిల్లా కలెక్టర్ డీజీ వీణ సిఫార్సు మేరకు గతేడాది చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. దాతలు ఎవరైనా ముందుకొస్తే వారి నుంచి సేకరించి రెండు చేతులను అమర్చవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. బాధితుడి సమీప బంధువు బ్రెయిన్ డెడ్‌కు గురికాగా రెండు చేతులూ దానం చేసేందుకు అతడి కుటుంబీకులు అంగీకరించారు. గతేడాది ఫిబ్రవరి 7న నారాయణస్వామిని హుటాహుటిన విమానంలో చెన్నైకి రప్పించారు. ఆస్పత్రిలోని అవయవదానం విభాగాధిపతి డాక్టర్ వి.రమాదేవి నేతృత్వంలో 75 మందితో కూడిన వైద్యుల బృందం 13 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఏడాదిపాటు వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకున్న నారాయణస్వామి ఈ నెల 4న స్వగ్రామానికి చేరుకున్నాడు. దాత నుంచి చేతులు సేకరించి మరొకరికి అమర్చడం తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో ఇదే ప్రథమం అని డాక్టర్ రమాదేవి మంగళవారం మీడియాతో చెప్పారు. ఇదిలా ఉండగా బాధితుడికి దిండుగల్లు జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి వార్డు మేనేజర్‌గా ఉద్యోగమిస్తూ సీఎం పళనిస్వామి ఉత్తర్వులిచ్చారు. -
కొత్త ఐఫోన్ ఆర్డర్లు అదిరే!
శాన్‌ఫ్రాన్సికో: కొత్త ఐఫోన్(6ఎస్, 6ఎస్ ప్లస్)కు ముందస్తు ఆర్డర్లు కళ్లు చెదిరే స్థాయిలో వస్తున్నాయని యాపిల్ కంపెనీ తెలిపింది. గతేడాది కొత్త హ్యాండ్‌సెట్స్‌కు వచ్చిన ముందస్తు ఆర్డర్ల (తొలివారం 10 మిలియన్ యూనిట్లు) రికార్డును తాజా ఐఫోన్ మోడల్ తలదన్నే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రెండు మొబైల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపింది. కాగా, 12 దేశాల్లో ఈ నెల 25న ఈ కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత్‌లో అక్టోబర్ 27న ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్‌లు విడుదల అవుతాయని అంచనా.